Breaking News

సిద్దిపేట

క్రేన్​పడి ఇద్దరు రైతుల మృత్యువాత

క్రేన్​ పడి ఇద్దరు రైతుల మృత్యువాత

బల్లూనాయక్ తండాలో విషాదం సారథి న్యూస్, హుస్నాబాద్: బావిలో పూడిక తీస్తుండగా క్రేన్ ​పైనపడి ఇద్దరు రైతులు మృత్యువాతపడ్డారు. ఈ విషాదకర సంఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం బల్లూనాయక్ తండాలో గురువారం చోటుచేసుకుంది. హుస్నాబాద్ ఎస్సై ఎస్. శ్రీధర్ కథనం మేరకు.. ఇదే తండాకు చెందిన లావుడ్య దుర్గ, దేవోజికి సంబంధించిన వ్యవసాయ బావిలో పూడిక తీస్తుండగా ప్రమాదవశాత్తు క్రేన్ విరిగి బావిలో పడిపోయింది. దీంతో బావిలో పనిచేస్తున్న నలుగురి మీద క్రేన్ పడి లావుడ్య […]

Read More
మంత్రి బ్యాటింగ్.. ఎమ్మెల్యే బౌలింగ్

మంత్రి బ్యాటింగ్.. ఎమ్మెల్యే బౌలింగ్

సారథి న్యూస్, హుస్నాబాద్: యువతకు క్రీడలు చాలా అవసరమని, గ్రామీణ ఆటలు బాగా ఆడించాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్ రావు పిలుపునిచ్చారు. మండల కేంద్రమైన కోహెడలో సీఎం కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్​వీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ నియోజకవర్గస్థాయి క్రికెట్ టోర్నమెంట్ క్రీడలను మంత్రి హరీశ్ రావు బుధవారం వీక్షించారు. ఈ మేరకు హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్​ బౌలింగ్ చేయగా, మంత్రి బ్యాటింగ్ చేస్తూ.. వినూత్నరీతిలో షాట్లు కొట్టి అక్కడి వారందరినీ అలరించారు. ఈ […]

Read More
కొమురెల్లి.. ప్రణమిల్లి

కొమురెల్లి.. ప్రణమిల్లి

వైభవంగా కోరమీసాల మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు హరీశ్ రావు, మల్లారెడ్డి సారథి న్యూస్, హుస్నాబాద్: భక్తుల కొంగు బంగారమైన కొమురవెళ్లి మల్లన్న కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ముక్కోటి దేవతలు, పంచభూతల సాక్షిగా, వేలాది భక్తుల మధ్య వీరశైవ పండితుల మంత్రోచ్ఛరణ కొమురవెల్లి మల్లికార్జునస్వామి, కేతలమ్మ, బలిజ మేడలదేవిని వివాహమాడారు. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులుఅంగరంగ వైభవంగా నిర్వహించే మల్లన్న కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. స్వామివారికి […]

Read More
ఎస్సీ, ఎస్టీల కేసులు పెండింగ్​లో పెట్టొద్దు

ఎస్సీ, ఎస్టీ కేసులు పెండింగ్​లో పెట్టొద్దు

సారథి న్యూస్, మెదక్: అత్యాచారం కేసును 60 రోజుల్లో విచారణ జరిపి బాధితులకు పరిహారంతో పాటు న్యాయం చేయాలని రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను కోరారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్​లో ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. సిద్దిపేట జిల్లాలో 122, మెదక్ 25, సంగారెడ్డి 27 చొప్పున మొత్తం 174 కేసులు పెండింగ్​లో ఉన్నాయని వివరించారు. మెదక్ జిల్లాలో ఉన్న 25 పెండింగ్ కేసుల్లో ప్రధానంగా 12 కేసులు […]

Read More
సోనూసూద్‌.. మై గాడ్​!

సోనూసూద్‌.. మై గాడ్​!

సినీనటుడికి గుడి కట్టిన వీరాభిమాని సిద్దిపేట జిల్లా చెలిమితండాలో విగ్రహావిష్కరణ సారథి న్యూస్, హుస్నాబాద్: సాధారణంగా దేవుళ్లకు గుళ్లుగోపురాలు కడుతుంటారు.. కానీ ఓ మనిషిలో దేవుడిని చూసి.. ఆ మనిషికే గుడి కట్టాడు ఓ అభిమాని. దైవంగా భావించి ఆ ఊరులో పూజలు అందుకుంటున్న ఆ వ్యక్తి ఎవరో కాదు సుప్రసిద్ధ బాలీవుడ్​ సోనూసూద్​. సినిమాల్లో విలన్‌ పాత్రల్లో కనిపించినప్పటికీ ఆయన ఇప్పుడు అందరి దృష్టిలో హీరో అయ్యాడు. లాక్‌డౌన్‌ సమయంలో కష్టాల్లో ఉన్న పేదలందరికీ విశేషమైన […]

Read More
ఆగ్రహించిన చేర్యాల జనం

ఆగ్రహించిన చేర్యాల జనం

ధ్వంసమైన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అక్రమ కట్టడాలు జనాగ్రహానికి ధ్వంసమైన యాదగిరిరెడ్డి కబ్జా భూమి పోలీసుల రంగ ప్రవేశం, అఖిలపక్షనాయకుల అరెస్టు సారథి న్యూస్, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి భూ రాజకీయం కలకలం రేపుతోంది. అక్రమ నిర్మాణం చేపట్టారని విపక్ష నాయకులు, కార్యకర్తలు వాటిని ధ్వంసం చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. ఇక్కడి పెద్దచెరువు కింద భాగంలో కొంత ప్రదేశాన్ని దశాబ్దాలుగా పట్టణ ప్రజలు పశువుల సంతగా వాడుకుంటున్నారు. భూమిని ఎమ్మెల్యే […]

Read More
మర్కుక్ ఠాణా ప్రారంభం

మర్కుక్ ఠాణా ప్రారంభం

సారథి న్యూస్​, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా మర్కుక్ పోలీస్ స్టేషన్ ను హోంశాఖ మంత్రి మహమూద్​అలీ, ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్​రావు శుక్రవారం ప్రారంభించారు. హోంమంత్రి మహమూద్​ అలీ పోలీస్​ అధికారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి, ఫారెస్ట్​కార్పొరేషన్​ చైర్మన్​ వంటేరు ప్రతాప్​రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, టీఆర్​ఎస్​ నాయకులు పాల్గొన్నారు.

Read More
సిద్దిపేటలో కేసీఆర్​నగర్​

సిద్దిపేటలో కేసీఆర్​ నగర్​

సారథి న్యూస్, హైదరాబాద్: సిద్దిపేటలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వివిధ అభివృద్ధి పనులకు గురువారం ప్రారంభోత్సవం చేయనున్నారు. సిద్దిపేటలో నిర్మించిన డబుల్​ బెడ్​రూమ్​ ఇళ్ల సముదాయానికి కేసీఆర్ నగర్ గా నామకరణం చేయబోతున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్​రావు మాట్లాడుతూ.. రూ.163 కోట్ల వ్యయంతో 2,460 ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. తొలి విడతలో 1, 341 ఇళ్లు, రెండో విడత వెయ్యి ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ […]

Read More