Breaking News

ACCIDENT

ఎస్​బీఐ ఉద్యోగి సజీవదహనం

ఎస్​బీఐ ఉద్యోగి సజీవ దహనం

సారథి న్యూస్​, కర్నూలు : నంద్యాల మండలం చాపిరేవుల టోల్‌ప్లాజా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి సజీవదహనం అయ్యాడు. గూడ్స్ కొరియర్ లారీని కారు ఢీ కొనడంతో జరిగిన ప్రమాదంలో కారులో మంటలు చెలరేగి కారులో ప్రయాణిస్తూన్న ఎస్‌బీఐ ఉద్యోగి శివకుమర్ సజీవదహనం అవగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. గాయపడిన వ్యక్తిని పోలీసులు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.

Read More

ముగ్గురిని బలిగొన్న నిర్లక్ష్యం

సారథిన్యూస్​, సూర్యాపేట: కాలకృత్యాలు తీర్చుకొనేందుకు రోడ్డు పక్కన నిలబడి ఉన్న ముగ్గురిని కారు ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు. ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లా కృత్తివేలు మండలం ఇంటెరు గ్రామానికి చెందిన నాగ కోటేశ్వరరావు, దుర్గ, మొగులమ్మ, కొండబాబు శుక్రవారం ఉదయం విజయవాడ నుంచి హైదరాబాద్​కు కారులో వస్తున్నారు. ఈ క్రమంలో కాలకృత్యాలు తీర్చుకొనేందుకు సూర్యాపేట జిల్లా మునగాల మండలం మొద్దుల చెరువు వద్ద కారు ఆపారు. వారు రోడ్డు పక్కన నిలబడి ఉండగా వెనుకనుంచి మరో కారు […]

Read More
గేదెలను ఢీకొట్టిన ట్రావెల్స్​బస్సు

గేదెలను ఢీకొట్టిన ట్రావెల్స్​ బస్సు

సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం సాయంత్రం కలకత్తా నుంచి హైదరాబాద్ కు ఛత్తీస్ గఢ్ మీదుగా వెళ్తున్న ట్రావెల్స్​ బస్సు వాజేడు మండలం గుమ్మడిదొడ్డి గ్రామం వద్ద పాడి గేదెలను ఢీకొట్టింది. ఈ ఘటనలో మూడు గేదెలు మృతిచెందాయి. డ్రైవర్, క్లీనర్​పరారీలో ఉన్నారు.

Read More

విమానాలు ఢీకొని 8 మంది మృతి

వాషింగ్టన్​: రెండు విమానాలు ఢీకొని ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన అమెరికాలోని ఇదాహో రాష్ట్రంలో సోమవారం చోటుచేసుకున్నది. విమానాలు కోయర్ డీఅలెన్ సరస్సులో మునిగిపోయాయి. రెండు మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు చెప్పారు. మరో ఆరుగురి కోసం గాలిస్తున్నారు. రెండు విమానాల శకలాలను సోనార్​ సాయంతో గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు. విమాన ప్రమాదంపై ప్రస్తుతం విచారణ జరుగుతోందని చెప్పారు.

Read More

లారీ డ్రైవర్​ సజీవదహనం

సారథిన్యూస్​, అనంతపురం: ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఓ లారీ డ్రైవర్​ సజీవదహనమయ్యాడు. ఈఘటన అనంతరం జిల్లా తాడిపత్రి సమీపంలోని కడప రహదారిపై చోటుచేసుకున్నది. తాడిపత్రి నుంచి ఓ లారీ వరిపొట్టు లోడుతో వస్తున్నది. ఈ లారీని ఎదురుగా వస్తున్న మరో లారీ ఢీకొన్నది. ఈ ప్రమాదంలో మంటలు చెలరేగి ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన లారీడ్రైవర్​ నిశార్​ సజీవదహనం అయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు

Read More

పడవబోల్తా.. 32 మంది మృతి

ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని బురిగాంగ నదిలో పడవ బోల్తా పడి దాదాపు 32 మంది ప్రాణాలో కోల్పోయారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓల్డ్ ఢాకాలోని శ్యాంబజార్ ప్రాంతం వెంట సోమవారం ఉదయం 9:15 గంటలకు యమ్‌ ఎల్‌ మార్నింగ్‌ బర్డ్ అనే పడవ మునిగిపోయింది. ఆ సమయంలో పడవలో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ పడవ మరొకపడవను ఢీకొట్టడంతో దీనిలోకి నీరు చేరుకున్నది. పడవ సామర్థ్యం ప్రకారం 45 మంది ప్రయాణికులను మాత్రమే […]

Read More

నవ దంపతుల దుర్మరణం

ఏలూరు టౌన్‌: రోడ్డు ప్రమాదం నవదంపతులను బలిగొన్నది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా పూళ్ల గ్రామం సమీపంలో జాతీయ రహదారిపై చోటుచేసుకున్నది. ప్రమాదంలో డ్రైవర్‌ కూడా మృతిచెందగా, వధువు సోదరుడు తీవ్రగాయాలతో బయటపడ్డాడు. విశాఖ జిల్లా సబ్బవరానికి చెందిన యడ్లపల్లి వెంకటేష్‌కు గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని గోవాడకు చెందిన ఆలపాటి మానస నవ్యతో ఈ నెల 14న రాత్రి గోవాడలో వివాహం జరిగింది. వివాహం అనంతరం గురువారం వధువు సోదరుడు భరత్‌తో కలిసి నవ దంపతులు […]

Read More
బాధిత కుటుంబాలను ఓదార్చుతున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి

బాధితకుటుంబాలకు ఓదార్పు

సారథిన్యూస్​, ఖమ్మం: ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం జిల్లాకు చెందిన 12 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికీ సీఎం కేసీఆర్​ రూ. 2 లక్షల పరిహారం అందించారు. మరోవైపు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాధితకుటుంబాలకు రూ.20 వేలు తక్షణసాయం ప్రకటించారు. జిల్లా పరిషత్​ చైర్మన్​ లింగాల కమల్​రాజ్​, మంత్రి పువ్వాడ అజయ్​ బాధితకుటుంబాలను పరామర్శించారు. ప్రమాదంలో గాయపడి ఖమ్మం ప్రభుత్వదవాఖానలో చికిత్సపొందుతున్న వారిని ఖమ్మం ఎంపీ […]

Read More