Breaking News

ADIVASI

ఆదివాసీ మహిళలపై దాడులు దుర్మార్గం

ఆదివాసీ మహిళలపై దాడులు దుర్మార్గం

హింసించిన వారిపై చర్యలు తీసుకోవాలి బాధిత మహిళలను పరామర్శించిన ఆర్​ఎస్పీ పులుల పేరుతో మనుషులను హింసిస్తారా? మేం అధికారంలోకి వస్తే పోడు భూములకు పట్టాలు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ​ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సామాజికసారథి, మంచిర్యాల ప్రతినిధి: మంచిర్యాల జిల్లా దండేపల్లిలోని కోయపోచగూడెం ఆదివాసీలపై ఇటీవల పోలీసులు, అటవీశాఖ అధికారులు చేసిన దాడిని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ​ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా తమ భూములకు పట్టాలు కావాలని […]

Read More
ఏజెన్సీలోకి గిరిజనేతరుల వలసలను నిరోధించాలి

ఏజెన్సీలోకి గిరిజనేతరుల వలసలను నిరోధించాలి

సారథి న్యూస్, నూగూరు, వెంకటాపురం: ఏజెన్సీ ప్రాంతంలోకి గిరిజనేతరుల వలసలను నిరోధించాలని ఆదివాసీ నవనిర్మాణ సేన (ఏఎన్ఎస్) ములుగు జిల్లా అధ్యక్షుడు ఎట్టి విద్యాసాగర్ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం ఏఎన్ఎస్ మండలాధ్యక్షుడు పోలేబోయిన భార్గవ్ అధ్యక్షతన జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వెంకటాపురం, వాజేడు మండలంలో ఇసుక, గ్రావెల్ దందా అధికారుల అండదండలతో జరుగుతోందన్నారు. ఆదివాసీలు రాజకీయ పార్టీల కుట్రలను పసిగట్టాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాన్ని విభజించి ఆదివాసీల ఐక్యతను దెబ్బతీశారని, ఏజెన్సీ ప్రాంతాన్ని అంతా […]

Read More
అధికారుల బెదిరింపులు మానుకోవాలి

అధికారుల బెదిరింపులు మానుకోవాలి

సారథి న్యూస్, వెంకటాపురం: ఏజెన్సీలో భుక్తి కోసం, న్యాయబద్ధంగా శాంతిభద్రతలకు ఆటంకం కలిగించకుండా కరోనా నియమ నిబంధనలను పాటిస్తూ నిరసన వ్యక్తంచేస్తున్న ఆదివాసీలను దీక్ష విరమించాలని బెదిరింపులకు పాల్పడడం సరికాదని ఆదివాసి సంక్షేమ పరిషత్ జిల్లా కార్యదర్శి పూనేం చంటి అన్నారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ములుగు జిల్లాలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు శనివారం ఐదవ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తూ గిరిజనులకు రక్షణ కల్పించాల్సిన అధికారులు […]

Read More
ఏజెన్సీలో నూతన రెవెన్యూ చట్టాన్ని నిలిపేయాలి

ఏజెన్సీలో నూతన రెవెన్యూ చట్టాన్ని నిలిపేయాలి

సారథి న్యూస్, వాజేడు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ చట్టాలను నిర్వీర్యం చేస్తూ ఆదివాసీల మీద అత్యంత పాశవికంగా దమనకాండ కొనసాగిస్తోందని ఆదివాసీ నవ నిర్మాణసేన రాష్ట్ర అధ్యక్షుడు పూనేం సాయి విమర్శించారు.ఏజెన్సీ నూతన రెవెన్యూ చట్టాన్ని, ఎల్ఆర్​ఎస్​ను నిలిపివేయకపోతే ఆదివాసీ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, సర్పంచ్​లు, ఎంపీటీసీలు, తమ పదవులకు రాజీనామా చేయాలని సాయి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. 1970కు ముందు ఉన్న గిరిజనేతరులందరికీ భూములపై […]

Read More