ప్రముఖ హాస్యనటి, తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితురాలైన విద్యుల్లేఖ రామన్ త్వరలోనే తన ప్రియున్ని పెళ్లి చేసుకోబోతుంది. కొంత కాలంగా ఆమె ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ సంజయ్‌తో ప్రేమలో పడింది. కాగా మంగళవారం చెన్నైలోని ఓ ప్రముఖ హోటల్లో వీరిద్దరికి ఘనంగా ఎంగేజ్మెంట్ జరిగింది. ఇరు కుటుంబాల ఆమోదంతోనే వివాహం నిశ్చయమైంది. కొంతమంది ప్రముఖులు, సమీప బంధువుల సమక్షంలో నిశ్చితార్థం నిర్వహించారు. ప్రస్తుతం వీరి ఎంగేజ్మెంట్ పిక్స్ వైరల్‌గా మారాయి.
ఇప్పటికే వరుస హిట్లతో నంబర్‌వన్‌గా దూసుకుపోతున్న పూజాహేగ్డే మరో బంపర్ ఆఫర్‌ను కొట్టేసింది. పవన్ కల్యాణ్.. హరీశ్ శంకర్ డైరెక్షన్లో చేయబోయే సినిమాలో పూజాకు హీరోయిన్గా చాన్స్ దక్కినట్టు సమాచారం. గతంలో పవన్‌కల్యాణ్.. హరీశ్ కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.ఓ పవర్ఫుల్ కథను హరీశ్ వినిపించగా.. పవన్‌కల్యాణ్‌కు నచ్చిందట. ఇందులో పవర్‌స్టార్ యాంగ్రీ యంగ్‌మ్యాన్ పాత్రను పోషించనున్నట్టు టాక్. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా రాలేదు.
బాలీవుడ్లో ప్రముఖులుగా చలామణి అవుతున్నవారంతా డ్రగ్స్‌కు బానిసలేనంటూ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ సంచలన ఆరోపణలు చేశారు. ‘నాకు తెలిసిన ఓ స్టార్ హీరో నిత్యం డ్రగ్స్‌లో మునిగితెలేవాడు. ఓ సారి మోతాదుకు మించి డ్రగ్స్ తీసుకున్నాడు. ఆ సమయంలో నేను అతడితో డేటింగ్లో ఉన్నాను. డ్రగ్స్ తీసుకొని అతడు సైకోలా ప్రవర్తించేవాడు. అతడి టార్చర్ భరించలేక భార్యకు కూడా వదిలేసింది’అంటూ ఆమె పేర్కొన్నారు. ఇటీవల కంగనా ఓ టీవీ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా […]
చెన్నై: నటి మీరా మిథున్ నిత్యానందపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆయన చాలా గొప్పవాడని.. మీడియా అనవసరంగా నిత్యానందపై తప్పుడు ఆరోపణలు చేసిందని పేర్కొంది. ఈ మేరకు ఆమె శుక్రవారం ఓ ట్వీట్ చేశారు. ‘నిత్యానంద చాలా గొప్పవ్యక్తి. ఆయన గురించి అంతా దుష్ప్రచారం చేస్తున్నారు. త్వరలోనే నేను నిత్యానంద సృష్టించిన కైలాసానికి వెళ్లి.. ఆయనను కలుసుకుంటాను. ఆయనంటే నాకు ఎంతో గౌరవం’ అంటూ మీరామిథున్ నిత్యానందను పొగడ్తల్లో ముంచెత్తింది. కాగా మీరా వ్యాఖ్యలపై నెట్‌జన్లు మండిపడుతున్నారు.
సోషల్ మీడియాలో చిలిపిగా పోస్టులు పెట్టే అదా శర్మ కెమెరా ముందుకి వచ్చేసరికి పెర్ఫామెన్స్ అదరగొడుతుంది. రీసెంట్ గా బాలీవుడ్ చిత్రం ‘కమాండో 3’లో ఇన్స్పెక్టర్ భావనారెడ్డిగా ఆకట్టుకుంది. రీసెంట్ గా ఆదా తెలుగులో రెండు సినిమాలకు కమిట్ అయింది. అందులో ఓ థ్రిల్లర్ మూవీలో నటించడానికి రెడీఅయింది. కొత్త డైరెక్టర్స్ విప్రా దర్శకత్వంలో రూపొందనున్న ఈ మూవీకి ‘క్వశ్చన్ మార్క్’ అని టైటిల్ ఫిక్స్ చేశారు. శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్ పై గౌరీకృష్ణ ఈ సినిమా […]
బాలనటిగా ఇండస్ట్రీకొచ్చినా వయసుకు తగ్గ పాత్రలనే ఎంచుకుంటూ కెరీర్ లో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది నటి మీనా. అయితే దానికి బ్రేక్ చెప్పాలనుకుంటున్నా.. నెగెటివ్, చాలెంజింగ్ పాత్రలను కూడా చేయాలనుకుంటున్నానని గతంలో ‘అన్నాత్త’ సినిమా ఓపెనింగ్ సమయంలో తన మనసులోని అభిప్రాయాలను చెప్పింది మీనా. తనకి తగ్గా పాత్రలు చెయ్యాలి అనుకున్నా.. ఇప్పుడు మాత్రం ఏ పాత్రైనా చెయ్యడానికి సిద్ధపడుతోందట. ఎందుకంటే తెలుగు తమిళ ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయని.. ట్రెండ్ కి తగ్గట్టుగా […]
నాని, శ్రద్ధా శ్రీనాథ్ హీరోహీరోయిన్లుగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జెర్సీ చిత్రం భారీ విజయం నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం.. విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నది. ప్రస్తుతం జెర్సీ చిత్రాన్ని తమిళం, హిందీ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. హిందీ రీమేక్‌లో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తుండగా.. తమిళంలో విష్ణు విశాల్ చేస్తున్నాడు. అయితే జెర్సీలో కథనాయికగా చేయడానికి హీరోయిన్స్ […]
కరాచీ: అండర్ వరల్డ్ డాన్, 1993 ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌కు చెందిన ఓ సినీనటితో సన్నిహితంగా మెలుగుతున్నట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. పాకిస్థాన్‌కు చెందిన మెహ్విష్ హయత్ (37) మొదట ఐటం గర్ల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. అనంతరం పలు సినిమాల్లో నటించింది. ఆమెతో దావూద్ సన్నిహితంగా ఉంటున్నట్టు సమాచారం. ఇండియా నుంచి పారిపోయిన దావూద్ పాకిస్థాన్‌లోని కరాచీలో ఓ భారీ బంగ్లాలో నివాసం ఉంటున్నాడు. దావూద్‌కు పాక్ చిత్రపరిశ్రమకు చెందిన వ్యక్తులు, […]