అనంత్‌నాగ్ (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని అనంత్నగాగ్ జిల్లా ఖుల్‌చోహార్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఎన్కౌంటర్ స్థలంలో పోలీసులు, ఆర్మీ జవాన్ల గాలింపు కొనసాగుతుందని కశ్మీర్ జోన్ పోలీసులు చెప్పారు. పోలీసులు ఉగ్రవాదుల మృతదేహాలను గుర్తించే పనిలో పడ్డారు. శనివారం చేవా ఉల్లార్ గ్రామంలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. జమ్మూకశ్మీర్ లో ఇటీవల వరుసగా సాగుతున్న ఎదురుకాల్పుల్లో పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల కదలికలు పెరగడంతో జమ్మూకశ్మీర్ పోలీసులు సైనికబలగాలతో కలిసి […]
సారథిన్యూస్, ఖమ్మం: ఇద్దరు పిల్లలతో కలిసి ఓ విలేకరి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యానాంకు చెందిన ముమ్మిడి శ్రీనివాస్(36) ప్రజాశక్తి దినపత్రికలో విలేకరిగా పనిచేస్తున్నాడు. కాగా శనివారం అతడు తన ఇద్దరు పిల్లలతో కలిసి యానాంలోని గోదావరి నదిలోకి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.
సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా(కోవిడ్–19) వైరస్ బారిన పడుతున్న పోలీసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ మరింత అప్రమత్తమైంది. అనారోగ్యంతో బాధపడుతున్న పోలీసు అధికారులు, సిబ్బంది విశ్రాంతి తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు. లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో పోలీసులు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్నారని, తద్వారా కొందరు పోలీసులు వైరస్ బారిన పడ్డారని వెల్లడించారు. డ్యూటీలో ఉన్న పోలీసులు అధికారులు, సిబ్బంది కోవిడ్ అనుమానిత లక్షణాలు ఉంటే వెంటనే సెలవు పెట్టాలని […]
సారథి న్యూస్, మెదక్: సాధారణంగా ఎక్కడైన దొంగలు దొంగతనం చేస్తారు. కానీ విచిత్రంగాఓనర్ లే వైన్స్ కు కన్నం వేసి రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు దొరికారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారంలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గజ్వేల్ రూరల్ సీఐ కోటేశ్వరరావు కథనం ప్రకారం.. కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వం లాక్ డౌన్ సందర్భంగా గౌరారం లోని వైన్స్ కు ఎక్సైజ్ అధికారులు సీల్ వేశారు. కొన్ని రోజులుగా దొంగతనాలు […]