సారథి, రామాయంపేట: కేరళ నుంచి మధ్యప్రదేశ్ కు 10 మంది వలస కూలీలతో వెళ్తున్న బోలెరో వాహనం నేషనల్ హైవే నం.44పై రామయంపేట స్థానిక పెద్దమ్మ టెంపుల్ వద్ద టైర్ పంచర్ కావడంతో బోల్తాకొట్టింది. అందులో ఉన్న ముగ్గురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. పలువురికి స్వల్పంగా గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం రామాయంపేట గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. పోలీసులు కేసుదర్యాప్తు చేస్తున్నారు.
ప్రపంచమంతా ఆధునికత వైపు ముందుకెళ్తుంటే.. కాయకష్టాన్ని నమ్ముకున్న వలస కూలీ మాత్రం ఓ పూట తిండి కోసం ఇప్పటికీ అల్లాడుతున్నాడు. ఇలాంటి కన్నీటి గాథలను కథలు కథలుగా వింటూనే ఉన్నాం. అయితే ఈ బక్కపల్చటి బతుకుల్లో అంతకుమించిన ఆవేదనను మిగిల్చింది కరోనా. మరీ ముఖ్యంగా మహిళలకు మనసు చెలించే కథలనే రాసింది. కాలం చేసిన గాయాల్లో ఎందరో ఆడ కూతుళ్ల కన్నీటి బొట్లకు ఇవి కొన్ని సాక్ష్యాలు మాత్రమే. రూ.లక్షలు, రూ.కోట్లు సంపాదించాలని కలలో కూడా కోరుకోని […]
న్యూఢిల్లీ: ఈ ఏడాది నవంబర్ వరకు ప్రజలకు ఉచితంగా రేషన్ అందజేస్తామని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. వన్ నేషన్.. వన్ రేషన్ కింద దేశంలోని ఏ రాష్ట్రంలో ఉన్న పేదలైనా ప్రభుత్వ సాయం పొందవచ్చని చెప్పారు. వలస కూలీలను దృష్టిలో ఉంచుకొని ఈ పథకాన్ని ప్రవేశపెడుతుమన్నారు. రేషన్ కార్డు ఉన్న నిరుపేదలందరికీ నెలకు 5 కిలోల బియ్యం, గోధుమలు, కిలో కందిపప్పు అందజేస్తామని చెప్పారు. 80 కోట్లమంది ఈ పథకం కింద లబ్ధి పొందుతారని ప్రధాని చెప్పారు. […]
సారథి న్యూస్, నారాయణపేట: ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న వలస కూలీలను వాటి యజమానులు ఆదుకోవాలని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ సూచించారు. నారాయణ పేట జిల్లా మక్తల్ మండలం, గొల్లపల్లిలో ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న ఒడిశా వలస కూలీలను మంగళవారం కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రజలతో పాటు వలసొచ్చిన కూలీల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నిత్యావసర వస్తువులు, నగదును ఇప్పటికే పంపిణీ చేశామన్నారు. మానవతా […]
సారథి న్యూస్, నర్సాపూర్: మెదక్ జిల్లా నర్సాపూర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నాగరాజు వలస కూలీలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన పట్టణంలోని మార్కెట్లో తిరిగి కూరగాయల ధరలను అడిగి తెలుసుకున్నారు. వ్యాపారులకు సూచనలు చేశారు. తూప్రాన్ డీఎస్పీ కిరణ్ కుమార్, స్థానిక సీఐ నాగయ్య, ఎస్సై సత్యనారాయణ ఉన్నారు.