Breaking News

మీసేవ

కలెక్టరేట్ లో మీసేవ కేంద్రం

కలెక్టరేట్ లో మీసేవ కేంద్రం

 సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: వివిధ సమస్యల నిమిత్తం కలెక్టరేట్ కు వచ్చే సందర్శకులు, అర్జీదారుల కోసం జిల్లా అధికార యంత్రాంగం మీసేవ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. మీసేవ కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ హనుమంతరావు సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరణి కి సంబంధించి మీ సేవలో దరఖాస్తు చేసుకోవడానికి సులువుగా ఉంటుందని అన్నారు. ఆయనవెంట అదనపు కలెక్టర్ వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More
7 నిమిషాల్లో రిజిస్ట్రేషన్.. హ్యాపీ

7 నిమిషాల్లో రిజిస్ట్రేషన్.. హ్యాపీ

సారథి, మానవపాడు: కేవలం ఏడు నిమిషాల్లోనే భూమి రిజిస్ట్రేషన్​ కావడంపై వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి సంతోషం వ్యక్తంచేశారు. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు తహసీల్దార్ కార్యాలయానికి ఓ సాధారణ వ్యక్తిలా వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ధరణి రైతులకు ఒక వరమని, మధ్యవర్తులు, బ్రోకర్ల ప్రమేయం లేకుండా మీ సేవకు వెళ్లి ధరణి పోర్టల్ లో ఆన్​లైన్​చేసుకుంటే ఈజీగా రిజిస్ట్రేషన్​అయిందని గుర్తుచేశారు. ధరణి సేవలను తెలుసుకునేందుకే సాధారణ వ్యక్తిలా వచ్చానని తెలిపారు.

Read More
వరద సాయం కోసం ‘మీసేవ’ వద్దకు వెళ్లొద్దు

వరద సాయం కోసం ‘మీసేవ’ వద్దకు వెళ్లొద్దు

సారథి న్యూస్, హైదరాబాద్: జీహెచ్ఎంసీలో వరద సహాయం కోసం మీ సేవ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇంకా వరద సహాయం అందని వారి వివరాలను సేకరిస్తున్నాయని తెలిపారు. బాధితుల వివరాలు, ఆధార్ నంబర్​ ధ్రువీకరణ జరుగుతుందని, ఆ తర్వాత వారి అకౌంట్ లోనే వరద సహాయం డబ్బులు జమవుతాయని చెప్పారు. ఈనెల 7వ తేదీ నుంచి సాయం అందని వారికి మళ్లీ […]

Read More