యువత కోసంకొత్త జాతీయ విద్యా విధానం అగర్తలాలో ప్రధాని నరేంద్రమోడీ అగర్తలా: భారత్అందరి కృషితో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. దేశంలో ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలు వెనకబడి ఉన్నాయని కొన్ని రాష్ట్రాలు ప్రాథమిక సౌకర్యాల కోసం తహతహలాడుతున్నాయి, ఈ అసమతుల్య అభివృద్ధి మంచిది కాదన్నారు. మంగళవారం త్రిపురలోని అగర్తలాలో ఆయన పర్యటించారు. రూ.450 కోట్లతో నిర్మించిన మహారాజా బిర్ బిక్రమ్ విమానాశ్రయాన్ని ఆయన ప్రారంభించారు. దీంతో పాటు ముఖ్యమంత్రి త్రిపుర గ్రామ సమృద్ధి […]
పాల్గొన్న పార్టీ చీఫ్ జేపీ నడ్డా సికింద్రాబాద్ గాంధీ విగ్రహం నుంచి రాణిగంజ్ వరకు ర్యాలీ బండి సంజయ్ అరెస్ట్ ను ఖండించిన నేతలు సామాజికసారథి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ కు నిరసనగా సికింద్రాబాద్ గాంధీ విగ్రహం నుంచి రాణిగంజ్ వరకు బీజేపీ నాయకులు మంగళవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సికింద్రాబాద్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నడ్డాతో పాటు కేంద్రమంత్రి కిషన్ […]
భారీగా పోలీసుల మోహరింపు సామాజిక సారథి, కరీంనగర్: జీవోనం.317ను సవరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు సంఘీభావంగా కరీంనగర్‌లో ఆదివారం రాత్రి ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన క్యాంపు కార్యాలయం వద్ద జాగరణ దీక్ష చేపట్టారు. కొవిడ్ ఆంక్షల నేపథ్యంలో దీక్షకు అనుమతి లేకపోవడంతో పోలీసులు భారీగా మోహరించారు. పోలీసుల వలయాన్ని ఛేదించుకొని ఎంపీ బండి సంజయ్ బైక్ పై క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. […]
మంత్రి గంగుల కమలాకర్ సామాజికసారథి, కరీంనగర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన జాగరణ దీక్ష, పోలీసులు భగ్నం చేయడంపై ఆదివారం రాత్రి మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. గొడవలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఒక ఎంపీ చట్టాలను ఉల్లంఘిస్తే ఎలా? అని నిలదీశారు. ఢిల్లీలో ఎవరైనా దీక్షలు చేస్తే కేంద్ర ప్రభుత్వం ఊరుకుంటుందా? అని ప్రశ్నించారు. ఉద్యోగుల విజ్ఞప్తి మేరకే జీవోనం.317 ఇచ్చామని తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటించే బాధ్యత […]
ప్రధాని నరేంద్రమోడీ సెటైర్ యూపీలో స్పోర్ట్స్యూనివర్సిటీకి శంకుస్థాపన మీరట్: ఒకప్పటి నేరస్తుల గడ్డ త్వరలో క్రీడాకారులకు అడ్డాగా మారబోతుందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. గతంలో నేరస్తులు మీరట్ పరిసర ప్రాంతాల్లో ‘ఖేల్ ఖేల్’ అంటూ సామాన్యుల జీవితాలతో చెలగాటం ఆడుకునేవాళ్లని, యోగి ఆదిత్యానాథ్ప్రభుత్వం వచ్చాక ఆ నేరస్తులంతా ఇప్పుడు ‘జైల్ జైల్’ అంటూ ఊసలు లెక్కబెడుతున్నారని సెటైర్లు వేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సర్ధనలో ప్రధాని నరేంద్రమోడీ స్పోర్ట్స్ యూనివర్శిటీకి ఆదివారం శంకుస్థాపన చేశారు. రూ.700 కోట్లతో దాదాపు 92 […]
ఉద్యోగులతో చర్చించాకే నిర్ణయించాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సామాజికసారథి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ అనాలోచిత.. అర్ధరాత్రి నిర్ణయాలతో ఉద్యోగులు, టీచర్లు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రభుత్వం వెంటనే జీవోనం.317ను నిలిపివేసి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యపై సీఎం స్పందించకుంటే వదిలిపెట్టే ప్రసక్తేలేదని హెచ్చరించారు. ఉద్యోగుల బదిలీల విషయంలో తాము ఎలాంటి రాజకీయం చేయడం లేదని, స్థానికత, సీనియారిటీ ఆధారంగానే బదిలీలు చేయమని కోరుతున్నామని చెప్పారు. […]
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సామాజికసారథి, హైదరాబాద్: దేశంలో మతోన్మాదశక్తులను రెచ్చగొడుతూ బీజేపీ ప్రభుత్వం పబ్బం గడుపుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ దుయ్యబట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజలకు చెప్పేదొకటి, చేసేదొకటి అనే విధంగాపరిపాలన సాగిస్తోందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజావసరాలకు అనుగుణంగా తీసుకురావాల్సిన చట్టాలను వారి స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని తప్పుబట్టారు. ప్రశ్నించాల్సిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వానికి బానిసలుగా మారారని ధ్వజమెత్తారు. దేశంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదింపేందుకు రాజకీయ […]
జనవరిలోగా ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే.. లేకపోతే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇంటింటికీ ఉద్యోగం ఏమైంది పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ సామాజికసారథి, హైదరాబాద్: బీజేపీ చేపట్టిన నిరుద్యోగ దీక్షను సీఎం కేసీఆర్ అడ్డుకుంటున్నారని, దీక్షతో ప్రభుత్వానికి వణుకు పుట్టిందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్అన్నారు. రాత్రికి రాత్రే ర్యాలీలు, సభలు నిషేధిస్తూ జీవో ఇచ్చారన్నారు. వైపు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతుంటే ఉన్న ఉద్యోగాలను ప్రభుత్వం ఊడగొడుతోందని మండిపడ్డారు. […]