సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ లో 40వేల మంది రోహింగ్యాలు ఉన్నారని బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. పాతబస్తీలో 40వేల మంది రోహింగ్యాలు ఉంటే కేంద్ర ఏం చేస్తోందని ప్రశ్నించారు. 18 నెలల కాలంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ కు ఏమి చేశారని ప్రశ్నించారు. వరద నష్టంపై కేంద్రానికి నివేదిక ఇచ్చి రెండు నెలలైనా అతీగతి లేదన్నారు. బుధవారం ఆయన మీడియా ప్రతినిధుల […]
సారథి న్యూస్, గోదావరిఖని: స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని పెద్దపల్లి జిల్లా ఆర్ఎఫ్సీఎల్ కు వచ్చిన కేంద్ర రసాయన ఎరువులశాఖ సహాయ మంత్రి మాన్సుఖ్ మాండవియా, హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి కాంగ్రెస్ నేతలు శనివారం వినతిపత్రం అందజేశారు. వారిలో కాంగ్రెస్ రామగుండం నియోజకవర్గ ఇన్చార్జ్ఎంఎస్ రాజ్ ఠాకూర్, కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్, మహంకాళి స్వామి, ఎండీ ముస్తాఫా, గాదం నందు, ఫక్రుద్దిన్, నగునూరి రాజు, పెండ్యాల మహేష్, నాజిమొద్దిన్, కౌటం సతీష్ పాల్గొన్నారు.
న్యూఢిల్లీ: గాంధీ ఫ్యామిలీకి చెందిన మూడు ట్రస్టులపై కేంద్ర హోంశాఖ విచారణకు ఆదేశించింది. దీని కోసం గవర్నమెంట్ ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు హోంశాఖ అధికార ప్రతినిధి బుధవారం ఉదయం ట్వీట్ చేశారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్, రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్, ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్‌కు చెందిన ఫారెన్ డొనేషన్స్, ఇన్‌కమ్‌ట్యాక్స్ వయలేషన్లపై ఇన్వెస్టిగేషన్ చేసేందుకు ఇంటర్ మినిస్ట్రల్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎమ్‌ఎల్‌ఏ), ఇన్‌కమ్ ట్యాక్స్, ఫారెన్ […]