Breaking News

వరంగల్

దంచికొడుతున్న వానలు

దంచికొడుతున్న వానలు

సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ర్టంలో ఏక‌ధాటిగా కురుస్తున్న వ‌ర్షాల‌తో చెరువులు, కుంటలు, జ‌ల‌వ‌న‌రులు నీటిమ‌య‌మ‌య్యాయి. న‌దులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలోని ప‌లు ప్రాంతాల నుంచి అధికారులు ఐదువేల మందిని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. ములుగు జిల్లాలోని రామ‌న్నగూడెం పుష్కరఘాట్ వ‌ద్ద గోదావ‌రి నీటిమట్టం 9.90 మీటర్లకు చేరింది. నదికి స‌మీపంలోని ఏటూరునాగ‌రం గ్రామంలోని లోత‌ట్టు ప్రాంతాల నుంచి అధికారులు దాదాపు వెయ్యి మందిని త‌ర‌లించారు. లోత‌ట్టు ప్రాంతాలు మునిగిపోవ‌డంతో […]

Read More
పూలే విగ్రహ ధ్వంసం సరికాదు

పూలే విగ్రహధ్వంసం హేయం

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: వరంగల్ లో జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు మురళి మాదిగ డిమాండ్ చేశారు. మురికివాడల్లో నివసించే పేద వారి కోసం పాఠశాలలు ఏర్పాటు చేసి, ఉచితంగా విద్యను అందించిన ఆదర్శప్రాయుడు జ్యోతిరావు పూలే అన్నారు. అటువంటి మహనీయుడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు.

Read More
కరోనా మృతులకు ప్రత్యేక శ్మశానవాటిక

కరోనా మృతులకు ప్రత్యేక శ్మశానవాటికలు

సారథి న్యూస్​, వరంగల్: కరోనా బారినపడి మరణించిన వారి దహనానికి ప్రత్యంగా శ్మశానవాటికల ఏర్పాటుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని మహానగర పాలక సంస్థ కమిషనర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. బుధవారం వారితో సమీక్షించారు. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్ల కోసం వేర్వేరుగా ప్రత్యేక స్థలాలను గుర్తించాలన్నారు. మృతదేహాలను శ్మశానవాటికలకు తరలించడానికి అంబులెన్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. డీఎఫ్ వో కిశోర్ ఆధ్వర్యంలో 12 మంది సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసినట్లు వివరించారు. హోం క్వారంటైన్​కు మున్సిపల్ గెస్ట్​హౌస్​, […]

Read More
సూపరింటెండెంట్​ రాజీనామా

ఎంజీఎం సూపరింటెండెంట్​ రాజీనామా

సారథిన్యూస్​, వరంగల్​: ఉమ్మడి వరంగల్​ జిల్లాలోనే అతిపెద్ద ప్రభుత్వ దవాఖాన అయిన ఎంజీఎం సూపరింటెండెంట్​ డాక్టర్​ శ్రీనివాసరావు రాజీనామా చేశారు. తాను కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నానని అందుకే రాజీనామా చేసినట్టు ఆయన తెలిపారు. కాగా ఈ విషయంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా నేపథ్యంలో జరిగిన పరిణామాల వల్లే అతడు రాజీనామా చేసినట్టు సమాచారం. తెలంగాణలోని పలువురు వైద్యులు కరోనా పరిణామాలతో తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలుచోట్ల జూనియర్​ డాక్టర్లు ధర్నాలు చేసిన విషయం తెలిసిందే. […]

Read More

పిల్లలకు విషమిచ్చి.. తానూ తాగిన తల్లి

చిన్నారుల మృతి.. తల్లి పరిస్థితి విషమం సారథి న్యూస్​, మేడ్చల్​​: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తల్లి తన పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చిన్నారులు చనిపోగా, తల్లి పరిస్థితి విషమంగా మారింది. పోలీసుల కథనం మేరకు.. వరంగల్ జిల్లాకు చెందిన గోపీనాథ్‌కు ప్రీతి అనే మహిళతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. కొంతకాలంగా వీరు మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేటలోని మజీద్‌పూర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు గౌరవ్(4), కౌశిక్(3) ఉన్నారు. గోపీనాథ్‌ ఓ ప్రైవేట్​ సంస్థలో […]

Read More