లద్దాఖ్: ప్రధాని నరేంద్ర మోడీ లద్దాఖ్‌లో శుక్రవారం ఆకస్మికంగా పర్యటించారు. గాల్వాన్ లోయలో భారత్- చైనా బలగాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న అనంతరం ఇక్కడ పరిస్థితిని ప్రధాని సమీక్షించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ మీటింగ్‌లో ప్రధాని మోడీ సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. జవాన్లు తమ ధైర్య సాహసాలతో ప్రపంచానికి ఇండియా బలం గురించి సందేశం పంపారని మెచ్చుకున్నారు. శత్రువులకు మీ ఆవేశం, ఆగ్రహాన్ని రుచి చూపించారని కితాబునిచ్చారు. ‘మీరు పనిచేస్తున్న చోటు కంటే మీ తెగువ […]
న్యూఢిల్లీ: చైనాకు చెందిన 59 యాప్స్‌ను బ్యాన్ చేయడం అంటే వాళ్లపై మనం డిజిటల్ స్ట్రైక్ చేయడమేనని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. ఈ అంశంపై ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ‘మన దేశ ప్రజల డేటాను ప్రొటెక్ట్ చేసేందుకు బ్యాన్ విధించాం. ఇది డిజిటల్ స్ట్రైక్’ అని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. శాంతికోసం ప్రధాని నరేంద్ర మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారు కానీ దీనిపై తప్పుడు ప్రచారం చేస్తే తగిన సమాధానమిస్తామన్నారు. మనవైపు 20 […]
కోల్‌కతా: టిక్‌టాక్ మొబైల్ యాప్‌పై నిషేధం విధించడం వల్ల దేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతుందని తృణముల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ వ్యాఖ్యానించారు. కేంద్రప్రభుత్వం టిక్‌టాక్‌తో సహా మొత్తం 59 యాప్‌లపై నిసేధం విధించిన విషయం తెలిసిందే. దీనిపై నుస్రత్ స్పందించారు. కోల్‌కతాలోని ఇస్కాన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. టిక్‌టాక్ ఒక వినోదకరమైన యాప్ అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం టాక్‌టాన్‌పై విధించిన నిషేధం ఒక హఠాత్తు పరిణామం అని మండిపడ్డారు. చైనాకు చెందిన […]
న్యూఢిల్లీ: ఈ ఏడాది నవంబర్ వరకు ప్రజలకు ఉచితంగా రేషన్ అందజేస్తామని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. వన్ నేషన్.. వన్ రేషన్ కింద దేశంలోని ఏ రాష్ట్రంలో ఉన్న పేదలైనా ప్రభుత్వ సాయం పొందవచ్చని చెప్పారు. వలస కూలీలను దృష్టిలో ఉంచుకొని ఈ పథకాన్ని ప్రవేశపెడుతుమన్నారు. రేషన్ కార్డు ఉన్న నిరుపేదలందరికీ నెలకు 5 కిలోల బియ్యం, గోధుమలు, కిలో కందిపప్పు అందజేస్తామని చెప్పారు. 80 కోట్లమంది ఈ పథకం కింద లబ్ధి పొందుతారని ప్రధాని చెప్పారు. […]
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలతో పోలిస్తే మనం కరోనా మహమ్మారిని నియంత్రణలో ముందున్నామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కరోనా వైరస్ కట్టడి కోసం మనం గట్టిగా పోరాడుతున్నామని అన్నారు. శనివారం రెవరండ్. జోసెఫ్ మార్‌తోనా 90వ జయంతిని పురస్కరించుకుని వీడియో కాన్పరెన్స్ ద్వారా మోడీ మట్లాడారు. మన దేశంలో రికవరీ రేటు రోజు రోజుకు పెరుగుతోందని, ఇటలీ కంటే మన దేశంలో మరణాల రేటు చాలా తక్కువ అని చెప్పారు. భారత్ లాంటి దేశాల్లో కరోనా ఇంపాక్ట్ […]
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం అద్భుతమైన చర్యలు తీసుకుంటుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. యూపీ పెద్ద రాష్ట్రం, జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రమైనా యూరప్ దేశాలతో పోలిస్తే మరణాలు తక్కువగా ఉన్నాయని అన్నారు. స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీలో1,30,000 కరోనా మరణాలు సంభవించాయని, యూపీలో ఆరొందల మరణాలు నమోదయ్యాయని చెప్పారు. ‘యూరప్ దేశాలు ఒకప్పుడు ప్రపంచాన్ని జయించాయి. అత్యంత శక్తిమంతమైనవి. ఈ నాలుగు దేశాల జనాభా మొత్తం 24 కోట్లు. కానీ మన […]
న్యూఢిల్లీ: ఇండియా – చైనా బోర్డర్‌లో నెలకొన్న పరిస్థితులపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్రంపై విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక న్యూస్ ఆర్టికల్‌ను ట్విట్టర్‌లో షేర్ చేసిన రాహుల్ ‘నరేంద్ర మోడీ నిజానికి సరండర్ మోడీ’ అని ట్వీట్ చేశారు. చైనా – ఇండియా మధ్య బార్డర్ ఇష్యూ జరుగుతున్న మొదటి నుంచీ రాహుల్ గాంధీ కేంద్రాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆల్ పార్టీ మీటింగ్ అయిన తర్వాత కూడా […]
న్యూఢిల్లీ: ప్రతి రోజు యోగా చేసేవారికి కరోనా వచ్చే అవకాశం చాలా తక్కువ అని ఆయుష్ మినిస్టర్ శ్రీపాద నాయక్ అన్నారు. ఆదివారం యోగాడే పురస్కరించుకుని పీటీఐ వార్త సంస్థతో మాట్లాడిన మంత్రి ఈ విషయాలు చెప్పారు. ‘మోడీ నేతృత్వంలో ప్రపంచవ్యాప్తంగా యోగాకు ప్రాచుర్యం లభించిందని, అది కరోనాతో పోరాడేందుకు బాగా ఉపయోగపడిందని నేను కచ్చితంగా చెప్పగలను. యోగా చేసే వాళ్లు కరోనా బారిన పడటటం చాలా తక్కువ’ అని మంత్రి చెప్పారు. యోగా ఇమ్యూనిటీని పెంచుతుందని, […]