న్యూఢిల్లీ : క్రికెట్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 13 వ సీజన్ ఐపీఎల్ షెడ్యూల్ ఈ నెల 6న(ఆదివారం) విడుదల కానుంది. ఈనెల 19 నుంచి నవంబర్10 మధ్య జరగబోయే ఈ మెగాటోర్నీ దుబాయ్, అబుదాబి, షార్జాలో నిర్వహించనున్నారు. ఈ మేరకు టోర్నీ షెడ్యూల్ ను ఆదివారం విడుదల చేస్తామని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ తెలిపారు. ఇప్పటికే అన్ని జట్లు దుబాయ్ కు చేరుకుని ప్రాక్టీస్ మొదలెట్టాయి.
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కేసులు, మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.గత 24 గంట్లో కొత్తగా 78,761 కొత్తకేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 35,42,734కు చేరింది. కాగా, గత 24 గంటల్లో కరోనాతో 948 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఇప్పటివరకు 63,498 మంది కరోనా బారినపడి చనిపోయారు. 27,13,934 కోలుకోగా.. 7,65,302 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ టెస్టుల సంఖ్య గణనీయంగా పెంచుతున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 4,14,61,636 మందికి కరోనా […]
సారథిన్యూస్, రామాయంపేట: గ్రామాల్లో అభివృద్ధి పనులు నిరాటంకంగా కొనసాగించాలని మెదక్ జిల్లా ఇంచార్జి కలెక్టర్ వెంకట్రామిరెడ్డి సూచించారు. శుక్రవారం ఆయన మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో పర్యటించారు. ఈ గ్రామానికి సీఎం కేసీఆర్ ఓఎస్డీ ( ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) రాజశేఖర్రెడ్డి రూ. 1.64 కోట్లు మంజూరు చేయించారు. ధర్మారం రాజశేఖర్రెడ్డి స్వగ్రామ కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వం కేటాయించిన నిధులతో గ్రామంలో […]
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ తయారు చేసినట్లు రష్యా ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై అంతర్జాతీయ నిపుణులు మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రయోగ పరీక్షలు ఫలితాల సమాచారాన్ని ఎక్కడా వెల్లడించకపోవడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. కేవలం రెండు నెలల ప్రయోగాల అనంతరం వ్యాక్సిన్ ఆమోదాన్ని ప్రకటించడంపై పెదవివిరుస్తున్నారు. ఇలాంటి సమయంలో వ్యాక్సిన్‌ను నమ్మడం కష్టమని బ్రిటన్, జర్మనీ పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. కొవిడ్ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా పలుకంపెనీలు భారీస్థాయిలో పరిశోధనలు చేపట్టాయి. ఇప్పటికే […]