Breaking News

భూపాలపల్లి

17న సామూహిక హరితహారం

17న సామూహిక హరితహారం

సారథి న్యూస్, రామగుండం: తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా సింగరేణి యాజమాన్యం ఈనెల 17తేదీన ఒక్కరోజునే రెండులక్షలకు పైగా మొక్కలను సింగరేణివ్యాప్తంగా నాటాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని ఏరియాల్లో దీనికోసం సన్నాహాలు చేస్తున్నారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు ఎస్‌.చంద్రశేఖర్‌(ఆపరేషన్స్‌,పా) కొత్తగూడెం కార్పొరేట్‌ ఏరియాలో ఎన్‌.బలరాం(ఫైనాన్స్‌, పీ అండ్​ పీ) భూపాలపల్లి ఏరియాలో డి.సత్యనారాయణరావు(ఈఎం) రామగుండం-1 ఏరియాలో పాల్గొననున్నారు. కరోనా జాగ్రత్తలను కచ్చితంగా పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యాజమాన్యం కోరింది.

Read More
కాళేశ్వరం సంతోషానిచ్చింది

కాళేశ్వరం సంతోషానిచ్చింది

తెలంగాణ సాగునీటి ముఖచిత్రాన్నే మార్చేసింది ఇదే స్ఫూర్తితో తుపాకులగూడెం, దుమ్ముగూడెం పనులు కాళేశ్వరం పర్యటనలో సీఎం కె.చంద్రశేఖర్​రావు ముక్తేశ్వరస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు సారథి న్యూస్, భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అనుకున్న సమయంలో ఆశించిన రీతిలో పూర్తయి నీటి పంపింగ్ కూడా నిరాటంకంగా సాగుతోందని సీఎం కె.చంద్రశేఖర్​రావు సంతోషం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తికావడంలో కృషిచేసిన నీటిపారుదల శాఖాధికారులు, వర్కింగ్ ఏజెన్సీలు, ఇతర శాఖల ఉద్యోగులను ఆయన అభినందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన […]

Read More
విదేశాల నుంచి వస్తే క్వారంటైన్ తప్పనిసరి

విదేశాల నుంచి వస్తే క్వారంటైన్ తప్పనిసరి

సారథి న్యూస్, ములుగు: కరోనా సెకండ్​ వేవ్​ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన వారిని 15 రోజుల వరకు క్వారంటైన్​లో ఉంచాలని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణాఆదిత్య సూచించారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ములుగు, భూపాలపల్లి జిల్లాల వైద్యాశాఖ అధికారులతో కోవిడ్ -19 వాక్సిన్ పై జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ.. పీహెచ్​సీల్లో […]

Read More