Breaking News

పంపిణీ

ఆదివాసీలకు అండగా ఉంటాం

సారథి న్యూస్​, ఖమ్మం: ఆదివాసీలకు ఎల్లప్పుడూ అండగా ఉండి, వారి హక్కులను పరిరక్షిస్తామని భారత మానవహక్కుల మండలి తెలంగాణ రాష్ట్ర చైర్మన్​ మద్దిశెట్టి సామేలు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం చెరుకుపల్లి పంచాయతీ తురకలగూడెం గ్రామంలో గురువారం మానవహక్కుల బృందం పర్యటించింది. ఈ సందర్భంగా గిరిజనలకు మాస్కులు పంపిణీ చేశారు. అనంతరం వారి ఇండ్లను పరిశీలించారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల బాగోగులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో పలువురు గిరిజన సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Read More

కల్యాణ లక్ష్మి పేదలకు వరం

సారథి న్యూస్​, పెద్దశంకరంపేట: సీఎం కేసీఆర్​ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కల్యాణలక్ష్మి పథకం నిరుపేదలకు వరం లాంటిదని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన పెద్దశంకరంపేట మండలం బుజరంపల్లి, గోపని వెంకటాపూర్​, టెంకటి గ్రామాలకు చెందిన 15 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ పేదప్రజల పక్షానే ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో పలువురు టీఆర్​ఎస్​ కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More

సీఎంఆర్​ఎఫ్​ పేదలకు అండ

సారథిన్యూస్​, రామడుగు/ బోయినపల్లి: ముఖ్యమంత్రి సహాయనిధి పేదప్రజలకు ఎంతో అండగా నిలుస్తున్నదని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ పేర్కొన్నారు. మంగళవారం ఆయన కరీంనగర్​ జిల్లా చొప్పదండిలోని ఎమ్మెల్యే క్యాంప్​ కార్యాలయంలో 15 మంది లబ్ధిదారులకు సీఎంఆర్​ఎఫ్​ కింద మంజూరైన రూ. 8లక్షల చెక్కులను పంపిణీ చేశారు. కార్యాక్రమంలో బాధితులు, ఆయాగ్రామాల సర్పంచుల్​, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

Read More
సీఎం రిలీఫ్​ఫండ్​ చెక్కుల పంపిణీ

సీఎం రిలీఫ్​ఫండ్​ చెక్కుల పంపిణీ

సారథిన్యూస్, చిన్నశంకరంపేట: మెదక్​ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని పలు గ్రామాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు సోమవారం టీఆర్​ఎస్​ పార్టీ మండల అధ్యక్షుడు పట్లోరి రాజు సీఎం రిలీఫ్​ఫండ్​ చెక్కులను పంపిణీ చేశారు. 32 మంది లబ్ధిదారులకు రూ. 8 లక్షల 45 వేల చెక్కులను అందజేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు.. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పలు గ్రామాలకు చెందిన సర్పంచులు, నాయకులు రమేశ్​గౌడ్, బండారు స్వామి తదితరులు పాల్గొన్నారు.

Read More

సరుకులు పంపిణీ

సారథి న్యూస్, మహబూబ్​ నగర్​ : మహబూబ్ నగర్ రూరల్ మండలం కోటకదిర గ్రామ పంచాయతీ సర్పంచ్ మల్లు రమ్య దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం రేషన్ కార్డు లేని వారికి బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల రైతుబంధు అధ్యక్షుడు మల్లు దేవేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ మునీర్, మండల కో ఆప్షన్ ఎం.డి మస్తాన్, మాజీ ఎంపిటిసి నరసింహులు, పంచాయతీ సెక్రటరీ మాధవి, టిఆర్ఎస్ కార్యకర్తలు రాములు, శేఖర్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

Read More