Breaking News

AIRFORCE

ఫీల్డులోకి దిగిన రాఫెల్..

ఫీల్డులోకి దిగిన రాఫెల్..

వాయుసేన‌లోకి ఐదు విమానాలు మరింత పెరిగిన భార‌త ఎయిర్‌ఫోర్స్‌ బ‌లం అంబాలా: కొద్దిరోజుల క్రిత‌మే ఫ్రాన్స్ నుంచి భార‌త్‌కు వ‌చ్చిన రాఫెల్ ఫైట‌ర్ జెట్‌లు ఫీల్డులోకి దిగాయి. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వ‌ద్ద చైనాతో స‌రిహ‌ద్దు వివాదాల నేప‌థ్యంలో గురువారం ఆ ఐదు విమానాలు భార‌త వాయుసేన‌లో చేరాయి. దీంతో మ‌న అమ్ముల‌పొదిలో ఉన్న అస్త్రాల‌కు తోడు రాఫెల్ కూడా జతకలవడంతో భార‌త ఎయిర్‌ఫోర్స్‌ బ‌లం మ‌రింత పెరిగింది. తాజాగా ఎల్ఎసీ వ‌ద్ద చైనా వ‌రుస‌గా దుస్సాహ‌సాలకు […]

Read More
సాల్వెంట్‌ పరిశ్రమలో అగ్నిప్రమాదం

సాల్వెంట్‌ పరిశ్రమలో అగ్నిప్రమాదం

గుమ్మడిదల: సంగారెడ్డి జిల్లాలో శనివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గుమ్మడిదల మండలం దోమడుగులోని సాల్వెంట్‌ రసాయన పరిశ్రమలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. జీడిమెట్ల, అన్నారం ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ నుంచి అగ్నిమాపక యంత్రాలను రప్పించారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

Read More
ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్​సూసైడ్​

ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ ​సూసైడ్​

శ్రీన‌గ‌ర్‌: జ‌మ్ముక‌శ్మీర్‌లో ఓ ఎయిర్​ఫోర్స్​ ఆఫీసర్​ సూసైడ్​ చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్​కు చెందిన ఇంద‌ర్‌పాల్ సింగ్(53)వైమానిక ద‌ళంలో వారెంట్ ఆఫీస‌ర్​గా పనిచేస్తున్నాడు. త‌న స‌ర్వీస్ పిస్టల్​తో త‌ల‌పై కాల్చుకున్నాడు. వెంట‌నే స‌హ‌చ‌రులు ఆయ‌న‌ను ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపటికే చనిపోయాడని డాక్టర్లు ధ్రువీకరించారు. పోస్టుమార్టం పూర్తయిన వెంట‌నే ఇంద‌ర్‌పాల్ భౌతిక కాయాన్ని కుటుంబ‌స‌భ్యుల‌కు అప్పగించినట్లు తెలిపారు. కాగా, ఈనెల జ‌మ్ము రీజియ‌న్‌లో సూసైడ్​ చేసుకున్న రెండో వైమానికద‌ళ ఉద్యోగి ఇంద‌ర్‌పాల్. ఆగ‌స్టు 8న కూడా ఉదంపూర్‌లో వైమానిక ద‌ళానికి చెందిన […]

Read More

చైనా కవ్వింపును ఉపేక్షించబోం

సారథి న్యూస్, హైదరాబాద్: : భారత్‌ ఎప్పుడూ శాంతి మంత్రాన్ని పాటిస్తుందని భారత వైమానిక దళాధిపతి‌ ఆర్కేఎస్​ భదౌరియా స్పష్టం చేశారు. భారత సైనికులపై కవ్వింపులకు దిగితే మాత్రం ఉపేక్షించబోమని పేర్కొన్నారు. చైనాకు దీటైన సమాధానం చెప్పే సత్తా భారత్​ వద్ద ఉన్నదన్నారు. శనివారం హైదరాబాద్‌ సమీపంలోని దుండిగల్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీలో జరిగిన గ్రాడ్యుయేషన్‌ పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొత్తగా విధుల్లో చేరబోతున్న క్యాడేట్లను ఉద్దేశించి భదౌరియా ప్రసంగించారు. […]

Read More