Breaking News

TELANGANA

బొగ్గు ఉత్పత్తి పెంచండి

సారథి న్యూస్​, రామగుండం: అర్జీ 1 ఏరియాలో 100 శాతం బొగ్గు ఉత్పత్తికి కృషిచేయాలని, ప్రతి ఒక్కరూ లక్షణ సూత్రాలు పాటించాలని ఆర్ జీ వన్ జీఎం కే నారాయణ కోరారు. శనివారం సాయంత్రం ఆయన జీఎం కార్యాలయంలో గని అధికారులతో సమీక్షించారు. ఉత్పత్తి ఉత్పాదకత పెంచేందుకు చేపట్టాల్సిన చర్యలను చర్చించారు. సమావేశంలో అధికారులు త్యాగరాజు, బెంజిమెన్, కేవీ రావు, సత్యనారాయణ, అప్పారావు, వెంకటేశ్వరరావు, నవీన్ కుమార్, ఆంజనేయులు, మురళీధర్, హరినాథ్, గని మేనేజర్లు, అధికారులు పాల్గొన్నారు.

Read More
ఈసీ గంగిరెడ్డి మృతికి సంతాపం

గంగిరెడ్డి మృతికి ధర్మాన సంతాపం

సారథి న్యూస్​, నరసన్నపేట: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మామ, ప్రముఖ వైద్యులు ఈసీ గంగిరెడ్డి మృతి పట్ల ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గంగిరెడ్డి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఎటువంటి ఫీజు తీసుకోకుండా ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించిన గంగిరెడ్డి పేదల డాక్టర్ గా మంచి గుర్తింపు పొందారన్నారు. కడప జిల్లాలో వైఎస్సార్‌ సీపీ ఐలోపేతానికి గంగిరెడ్డి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారన్నారు. నిత్యం అందుబాటులో ఉండి […]

Read More

మొగి పురుగును అంతమొందిద్దాం

సారథి న్యూస్, రామాయంపేట: ప్రస్తుతం వరిపంటకు మొగి పురుగు ఆశించిందని తగిన మందులు వాడి అరికట్టవచ్చని నిజాంపేట మండల వ్యవసాయాధికారి సతీష్​ పేర్కొన్నారు. శనివారం ఆయన నిజాంపేట మండలంలో వరి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరి పంటలో మొగి పురుగు పొట్ట దశలో ఉన్నప్పుడే కార్టప్ హైడ్లో క్లోరైడ్ 400 గ్రామ్స్ లేదా కోరాజిన్ 60 ఎంఎల్​ లీటర్​ నీటికి ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలని సూచించారు. అలాగే దోమపోటు నివారణకు డినోటీఫ్యూరన్ […]

Read More

హత్రాస్ నిందితులను కాల్చిచంపండి

సారథి న్యూస్, రామాయంపేట: యూపీలోని హథ్రాస్​ ఘటనపై యావత్​ దేశం తీవ్రంగా స్పందిస్తున్నది. నిందితులను ఎన్​కౌంటర్​ చేయాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. మెదక్​ జిల్లా నిజాంపేట మండలలో శనివారం అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. హథ్రాస్​ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని, వారిని వెంటనే ఉరితీయాలని నేతలు డిమాండ్​ చేశారు. పశుగ్రాసం కోసం వెళ్లిన యువతిని లాక్కెళ్లి ఆమెపై క్రూరంగా లైంగికదాడి చేయడం అమానవీయ చర్య అని అభివర్ణించారు. అనంతరం తల్లిదండ్రులకు కూడా […]

Read More

రైతన్నల ఆక్రందనలు వినిపించవా?

సారథి న్యూస్​, మానవపాడు: ఇటీవల కురిసిన భారీవర్షాలకు పంటలు తీవ్రంగా నష్టపోయి రైతులు బాధపడుతుంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రం ఎంజాయ్​ చేస్తున్నారని కాంగ్రెస్​ నేత, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆరోపించారు. శనివారం ఆయన జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్​ నియోజకవర్గంలో పర్యటించి పంటలను పరిశీలించారు. మానవపాడు మండలం మానవపాడు, అమరవాయి గ్రామాల్లో పంటలను పరిశీలించారు. పత్తి, మిరప పంటలు దారుణంగా దెబ్బతిన్నాయని.. అధికారులు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదని ఆరోపించారు. ఆయన వెంట మనోపాడ్ […]

Read More

నయీం కేసు.. పోలీసులకు క్లీన్​చీట్​

కరుడుగట్టిన గ్యాంగ్​స్టర్​ నయీంను 2016 ఆగస్టు 8న పోలీసులు ఎన్​కౌంటర్​ చేసిన విషయం తెలిసిందే. అయితే నయీం ఎన్​కౌంటర్​ తర్వాత అతడి అక్రమాలు ఒక్కొక్కటీ బయటికొచ్చాయి. నయీం పోలీసులను అడ్డుపెట్టుకొని అనేక​ అక్రమాలు చేశాడని వార్తలు వినిపించాయి. అప్పట్లో నయీం అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం సిట్​తో దర్యాప్తు చేయించింది. అయితే దర్యాప్తు చేసిన సిట్..​ నయిం అక్రమాల్లో పోలీసుల పాత్ర ఏమీలేదని తేల్చిచెప్పింది. నయీం భూ అక్రమాలకు సహకరించినట్టు పలువురు ప్రజాప్రతినిధులతో పాటు పోలీసు అధికారులపై ఆరోపణలు […]

Read More

నన్ను వదిలేయండి.. డ్రగ్స్​తీసుకోలేదు

కర్ణాటక సినీ పరిశ్రమను డ్రగ్స్​ కేసు కుదిపేస్తున్నది. ఇప్పటికే హీరోయిన్లు సంజనా గల్రానీ, రాగిణి డ్రగ్స్​కేసులో అరెస్టయ్యారు. అయితే వారు సెక్స్ రాకెట్​ కూడా నడుపుతున్నట్టు పోలీసులు విచారణలో తేలింది. మరోవైపు సంజనా, రాగిణి ఎవరిపేరు బయటపెడతారో అని సర్వత్రా టెన్షన్​ నెలకొన్నది. అయితే ఇటీవల ఈ కేసులో కర్ణాటకకు చెందిన ప్రముఖ టీవీ యాంకర్​ అనుశ్రీని పోలీసులు విచారణకు పిలించారు. దీంతో అనుశ్రీ డ్రగ్స్​కేసులో ఇరుక్కున్నదంటూ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో అనుశ్రీ ఇన్​స్టాలో […]

Read More

సీఎం జగన్​ మామ గంగిరెడ్డి మృతి

సారథిన్యూస్​, అమరావతి: ఆంధ్రప్రదేశ్​ సీఎం జగన్మోహన్​రెడ్డి మామ, భారతిరెడ్డి తండ్రి ప్రముఖ వైద్యులు ఈసీ గంగిరెడ్డి శుక్రవారం అర్ధరాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్​లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గంగిరెడ్డి పులివెందులలో చాలా కాలం పాటు వైద్యుడిగా పనిచేశారు. దివంగత సీఎం రాజశేఖర్​రెడ్డికి ఆయన మంచి మిత్రుడు. ఆయన 2001-2005లో పులివెందుల ఎంపీపీగా కూడా పనిచేశారు. పులివెందులలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సీఎం జగన్​ ఇవాళ పులివెందులకు వెళ్లనున్నట్టు సమాచారం.

Read More