Breaking News

బక్రీద్

వేడుకగా బక్రీద్ పర్వదినం

వేడుకగా బక్రీద్ పర్వదినం

సారథి, మానవపాడు: అంతా కలిసిమెలిసి బక్రీద్ పండుగను జరుపుకోవడం సంతోషకరమని జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు ఎస్సై సంతోష్ కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని జామియా మసీద్ కమిటీ, ఖలీల్ యూత్ ఆధ్వర్యంలో యువకులకు రెండేళ్ల క్రితం క్రికెట్ టోర్నీ నిర్వహించారు. కరోనా నేపథ్యంలో బహుమతులను ప్రదానం చేయలేదు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని విజేతలకు మొదటి బహుమతి, సీనియర్ కెప్టెన్ శాలిబాషా జట్టుకు, జూనియర్స్ విభాగంలో మొదటి బహుమతి ఇద్రుస్ జట్టుకు ఎస్సై సంతోష్ కుమార్, మాడుగుల […]

Read More
ఘనంగా బక్రీద్ వేడుకలు

ఘనంగా బక్రీద్ వేడుకలు

సారథి, రామడుగు: కరీంనగర్ ​జిల్లా రామడుగు మండలంలోని గ్రామాల్లో ముస్లింలు బక్రీద్ వేడుకలు బుధవారం ఘనంగా జరుపుకొన్నారు. మండల కేంద్రంలోని జామా మసీద్ లో ముస్లిం సోదరులు త్యాగానికి ప్రతీక నిలిచే బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సదర్ ఖాజీ అబ్దుల్ మజీద్ మహమ్మద్, యూనుస్ మహమ్మద్, ఖదీర్, అసిఫ్, మొయిజ్, అదిల్, అజీజ్ పాల్గొన్నారు.

Read More
భక్తిశ్రద్ధలతో బక్రీద్ వేడుకలు

భక్తిశ్రద్ధలతో బక్రీద్ వేడుకలు

సారథి, వేములవాడ: త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను ముస్లింలు బుధవారం వేములవాడ పట్టణంతో పాటు మండల కేంద్రాలు, గ్రామాల్లో భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. కరోనా నుంచి సమస్త భూప్రపంచాన్ని కాపాడాలని అల్లాహ్​ను ప్రత్యేక ప్రార్థనలతో వేడుకున్నారు. వేములవాడ పట్టణంలోని జామే, మహ్మదీయ, ఆర్ఫా, మెయిన్, మదీనా మసీదుల్లో ప్రత్యేక నమాజు చేశారు. వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని నాంపల్లి ఇస్లాంనగర్, రుద్రవరం, శాత్రాజపల్లి, ఫజల్ నగర్ జామే మసీద్ లో మత గురువు బక్రీద్ పండుగ విశిష్టత, చారిత్రక […]

Read More
బక్రీద్.. ముబారక్​

బక్రీద్.. ముబారక్​

సారథి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్​ జిల్లాలో ముస్లింలు బుధవారం భక్తిశ్రద్ధల మధ్య బక్రీద్ పర్వదినాన్ని జరుపుకున్నారు. ఈద్గాలు, మసీద్ ల్లో ప్రత్యేక నమాజు చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జామామసీద్ తోపాటు అన్ని మసీదుల్లో ప్రార్థనలు చేశారు. శ్రీపురం రోడ్డులోని ఈద్గా వద్ద ముస్లింలు ప్రత్యేక నమాజ్ చేశారు. నాగర్ కర్నూల్ ఈద్గా వద్ద ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.

Read More
బక్రీద్ పండుగకు ఏర్పాట్లు పూర్తి

బక్రీద్ పండుగకు ఏర్పాట్లు పూర్తి

సారథి, నాగర్​కర్నూల్: ముస్లింల పవిత్ర బక్రీద్ కు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. బుధవారం పండుగ కావడంతో ఈద్గాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షం కురిస్తే నమాజ్​కు ఇబ్బందులు తలెత్తకుండా మసీదుల్లోనే ప్రార్థనలు చేసేలా ఏర్పాట్లుచేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీపురం రోడ్డులోని ఈద్గా వద్ద మున్సిపాలిటీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈద్గాకు పెయింటింగ్ వేయించడంతో పాటు ఆవరణలో పారిశుద్ధ్య పనులు చేయించారు. స్టోన్​డస్ట్​పోసి బురదను సరిచేశారు. అలాగే జిల్లా కేంద్రంలోని జామా మసీద్​ను […]

Read More
శాంతియుతంగా బక్రీద్

శాంతియుతంగా బక్రీద్

సారథి, మానవపాడు: వచ్చే బక్రీద్, వినాయక చవితి పండుగలను ఎవరికి ఇబ్బంది కలిగించకుండా జరుపుకోవాలని జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు ఎస్సై సంతోష్ సూచించారు. ఆదివారం మానవపాడు పోలీస్​స్టేషన్ ఆవరణలో ముస్లిం పెద్దలు, ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు, యువకులతో శాంతిసమావేశం నిర్వహించారు. మత సామరస్యానికి ప్రతీకగా అందరం కలిసి పండుగలను జరుపుకుందామని పిలుపునిచ్చారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఈద్గా ప్రార్థన స్థలాల్లో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతిఒక్కరూ మాస్క్ ​ధరించి, భౌతికదూరం పాటించాలని కోరారు. సోషల్ […]

Read More
గోవధకు పాల్పడొద్దు

గోవధకు పాల్పడొద్దు

సారథి, రామడుగు: కరీంనగర్ ​జిల్లా రామడుగు మండలంలోని అన్ని గ్రామాల మసీద్ కమిటీ సభ్యులతో ఎస్సై టి.వివేక్ శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బక్రీద్ సందర్భంగా ఎలాంటి గోవధకు పాల్పడొద్దని సూచించారు. అందరూ కలిసి స్నేహపూర్వకంగా బక్రీద్ ను జరుపుకోవాలని ఆకాంక్షించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించవద్దని ఎస్సై టి.వివేక్​ కోరారు.

Read More
శాంతియుతంగా బక్రీద్​

బక్రీద్​ శాంతియుతంగా జరుపుకోండి

సారథి న్యూస్, బెజ్జంకి: ముస్లిం సోదరులు బక్రీద్​ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని చేర్యాల సీఐ శ్రీనివాసరెడ్డి సూచించారు. బుధవారం ఆయన కరీంనగర్​ జిల్లా చేర్యాలలో ముస్లిం మత పెద్దలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. గోవులను అక్రమంగా రవాణాచేస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందుకోసం ప్రత్యేకంగా చెక్​పోస్టులు ఏర్పాటుచేశామన్నారు. మత ఘర్షణలు ప్రేరేపించేలా ఎవరైనా సోషల్​మీడియాలో పోస్టులు పెడితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో చేర్యాల ఎస్సై మోహన్ బాబు, చేర్యాల తాజుమ్ ప్రెసిడెంట్ అబ్దుల్ […]

Read More