సారథి న్యూస్, మెదక్: సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. దీంతో మంజీరా నదికి వరద ఉదృతి సంతరించుకుంది. మెదక్ జిల్లాలోని వనదుర్గా ప్రాజెక్ట్ పూర్తిగా నిండి పొంగిపొర్లుతోంది. దిగువన ఉన్న ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. అమ్మవారి ప్రధాన ఆలయ ముందు ఉన్న నదీ పాయ పరవళ్ల తొక్కుతుండడంతో మండపంలోకి నీరు చేరింది. దీంతో ఆలయానికి రాకపోకలు ఆగిపోయాయి. రాజగోపురంలో ఉత్సవ విగ్రహాన్ని ఉంచి భక్తులు […]
సారథి న్యూస్, మెదక్: కొండా లక్ష్మణ్‌బాపూజీ నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడని, ఆయనను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని మెదక్ అడిషనల్ కలెక్టర్వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని ప్రజావాణి హాల్లో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 105వ జయంతి వేడుకలను నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం కొండా లక్ష్మణ్‌బాపూజీ జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. బాపూజీ […]
సారథి న్యూస్, మెదక్: జిల్లాలోని అన్ని గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలను తప్పకుండా ఏర్పాటు చేయాలని, ప్రత్యేకాధికారులు సమన్వయంతో పనిచేయాలని మెదక్ జిల్లా ఇన్చార్జ్కలెక్టర్ వెంకట్రామిరెడ్డి సూచించారు. శనివారం సాయంత్రం మెదక్ కలెక్టరేట్ లో జిల్లాలోని ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఆయా శాఖల అధికారులతో డంపింగ్ యార్డులు, పల్లెప్రకృతి వనాలు, రైతు వేదికల నిర్మాణాలు, వైకుంఠధామాల నిర్మాణాలు, రైతుకల్లాల విషయాలపై చర్చించారు. గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద […]
సారథి న్యూస్, పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట గవర్నమెంట్ హైస్కూలు తెలుగు ఉపాధ్యాయులు శంకరయ్య రాసిన ‘విమల శతకం’ పుస్తకాన్ని బుధవారం డీఈవో రమేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 108 పద్యాలు నైతిక విలువలకు సంబంధించినవే ఉన్నాయని అన్నారు. యువతను చైతన్యపరచడం, కుటుంబక్షేమం.. వంటి అనేక విషయాలను ఇందులో రాయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం పోమ్యానాయక్, సెక్టోరియల్ ఆఫీసర్ సుభాష్, నాగేశ్వర్ నాయక్, టీచర్లు రఘునాథ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, నర్సాపూర్: మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ని చిల్డ్రన్ పార్కు లో కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయడంపై ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. కబ్జాచేసేందుకు కుట్రపన్నుతున్నారని ఆక్షేపించారు. శుక్రవారం నర్సాపూర్ ఎంపీడీవో ఆఫీసులో ఎంపీపీ జ్యోతిసురేష్ నాయక్ అధ్యక్షతన జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. టీపీసీసీ అధికార ప్రతినిధి రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ.. నర్సాపూర్ చెరువులో పెద్దఎత్తున ఇసుకను తవ్వుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. పేదలు ఇంటి బాత్రూమ్ను కట్టుకోవడానికి ట్రాక్టర్ […]
సారథి న్యూస్, మెదక్: గర్భిణులు, బాలింతలను రక్తహీనత నుంచి కాపాడేందుకు ప్రభుత్వం పోషక పదార్థాలు అందిస్తోందని మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ అన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లో పోషణ్ అభియాన్ కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాలు, టీచర్ల పాత్ర ఎంతో కీలకమన్నారు. గర్భిణులు పోషకాహారం తీసుకోవాలని సూచించారు. రక్తహీనతపై మహిళా సంఘాలు, అంగన్వాడీ టీచర్లు, టీచర్లు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిఒక్కరూ తాము తీసుకునే ఆహారపు […]
సారథి న్యూస్, పెద్దశంకరంపేట: తెలంగాణలోని పల్లెల్లో నేడు అభివృద్ధి పనులను చూసి వచ్చే దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థికే ఓటు వేయాలని మెదక్ జిల్లా పెద్దశంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్, జడ్పీటీసీ విజయ రామరాజు కోరారు. మంగళవారం దుబ్బాక నియోజకపరిధిలోని నార్సింగి మండల కేంద్రంలో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొందరు కేవలం ఎన్నికల సమయంలోనే పల్లెలకు వస్తూ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని విమర్శించారు. అభ్యర్థి ఎవరైనా టీఆర్‌ఎస్ బలపర్చిన వారికే ఓటువేసి గెలిపించాలని […]
సారథి న్యూస్, నర్సాపూర్: సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించాలని డిమాండ్‌చేస్తూ సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో మెదక్‌జిల్లా కౌడిపల్లి మండల తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. నిజాం పరిపాలన నుంచి విమోచనం పొందిన పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర తమ రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకుంటున్నాయని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రాజేందర్, అసెంబ్లీ కన్వీనర్ రాజేందర్, మండలాధ్యక్షుడు రాకేష్, మండల ప్రధాన కార్యదర్శులు లక్ష్మణ్, కుమార్, శాకయ్య, ఇతర కార్యకర్తలు […]