సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన మోడల్ డెయిరీఫామ్ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ కృష్ణఆదిత్య అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. ములుగు మండలంలోని పేదలను గుర్తించి వారికి గేదెలను పంపిణీచేయాలని సూచించారు. ఇందుకోసం ఎస్సీ కార్పొరేషన్, జిల్లా పశుసంవర్థక అధికారి, జిల్లా ప్రణాళికాధికారితో కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. సమీక్షలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తుల రవి, జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి కే […]
సారథి న్యూస్, కోడిమ్యాల : అర్హులైన పేద ప్రజలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తామని చొప్పదండి ఎమ్మెల్యే సంకె రవిశంకర్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా కొడిమ్యాల మండలం లోని చెప్యాల గ్రామాలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్లాడుతూ.. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు.
సారథి న్యూస్, మహబూబ్ నగర్: కరోనా వేళ పేదలను ఆదుకోకుండా కార్పొరేట్ కంపెనీలకు రుణాలు మాఫీచేయడం ఏమిటని సీపీఐ మహబూబ్ నగర్ జిల్లా కార్యదర్శి పరమేష్ గౌడ్ విమర్శించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీసులో విలేకరులతో మాట్లాడారు.అంతకుముందు మే డే వేడుకల్లో పాల్గొన్నారు. జర్నలిస్టులకు రూ.15వేలు ఇవ్వాలని, పేదలకు నేరుగా రూ.1500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మకాం రామ్మోహన్, బాలకిషన్, విల్సన్, హన్మంత్ రెడ్డి పాల్గొన్నారు.