సారథి, పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలో లాక్ డౌన్ నిబంధనలు పాటించని పలు షాపుల యజమానులకు శనివారం ఎస్సై నరేందర్ జరిమానా విధించారు. ఉదయం 10 గంటల తర్వాత అన్ని దుకాణాలు తప్పనిసరిగా మూసివేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిబంధనలను తప్పనిసరిగా ప్రతిఒక్కరూ పాటించాలని, ప్రతిఒక్కరూ భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్కులు ధరించాలని ఆయన కోరారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట పంచాయతీ ఈవో విఠల్, పోలీస్ […]
సారథి, రామడుగు: కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీని ప్రభావం పండగలపై పడింది. అందులో భాగంగానే శుక్రవారం రంజాన్ నిరాడంబరంగా ఇంట్లోనే జరుపుకున్నారు. ఉదయాన్నే ఇంట్లోనే నమాజ్ చేసి సెమియా, బిర్యానీ వంటి వంటకాలు తయారుచేసి భుజించారు.
సారథి, పెద్దశంకరంపేట: నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అల్లాదుర్గం సీఐ జార్జ్ అన్నారు. గురువారం ఆయన పెద్దశంకరంపేట్ లో లాక్ డౌన్ పరిస్థితిపై పర్యవేక్షించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ను ప్రజలంతా తప్పకుండా పాటించాలని సూచించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాతో పాటు కేసులు నమోదుచేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. లాక్‌డౌన్ మినహాయింపు సమయంలో నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకోవాలన్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో పికెట్లు, ప్రధాన రహదారిపై […]
సారథి, రామడుగు: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో లాక్ డౌన్ వల్ల వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి పట్ల రామడుగు మండలం గోపాల్ రావుపేట సర్పంచ్ కర్ర సత్యప్రసన్న ఉదారత చాటుకున్నారు. లాక్ డౌన్ తో అంబులెన్స్ లు, ఇతర వాహనాలు దొరక్క హాస్పిటల్ కు వెళ్లలేని వారి కోసం స్వయంగా తన సొంత కారును గురువారం నుంచి అందుబాటులో ఉంచారు. పెట్రోల్, డ్రైవర్ ను సంబంధిత వ్యక్తులే చూసుకోవాలని సర్పంచ్ సత్యప్రసన్న సూచించారు. […]
* రాజన్న సన్నిదిలో కొడేమొక్కులు రద్దు సారథి, వేములవాడ: శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం దక్షిణ కాశీగా పేరుప్రతిష్టలు పొందింది. రాజన్న ఆలయంలో కారోన వైరస్ సెకండ్ వేవ్ ఉధృతంగా విజృంభిస్తోంది. దీంతో గురువారం నుండి రాజన్న ఆలయంలో కోడె మొక్కుబడితో పాటు పలు కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి హరికిషన్ తెలిపారు. అదే విధంగా మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి పాలకవర్గం, అధికారులతో ఏర్పాటు చేసి అత్యవసర సమావేశంలో ఆమె మాట్లాడుతూ […]
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. కొవిడ్ 19 దెబ్బకు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్, కర్ఫ్యూల వైపు అడుగులు వేస్తున్నాయి. ప్రైవేట్ ఉద్యోగులు, వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపాయి. చాలా మంది ఉపాధి లేక రోడ్డునపడుతున్నారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో బ్యాంకులు రుణ గ్రహీతలకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకోనున్నాయి. లోన్ ఈఎంఐ చెల్లింపుల పట్ల కొంత గడువు ఇచ్చే విషయాన్ని ఆర్బీఐకి ఆయా బ్యాంకులు తెలియజేశాయి. లోన్లు తీసుకున్నవారికి మరో మూడునెలల […]
న్యూఢిల్లీ: లాక్‍డౌన్ తర్వాత భారతీయ రైల్వే 230 రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మే 12 నుంచి 30 స్పెషల్ రాజధాని రైళ్లు, జూన్ 1 నుంచి 200 స్పెషల్ మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడుపుతోంది. ఇక సెప్టెంబర్ 12వ తేదీ నుంచి మరో 80 రైళ్లను నడపనుంది. రైల్వేశాఖ ప్రకటించిన ప్రత్యేక రైళ్లలో కొన్ని తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్తున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ రైల్వే సర్వీసులను వినియోగించవచ్చు.తెలుగు […]
సారథిన్యూస్, గోదావరిఖని: సింగరేణిలో లాక్డౌన్ ప్రకటించి కార్మికుల ప్రాణాలు కాపాడాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్, ఏఐటీయూసీ, సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్, సీఐటీయూ నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సింగరేణిలో కరోనా వైరస్ లక్షణాలతో కార్మికులు చనిపోతున్నారని పేర్కొన్నారు. ఉద్యోగులు విధులు నిర్వర్తించడానికి ఎంతో భయపడతున్నారని చెప్పారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ […]