Breaking News

ANTHARVEDI

జనసేనాని ధర్మదీక్ష

జనసేనాని ధర్మదీక్ష

సారథి న్యూస్, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ​రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ.. సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాలని పిలుపునిస్తూ శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు దీపాలు వెలిగించే కార్యక్రమానికి జనసేన అధినేత పవన్​కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. తన వ్యవసాయ క్షేత్రంలో దీపాన్ని వెలిగించి ‘ధర్మాన్ని పరిరక్షిద్దాం.. మత సమరస్యాన్ని కాపాడుకుందాం’ అని సంకల్పం చెప్పుకొంటూ ధ్యానం చేశారు. ధర్మాన్ని రక్షించుకునే దిశగా అందరూ అడుగులు వేయాలని ఆయన ఆకాంక్షించారు.

Read More
ఆలయాలపై దాడులా.. సిగ్గుచేటు

ఆలయాలపై దాడులా.. సిగ్గుచేటు

సారథి న్యూస్, కర్నూలు: రాష్ట్రంలో వైఎస్సార్ ​సీపీ ప్రభుత్వం విధ్వంసక్రీడను ప్రోత్సహిస్తోందని, హిందూదేవాయాలపై దాడులు జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్​ పార్థసారథి ప్రశ్నించారు. అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి రథాన్ని దగ్ధం చేసిన దోషులను అరెస్టు చేయకుండా.. దాడులపై ప్రశ్నించిన హిందూ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇచ్చిన పిలుపు మేరకు.. అంతర్వేది ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ […]

Read More