Breaking News

BEJJANKI

నిషేధిత గుట్కాల పట్టివేత

నిషేధిత గుట్కాల పట్టివేత

సారథి న్యూస్, హుస్నాబాద్: ప్రభుత్వ నిషేధిత గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నట్లు బెజ్జంకి ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. మండల కేంద్రంలో పొగాకు, గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో పట్టణంలోని పలు కిరాణా షాపుల్లో పోలీస్ సిబ్బందితో తనిఖీలు నిర్వహించగా రూ.42,800 విలువైన అంబర్, గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ప్రభుత్వం నిషేధించిన పొగాకు గుట్కా ప్యాకెట్లు అమ్ముతున్న ఏ.సంతోష్, ఎం.రమేష్, డి.నాగరాజు, ఎండీ మసూద్ హైమద్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

Read More
రాకపోకలకు తాత్కాలిక బ్రేక్​

రాకపోకలకు తాత్కాలిక బ్రేక్​

సారథి న్యూస్, బెజ్జంకి: సిద్దిపేట జిల్లా అల్వాల్ గ్రామ శివారులో వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా సిద్దిపేట, అల్వాల్ వైపునకు వెళ్లే రోడ్డును దుబ్బాక సీఐ హరికృష్ణ గౌడ్, మిరుదొడ్డి ఎస్సై శ్రీనివాస్ తాత్కాలికంగా మూసివేశారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పారుతున్నందున ప్రయాణికులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం గ్రామాల సర్పంచ్​లు, రెవెన్యూ అధికారులతో ప్రతిరోజు మాట్లాడుతున్నామని వివరించారు.

Read More
శాంతియుతంగా బక్రీద్​

బక్రీద్​ శాంతియుతంగా జరుపుకోండి

సారథి న్యూస్, బెజ్జంకి: ముస్లిం సోదరులు బక్రీద్​ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని చేర్యాల సీఐ శ్రీనివాసరెడ్డి సూచించారు. బుధవారం ఆయన కరీంనగర్​ జిల్లా చేర్యాలలో ముస్లిం మత పెద్దలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. గోవులను అక్రమంగా రవాణాచేస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందుకోసం ప్రత్యేకంగా చెక్​పోస్టులు ఏర్పాటుచేశామన్నారు. మత ఘర్షణలు ప్రేరేపించేలా ఎవరైనా సోషల్​మీడియాలో పోస్టులు పెడితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో చేర్యాల ఎస్సై మోహన్ బాబు, చేర్యాల తాజుమ్ ప్రెసిడెంట్ అబ్దుల్ […]

Read More
గ్రామాల అభివృద్ధే ధ్యేయం

గ్రామాల అభివృద్ధే ధ్యేయం

సారథి న్యూస్, బెజ్జంకి: గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. శనివారం కరీంనగర్​ జిల్లా బెజ్జంకి మండలం ముత్తన్నపేట గ్రామంలో సీసీ రోడ్లు, మహిళా భవన నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. సీఎం కేసీఆర్​కు సంక్షేమ పథకాలు మంచి పేరు తెచ్చిపెట్టాయని అన్నారు. హరితహారం ఒక ఉద్యమంలా సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ లింగాల నిర్మల, జడ్పీటీసీ సభ్యురాలు కనగండ్ల కవిత, సర్పంచ్ కనగండ్ల రాజేశం, ఎంపీటీసీ రాజు, ఎంపీడీవో ఓబులేష్​ పాల్గొన్నారు.

Read More

మత్స్య పరిశ్రమను అభివృద్ధి చేస్తం

సారథి న్యూస్, బెజ్జంకి: మత్స్య పరిశ్రమను అభివృద్ది చేస్తామని ఉమ్మడి కరీంనగర్ జిల్లా మత్స్య పారిశ్రామికశాఖ అధ్యక్షుడు పోలు లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం బెజ్జంకి మండలంలో చేపపిల్లలను పెంచుతున్న చెరువులు, కుంటలను పరిశీలించారు. రాష్ట్రంలో వ్యవసాయ పంటలు, చేపలను పెంచేందుకు రైతాంగానికి సీఎం కేసీఆర్ ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారని తెలిపారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కరవెని పోచయ్య ముదిరాజ్, ఇల్లంతకుంట మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు చొప్పరి రామచంద్రం ముదిరాజ్, రాజేశం, నర్సయ్య, శంకర్ […]

Read More

పరిశుభ్రతతో రోగాలు దూరం

సారథి న్యూస్, బెజ్జంకి: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని బెజ్జంకి ఎంపీపీ లింగాల నిర్మల పేర్కొన్నారు. గురువారం బెజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామంలో ఆమె తడి, పొడి చెత్త బుట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ కనగండ్ల కవిత, మార్కెట్ కమిటి చైర్మన్ పోచయ్య, సర్పంచ్ సీతా లక్ష్మి, సింగిల్ విండో చైర్మన్ భూమయ్య, ఎంపీటీసీ మల్లేశంగౌడ్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Read More