Breaking News

హుస్నాబాద్

భారీ వర్షాలున్నయ్​.. జాగ్రత్తగా ఉండండి

భారీ వర్షాలున్నయ్​.. జాగ్రత్తగా ఉండండి

సారథి న్యూస్, హుస్నాబాద్: సోమ, మంగళవారాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమతంగా ఉండాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డి.జోయల్ డేవిస్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటలు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయన్నారు. ఈనెల 12,13 తేదీల్లో భారీవర్షాలు కురుస్తాయని రాష్ట్ర వాతావరణ శాఖ ప్రకటించిందని తెలిపారు. సిద్దిపేట జిల్లా పరిధిలోని కూడవెల్లి వాగు, మోయతుమ్మెద వాగు, పిల్లివాగు, చెరువులు, కుంటలు, చెక్ డ్యాములు ఉధృతంగా ప్రవహిస్తున్నాని, […]

Read More
ప్రాణాలు పోతున్నయ్.. గుంతలు పూడ్చండి

ప్రాణాలు పోతున్నయ్.. గుంతలు పూడ్చండి

సారథి న్యూస్, హుస్నాబాద్: రోడ్లపై గుంతలు ఎక్కువగా పడడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వెంటనే గుంతలను పూడ్చాలని కాంగ్రెస్ హుస్నాబాద్​ మండలాధ్యక్షుడు అక్కు శ్రీనివాస్ అన్నారు. రోడ్లకు మరమ్మతులు చేయాలని డిమాండ్​ చేస్తూ శనివారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. హన్మకొండ నుంచి సిద్దిపేట జిల్లా కేంద్రానికి వెళ్లే మెయిన్​రోడ్డు దెబ్బతినడంతో నిత్యం యాక్సిడెంట్లు జరుగుతున్నాయని అన్నారు. ఆ గుంతల్లో జూలై 7న జెండాలు పాతి నిరసన తెలిపినా మంత్రి, అధికారులకు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా […]

Read More
మేమున్నామని..

మేమున్నామని..

సారథి న్యూస్, హుస్నాబాద్: మృతుడి కుటుంబానికి వాట్సాప్ గ్రూపు సభ్యులు మేమున్నామని చేయూతనిచ్చారు. ఈ సందర్భంగా గ్రూప్ అడ్మిన్ దామెర మల్లేశం మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లా మద్దూర్ మండల కేంద్రంలోని నిరుపేద కుటుంబానికి చెందిన బొందుగుల వెంకటయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందాడు. సోషల్ మీడియాలో ఒక్కటైన గ్రూప్ సభ్యులు తలకొంత డబ్బులు వేసుకుని 50కిలోల బియ్యాన్ని అందజేశారు. కార్యక్రమంలో వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ మల్లేశం, గ్రూప్ సభ్యులు, యువకులు పాల్గొన్నారు.

Read More
ఓపెన్ యూనివర్సిటీ సెంటర్​ను కొనసాగించండి

ఓపెన్ యూనివర్సిటీ సెంటర్​ను కొనసాగించండి

సారథి న్యూస్, హుస్నాబాద్: డాక్టర్ బీఆర్​ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరీక్ష కేంద్రాన్ని హుస్నాబాద్ డివిజన్ కేంద్రంలోనే కొనసాగించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జెరిపోతుల జనార్ధన్ డిమాండ్​ చేశారు. హుస్నాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజితకు వినతిపత్రం అందజేసి మాట్లాడారు. 15ఏళ్లుగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ హుస్నాబాద్ లో ఉండడం ద్వారా ఏటా 1500 నుంచి 2000 మంది విద్యకు దూరమైన యువతీ యువకులకు ఉన్నత విద్యనభ్యసించే అవకాశం కలిగిందన్నారు. ప్రస్తుతం […]

Read More
ఫిర్యాదులో మూడో వ్యక్తి జోక్యం వద్దు

ఫిర్యాదులో మూడో వ్యక్తి జోక్యం వద్దు

సారథి న్యూస్, హుస్నాబాద్: భూతగాదాల్లో ఫిర్యాదు, ప్రతివాది తప్ప మూడో వ్యక్తిపై జోక్యం చేసుకుంటే ఆ వ్యక్తిపై పీడీయాక్డు కేసు నమోదు చేసి జైలుకు పంపించాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డి.జోయల్ డేవిస్ ఆదేశించారు. సోమవారం హుస్నాబాద్ సబ్ డివిజన్ పోలీస్ ఉన్నతాధికారుతో చేర్యాల సర్కిల్ ఆఫీసులో పెండింగ్ కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. హుస్నాబాద్, అక్కన్నపేట, కొహెడ, మద్దూర్, చేర్యాల, కొమురవెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల్లో కేసుల్లో ఇన్వెస్టిగేషన్ చేసి […]

Read More
నిషేధిత గుట్కాల పట్టివేత

నిషేధిత గుట్కాల పట్టివేత

సారథి న్యూస్, హుస్నాబాద్: ప్రభుత్వ నిషేధిత గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నట్లు బెజ్జంకి ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. మండల కేంద్రంలో పొగాకు, గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో పట్టణంలోని పలు కిరాణా షాపుల్లో పోలీస్ సిబ్బందితో తనిఖీలు నిర్వహించగా రూ.42,800 విలువైన అంబర్, గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ప్రభుత్వం నిషేధించిన పొగాకు గుట్కా ప్యాకెట్లు అమ్ముతున్న ఏ.సంతోష్, ఎం.రమేష్, డి.నాగరాజు, ఎండీ మసూద్ హైమద్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

Read More
విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి

విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి

సారథి న్యూస్, హుస్నాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవంలో భాగంగా గురువారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ, స్థానిక ఆర్డీవో కార్యాలయల్లో బీజేపీ నాయకులు జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా పార్టీ టౌన్ ప్రెసిడెంట్ బత్తుల శంకర్ బాబు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అధికారంలో ఉండి కూడా తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా ఎందుకు జరిపించడం లేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంఐఎం పార్టీకి భయపడుతూ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ […]

Read More
గల్లంతైన లారీడ్రైవర్ డెడ్​బాడీ లభ్యం

గల్లంతైన లారీడ్రైవర్ డెడ్​బాడీ లభ్యం

సారథి న్యూస్, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా కొహెడ మండలం బస్వాపూర్ సమీపంలో ఈనెల 15న మోయతుమ్మెదవాగులో గల్లంతైన లారీడ్రైవర్ శంకర్ డెడ్​బాడీ శనివారం లభించింది. నీటి ప్రవాహానికి బస్వాపూర్ శివారులోని వాగు ఒడ్డుకు కొట్టుకురావడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. గత శనివారం నీటిఉధృతిలో గల్లంతైన లారీడ్రైవర్ శంకర్ గా గుర్తించారు. ఘటన స్థలాన్ని ఆర్డీవో జయచంద్రారెడ్డి, ఏసీసీ మహేందర్ పరిశీలించారు.బస్వాపూర్ గ్రామస్తుల చేయూతలారీ డ్రైవర్ శంకర్ కుటుంబానికి ఆర్థిక సాయమందించానే సంకల్పంతో బస్వాపూర్ గ్రామానికి చెందిన […]

Read More