సారథి న్యూస్, వనపర్తి: రోజురోజుకూ రకరకాల వ్యాధులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలో ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుని పారిశుద్ధ్యం, అనారోగ్య సమస్యలు తదితర వాటిపై అవగాహన కల్పించాలని పోలీసుశాఖ అధికారులు, సిబ్బందికి వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వరావు సూచించారు. బుధవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధుల బారినపడకుండా వృద్ధులు, చిన్నారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనారోగ్య సమస్యలు ఉన్నవారు బయట తిరగొద్దని సూచించారు. వనపర్తి సీఐ సూర్యనాయక్, వనపర్తి […]
సారథి న్యూస్, వనపర్తి: ఈనెల 8 తర్వాత కూడా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె అధికారులతో సమీక్షించారు. గ్రామాల పారిశుద్ధ్యం ఎంపీడీవోలు, ఎంపీవోలదే బాధ్యత అని అన్నారు. హరితహారం మొక్కల పెంపకంపై ప్లాన్ను సమర్పించాలని ఆదేశించారు. అంతకుముందు ఆమె ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ లో భాగంగా అమరచింత మున్సిపాలిటీలో పర్యటించారు. జడ్పీ హైస్కూలు ఆవరణలో హరితహారం మొక్కలు నాటారు. అమరచింత ఆత్మకూరు […]
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు వనపర్తి జిల్లాలో మొదటి కరోనా కేసు అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం బాధితులను గాంధీ ఆస్పత్రికి తరలించిన అధికారులు సారథి న్యూస్, మహబూబ్ నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది.. చాప కింద నీరులా కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది.. తాజాగా శనివారం పాలమూరు జిల్లాలో రెండు పాజిటివ్ కేసులు నమోదుకావడం వ్యాధి తీవ్రత, అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది.. హన్వాడ మండలం వేపూర్ గ్రామానికి […]
వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సారథి న్యూస్,నాగర్ కర్నూల్: అద్భుత తెలంగాణ ఆవిష్కరణకు నూతన వ్యవసాయ విధానాన్ని అమలు చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నియంత్రిత సాగు విధానంపై రైతులకు ఏర్పాటుచేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దశాబ్దకాలం తర్వాత ప్రపంచ వ్యవసాయ చిత్రపటంలో తెలంగాణ ఉంటుందన్నారు. వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాలో వేరుశనగ నుంచి మంచి […]
కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ సూచనలు… సారథి న్యూస్, వనపర్తి: కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ సూచనలు తప్పకుండా పాటించాలని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. మంగళవారం ఆయన వీపనగండ్ల మండలంలోని గోవర్ధనగిరి, సంగినేనిపల్లి, తూముకుంట, బొల్లారం, వీపనగండ్ల గ్రామాల ప్రజలతో మాట్లాడారు. ఎక్కువ సార్లు చేతులు శుభ్రం చేసుకోవడం, నోటికి రుమాలు కట్టుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే సంగినేనిపల్లి గ్రామంలో పేద కుటుంబాలకు […]
సారథి న్యూస్, వనపర్తి: వనపర్తి జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తిపై కట్టడి ఎక్కువ చేశారు. జోగుళాంబ గద్వాల రెడ్ జోన్ గా ఉన్నందున అక్కడి నుంచి వనపర్తి జిల్లాలోని ఆత్మకూరు, అమరచింత మండలాలకు పూర్తిగా రాకపోకలు నిషేధించారు. ఎవరైనా అక్రమంగా ప్రవేశిస్తే కేసులు పెడతామని ఆత్మకూరు సీఐ సీతయ్య హెచ్చరించారు. జూరాల ప్రాజెక్టు వద్ద గేటు తాళాలు విరగ్గొట్టి ఆత్మకూరు అమరచింత మండలం రాత్రిపూట అక్రమంగా వస్తున్నారని దీనిపై నిఘా ఉంచి ఎవరైనా ప్రవేశిస్తే చర్యలు తీసుకుంటామని […]