Breaking News

హుస్నాబాద్

పెంటకుప్పలపై.. హరితహారం మొక్కలు

సారథి న్యూస్​, హుస్నాబాద్: ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం లక్ష్యం నీరుగారుతున్నదని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గడిపె మల్లేశ్ ఆరోపించారు. హుస్నాబాద్​ పట్టణంలోని అనభేరి, సింగిరెడ్డి అమరుల భవనంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హుస్నాబాద్​ పట్టణంలోని కరీంనగర్ రోడ్డులో 4000 వేలకు పైగా హరితహారం మొక్కలు పెంటకుప్పలపై వేశారని ఆరోపించారు. మండల ప్రజాపరిషత్ అధికారులు, మున్సిపల్ కమిషనర్​కు ఆ మొక్కలు చూపించగా ఆ మొక్కలు ప్రభుత్వానికి కావంటూ బుకాయిస్తున్నారని ఆరోపించారు. రూ.5లక్షలకు […]

Read More

అక్రమ నిర్మాణాలను పట్టించుకోరా..?

సారథి న్యూస్, హుస్నాబాద్: హుస్నాబాద్ మున్సిపాలిటీలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాల గురించి కమిషనర్ పట్టించుకోవడంలేదని సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ అన్నారు. 14వ వార్డులో పర్మిషన్​లేకుండా నిర్మిస్తున్న ప్రహారీని గురువారం సీపీఐ బృందం పరిశీలించింది. రోడ్డుకు సెట్ బ్యాక్ ఇస్తూ ఇండ్లను కట్టుకోవాల్సి ఉంటుందన్నారు. కలెక్టర్ స్పందించి అక్రమ కట్టడాలను నిలిపివేయాలని కోరారు. పరిశీలించిన వారిలో మాజీ వైస్ ఎంపీపీ గడిపె మల్లేశ్, సీపీఐ నాయకులు జాగీర్ సత్యనారాయణ, పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు వెల్పుల […]

Read More

5వేల ఎకరాలకొక రైతువేదిక

సారథి న్యూస్, హుస్నాబాద్: 5వేల ఎకరాలకు ఒక్క రైతు వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. శనివారం కోహెడ మండలం శనిగరం గ్రామంలో రూ.22లక్షల వ్యయంతో నిర్మించనున్న రైతు వేదిక భవనానికి భూమిపూజ చేశారు. రైతులను రాజులు చేయడమే సీఎం కేసీఆర్​ లక్ష్యమన్నారు. అనంతరం ఉపాధిహామీ పథకంలో భాగంగా శనిగరం ప్రాజెక్టు కింద ఉన్న బెజ్జంకి కాల్వ మరమ్మతు పనులను ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు […]

Read More

అవకతవకలపై విచారణ జరిపించండి

సారథి న్యూస్, హుస్నాబాద్: హుస్నాబాద్ నియోజకవర్గానికి వరప్రదాయినిగా భావించే గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న భూనిర్వాసితులకు ఇచ్చే నష్టపరిహారంలో జరిగిన అవకతవకలపై సీఐడీ ఆఫీసర్లతో విచారణ చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గడిపే మల్లేష్ ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. బుధవారం పట్టణంలోని అనభేరి, సింగిరెడ్డి అమరుల భవనంలో విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టు పనులు మొదలుపెట్టిన నాటి నుంచి ఎంతమంది రైతులు, నిర్వాసితులకు నష్టపరిహారం అందించారో చెప్పాలన్నారు. అవకతవకలపై సీఐడీ ఆఫీసర్లతో విచారణ జరిపించాలని […]

Read More

పరిశుభ్రత పాటించడమే ముఖ్యం

సారథి న్యూస్, హుస్నాబాద్: ప్రజలు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ చైర్​ పర్సన్ ఆకుల రజిత సూచించారు. పట్టణంలోని 1,13వ వార్డుల్లో సోమవారం శానిటేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగీకి కారణమయ్యే దోమలు పెరగకుండా చూసుకోవాలన్నారు. ఆమె వెంట వైస్ చైర్ పర్సన్ అనిత, కౌన్సిలర్లు కొంకటి నళినిదేవి, కల్పన, సుప్రజా, మున్సిపల్ కమిషనర్ రాజమల్లయ్య ఉన్నారు.

Read More

థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు తప్పనిసరి

సారథి న్యూస్​, హుస్నాబాద్: పోలీస్ స్టేషన్ కు వచ్చే వారికి థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు తప్పనిసరి చేయాలని ఏసీపీ మహేందర్ పోలీసు అధికారులకు సూచించారు. సోమవారం పలువురికి థర్మల్​ స్ర్కీనింగ్​ పరీక్షలు చేశారు. పోలీసులు ప్రజలతో మాట్లాడేటప్పుడు ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని, గ్లౌస్​లు, మాస్కులు కట్టుకోవాలన్నారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే నాన్ కాంటాక్ట్ ఈ చలాన్​ ద్వారా కేసులు నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్సై దాస సుధాకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Read More
కరెంట్ బిల్లులతో షాక్ లా.?

కరెంట్ బిల్లులతో షాక్ లా.?

సారథి న్యూస్, హుస్నాబాద్ : కరోనా సమయంలో కరెంట్ బిల్లుల షాక్ తో అనేక ఇబ్బందులకు గురవుతున్నారని డీసీసీ అధికార ప్రతినిధి కేడం లింగమూర్తి అన్నారు. మంగళవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ మహమ్మారి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే విద్యుత్ శాఖ ఆఫీసర్లు ఇళ్లల్లోకి రాకుండా బిల్లులు వేయడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కరోనా ఉధృతి తగ్గే వరకు బిల్లులను విధించకుండా చర్యలు తీసుకుని హుస్నాబాద్ విద్యుత్ డీఈకి […]

Read More