Breaking News

స్పీకర్

‘ఏఐజీ’ కాదు.. ‘గాంధీ’లో చేరండి

‘ఏఐజీ’ కాదు.. ‘గాంధీ’లో చేరండి

సామాజిక సారథి, హైదరాబాద్: అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా పాజిటివ్​ కావడంతో ప్రభుత్వ ఆస్పత్రిలో కాకుండా కార్పొరేట్ ​హాస్పిటల్​ ఏఐజీ(ఏషియన్ ఇనిస్టిట్యూట్​ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ)లో చేరడం ప్రభుత్వానికి సిగ్గుచేటని జైభీమ్​ యూత్​ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు ముకురాల శ్రీహరి విమర్శించారు. అత్యున్నతమైన స్థానంలో ఉన్న స్పీకర్ ప్రభుత్వ ఆస్పత్రులపై సామాన్యులకు నమ్మకం కలిగించాల్సింది పోయి ప్రజల సొమ్ముతో కార్పొరేట్​ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవడం చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇది ప్రభుత్వ డాక్టర్లను అవమానించడమే అవుతుందన్నారు. ఈ […]

Read More
భారతరత్న డాక్టర్​బీఆర్​అంబేద్కర్​కు ఘననివాళి

భారతరత్న డాక్టర్ ​బీఆర్​ అంబేద్కర్​కు ఘన నివాళి

సారథి న్యూస్, హైదరాబాద్: భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా ఆదివారం అసెంబ్లీ ఆవరణలో ఉన్న ఆయన విగ్రహానికి శాసనసభ స్పీకర్ ​పోచారం శ్రీనివాస్​రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ ​బీఆర్​ అంబేద్కర్​దేశానికి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ లు గొంగడి సునిత, రేగా కాంతారావు, శాసనమండలి విప్ ఎంఎస్ ప్రభాకర్ రావు, […]

Read More
డిసెంబర్​నాటికి పేదలకు 85వేల ఇళ్లు

డిసెంబర్​ నాటికి పేదలకు 85వేల ఇళ్లు

సారథి న్యూస్, హైదరాబాద్: నగర శివారులోని కొల్లూరు సమీపంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను స్పీకర్ ​పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు గురువారం సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇళ్ల నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయని వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోందన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి సుమారు 85వేల ఇళ్లను పేదలకు అందించనున్నట్టు ఆయన తెలిపారు. అనంతరం […]

Read More
పాజిటివ్ తేలితే అసెంబ్లీ ఆవరణలోకి రావొద్దు

పాజిటివ్ తేలితే అసెంబ్లీ ఆవరణలోకి రావొద్దు

సారథి న్యూస్, హైదరాబాద్: ప్రత్యేక పరిస్థితుల్లో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయని, కోవిడ్ ​పాజిటివ్​గా నిర్ధారణ అయిన వారు ఎవరైనాసరే అసెంబ్లీ ప్రాంగణంలోకి రావొద్దని స్పీకర్ ​పోచారం శ్రీనివాస్​రెడ్డి సూచించారు. సమావేశాల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, సిబ్బంది, పోలీసులు, మీడియా ప్రతినిధులు, మంత్రుల పీఏలు తప్పనిసరిగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సమావేశాల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్, ​ఉన్నతాధికారులు, […]

Read More

కరోనాను కలిసికట్టుగా ఎదుర్కొందాం

సారథి న్యూస్, శ్రీకాకుళం : మానవ సమాజ రక్షణకు కలిసికట్టుగా కరోనా మహ్మారిని తరిమేద్దామని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పిలుపునిచ్చారు. శనివారం ఆర్ బీ గెస్ట్ హస్ వద్ద విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాను ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలని కోరారు. రాజకీయాలకు తావు లేకుండా విపత్తును ఎదుర్కోవడానికి కఠిన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. స్వీయ నియంత్రణ పాటిస్తూ జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆదేశాలను ప్రజలు తప్పకుండా పాటించాలన్నారు.

Read More