ప్రారంభించిన కేంద్రమంత్రి మహేంద్రనాథ్ పాండే సామాజిక సారథి, హైదరాబాద్: విద్యుత్ వాహనాల తయారీలో అగ్రగామి మేఘా ఇంజనీర్ అనుబంధ ఓలే ఎలక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ సంస్థకు చెందిన బస్సులను గోవాలో శనివారం కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే ప్రారంభించారు. ఇక్కడ జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరయ్యారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వాహనాల తయారీకి ప్రోత్సహకాలు అందిస్తున్న దృష్ట్యా దేశంలోనే అతిపెద్ద […]
సారథిన్యూస్, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో కొన్ని నిబంధనలతో 25 శాతం బస్సులు నడిపిందేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. నిబంధనలు అమలు చేస్తూ అన్ని రూట్లలో బస్సులు నడపనున్నట్టు సమాచారం. ఈ మేరకు గురువారం రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ వెల్లడించారు. కరోనా లాక్ డౌన్ అప్పటి నుంచి హైదరాబాద్‌లో బస్సులు ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం నుంచి బస్సులు తిరిగి ప్రారంభం కానున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం 29 డిపోలలో ఉన్న దాదాపు 2800 […]
సారథిన్యూస్, హైదరాబాద్: కరోనా ఆంక్షలతో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న తెలంగాణ ఆర్టీసీకి కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. డీజిల్ ధరలు అమాంతం పెరుగడంతో సంస్థ నష్టాల్లో కూరుకుపోతున్నది.దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న డీజిల్ ధరలు..సంస్థకు మోయలేని భారంగా మారాయి. ఓ వైపు ఆక్యుపెన్సీ లేక.. మరోవైపు పెట్రో భారం కలిసి పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోతోంది తెలంగాణ ఆర్టీసీ. కరోనా నిబంధనల వల్ల తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో సగం సీట్లలోనే ప్రయాణికుల్ని అనుమతిస్తున్నారు. వైరస్ భయంతో ప్రజలు ఆ సగం […]
ఏపీలో ఆర్టీసీ బస్సులు ప్రారంభం సిటీ సర్వీసులకు అనుమతి లేదు నగదురహిత టికెట్ లు జారీ సారథి న్యూస్, అనంతపురం, శ్రీకాకుళం: కరోనా వ్యాప్తి.. లాక్ డౌన్ నేపథ్యంలో డిపోలకే పరిమితమైన ఏపీఎస్ఆర్టీసీ బస్సులు 58 రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో గురువారం ఉదయం ఎట్టకేలకు రోడ్డెక్కాయి. ప్రభుత్వం లాక్ డౌన్ ఆంక్షలను సడలించడంతో విజయవాడ, విశాఖ సిటీ సర్వీసులు మినహా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్ సర్వీసులు రాకపోకలు సాగించాయి. ఆన్‌లైన్ బుకింగ్ కూడా బుధవారం సాయంత్రం నుంచే […]
70 శాతం సర్వీసులు మాత్రమే: ఏపీఎస్ఆర్టీసీ ఎండీ సారథి న్యూస్, విజయవాడ: గురువారం ఉదయం 7 గంటల నుంచి బస్సు సర్వీసులను ప్రారంభిస్తున్నామని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ తెలిపారు. నెమ్మదిగా సంస్థ ఆర్థిక వృద్ధిని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బుధవారం మీడియాకు వెల్లడించారు. సిటీ బస్సు సర్వీసులను తర్వాత ప్రారంభిస్తామన్నారు. కరోనా వ్యాప్తి.. లాక్ డౌన్ నేపథ్యంలో సమారు రెండు నెలలుగా ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర […]