సారథి న్యూస్, శ్రీశైలం/కర్నూలు: జాతిపిత మహాత్మాగాంధీ ఆశయసిద్ధి కోసం సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బాటు వేశారని, అందుకు వలంటీర్ల వ్యవస్థను నిదర్శంగా భావించవచ్చని కలెక్టర్ జి.వీరపాండియన్ అన్నారు. శుక్రవారం గాంధీ జయంతిని పురస్కరించకుని సున్నిపెంటలోని గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళుర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని గిరిపుత్రులకు భూమి హక్కు కల్పించేలా సీఎం నిర్ణయం తీసుకోవడంతో పాటు భూమిహక్కు పత్రాల పంపిణీకి శ్రీకారం చుట్టడం […]
సారథిన్యూస్, మహబూబ్‌నగర్: శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతున్నది. దీంతో అధికారులు 8 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం 2,10,420 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా.. 2,52,459 క్యూసెక్కులను దిగవకు వదలుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 884.20 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలకు కాగా ప్రాజెక్టులో 210.9946 టీఎంసీలుగా నీరు ఉన్నది. మరోవైపు కుడిగట్టు […]
సారథి న్యూస్, నాగర్ కర్నూల్: శ్రీశైలం ఘాట్ రోడ్డు వద్ద 50 అడుగుల లోతులో ఉన్న లోయలో వ్యాన్పడింది. ఈ ప్రమాదంలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఈగలపెంట వద్ద మంగళవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లోయలో పడిన క్షతగాత్రులను పోలీసులు, విద్యుత్ సిబ్బంది వెలికి తీస్తున్నారు.క్షత్రగాత్రులను హైదరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు.
శ్రీశైలం: జూరాల రిజర్వాయర్ నుంచి వరద ప్రవాహం పెరగడంతో శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. డ్యాం నిండుకుండలా మారడంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గురువారం 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్‌ఫ్లో 2,22,221 క్యూసెక్కులు ఉంది. ఔట్‌ఫ్లో 3,50,422 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 885 అడుగుల మేర ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ […]
సారథి న్యూస్, శ్రీశైలం: లోకకల్యాణం కోసం శ్రీశైలం దేవస్థానం వారు ఆదివారం రాత్రి మల్లికార్జునస్వామి, భ్రమరాంబ అమ్మవారికి పల్లకీ ఉత్సవం జరిపించారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవాసంకల్పాన్ని పఠించారు. తర్వాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ జరిపించారు. అనంతరం శాస్త్రోక్తంగా షోడశోపచారపూజలు జరిపించారు. తగిన జాగ్రత్తలతో భౌతికదూరం పాటిస్తూ పల్లకీ ఉత్సవాన్ని నిర్వహించామని ఈవో రామారావు తెలిపారు.
సారథి న్యూస్, కర్నూలు, మానవపాడు(జోగుళాంబ గద్వాల): శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుకోవడంతో నీటిని విడుదల చేస్తున్నారు. ఒకేసారి 13లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అలాగే ఎగువ ఉన్న జూరాల ప్రాజెక్టు నుంచి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం 17గేట్లను ఎత్తివేశారు. 1,51,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. ఔట్ ఫ్లో 1,59,542 క్యూసెక్కులుగా నమోదైంది. నీటి ప్రవాహంతో బీచుపల్లి పుణ్యక్షేత్రం వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ఆహ్లాద వాతావరణాన్ని పంచుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు […]
సారథి న్యూస్, శ్రీశైలం(కర్నూలు): లోకకల్యాణం కోసం శ్రీశైలం దేవస్థానం ఆలయ ప్రాంగణంలోని సుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి) వారికి విశేషపూజలు నిర్వహించారు. అభిషేకం, సుబ్రహ్మణ్య అష్టోత్తరం చేసిన అనంతరం సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణలు చేశారు. స్వామివారికి పంచామృతాలైన పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరినీళ్లు, పండ్ల రసాలతో విశేష అభిషేక కార్యక్రమం నిర్వహించారు. అర్చక స్వాములు భౌతిక దూరాన్ని పాటిస్తూ విశేషార్చనలు జరిపించారని ఈవో రామారావు తెలిపారు.
సారథి న్యూస్, శ్రీశైలం(కర్నూలు): లోక కల్యాణం కోసం దేవస్థానం మంగళవారం ఆలయ ప్రాంగణంలో నందీశ్వరస్వామివారికి (శనగల బసవన్న స్వామివారికి) విశేషార్చనలు జరిపించింది. నందీశ్వరస్వామికి శాస్త్రోక్తంగా పంచామృతాలు, , ద్రాక్ష, బత్తాయి, అరటి మొదలైన ఫలోదకాలతో హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, భస్మోదకం, రుద్రాక్షోదకం బిల్వోదకం, పుష్పోదకం, సువర్ణోదకం, ల్లికాగుండంలోని శుద్ధజలంతో అభిషేకం నిర్వహించారు. తర్వాత నందీశ్వరస్వామి వారికి నూతనవస్త్ర సమర్పణ, విశేషపుష్పార్చనలు చేశారు. తర్వాత నానబెట్టిన శనగలు నందీశ్వర స్వామికి సమర్పించారు.