Breaking News

నోముల

రౌడీషీట్లు ఎత్తివేయాలి హోంమంత్రిని కలిసిన ఎమ్మెల్యే

రౌడీషీట్లు ఎత్తివేయాలి హోంమంత్రిని కలిసిన ఎమ్మెల్యే

సామాజిక సారథి, హలియా: ఉద్యమకారులపై రౌడీషీట్లను ఎత్తివేయాలని ఎమ్మెల్యే నోముల భగత్ హోంమంత్రి మహమూద్ అలీకి వినతిపత్రం సమర్పించారు. హైదరాబాద్ మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి  ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులపై పోలీసులు పెట్టిన రౌడీషీట్లను ఎత్తివేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి కలిసి వినతిపత్రం అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందిస్తూ రౌడీషీట్లు ఎత్తివేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని భగత్ తెలిపారు. హోంమంత్రికి వినతి పత్రం సమర్పించేందుకు పలువురు ఉద్యమకారులు అభినందనలు తెలియజేశారు.

Read More
చట్టవిరుద్దంగా వ్యహరించొద్దు

చట్టవిరుద్దంగా వ్యహరించొద్దు

దళితుడిని అక్రమ నిర్భందిస్తారా..? పోలీసుల తీరుపై ఎమ్మెల్యే భగత్ ధ్వజం సామాజిక సారథి, హాలియా:  పోలీసులు చట్ట ప్రకారం వ్యవహరించాలే కానీ, అందుకు విరుద్ధంగా వ్యవహరించి దళితులకు అన్యాయం చేస్తే సహించేది లేదని దళితుల వెంటే తెలంగాణ ప్రభుత్వం ఉందని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి సాగర్ నియోజకవర్గంలో పలు శుభకార్యాలలో పాల్గొనేందుకు  వస్తుండడంతో హాలియా పోలీస్ స్టేషన్ ఎదుట దళితులు ధర్నా చేస్తుండగా, ఎమ్మెల్యే కారు ఆపి నిడమానూరు మండల పరిధిలోని […]

Read More
సామాజిక దార్శనికుడు మహాత్మా పూలే

సామాజిక దార్శనికుడు మహాత్మా పూలే

 సామాజిక సారథి,హాలియా: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన సామాజిక దార్శనికుడు మ‌హాత్మా జ్యోతిరావు పూలే ఎమ్మెల్యే నోముల భగత్  అన్నారు. పూలే 131వ వర్థంతి సందర్భంగా హాలియాలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆదివారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా నోముల భగత్ మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త, మానవాతావాది అని కొనియాడారు. కార్యక్రమంలో అనుముల మండల అధ్యక్షుడు […]

Read More
విగ్రహావిష్కరణకు కేటీఆర్ ఆహ్వానం

విగ్రహావిష్కరణకు కేటీఆర్ ఆహ్వానం

సామాజిక సారథి, హలియా: దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ప్రథమ వర్ధంతి సందర్భంగా విగ్రహావిష్కరణ  కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేయాలని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ శుక్రవారం హైదరాబాధ్ కార్యాలయం లో మర్యాదపూర్వకంగా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ కలిసి డిసెంబర్ 01  ప్రథమ వర్ధంతి, గుండెబోయిన రామ్మూర్తి యాదవ్, నోముల నర్సింహయ్య యాదవ్ ల విగ్రహావిష్కరణ  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని ఆయన కోరారు.

Read More
విదేశాల్లో నోములకు ఘననివాళి

విదేశాల్లో నోములకు ఘననివాళి

సామాజిక సారథి, హాలియా: విదేశాలలో నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కు ఘన నివాళులర్పించారు. శుక్రవారం ఖతర్ దేశంలోని దోహా నగరంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అబ్బగౌని శ్రీధర్ అధ్యక్షతన దివంగత నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య  చిత్రపటానికి పూలమాలవేసి, నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఖతార్ కార్యవర్గ సభ్యులు సుందరగిరి శంకర్, తాళ్ల పెళ్లి ఎల్లయ్య,కుంబాజి సాయి తేజ, మాసం రాజిరెడ్డి,శంకరాచారి, ప్రవీణ్,నర్సయ్య,భాస్కర్ గౌడ్, ఎండి సుభాని తదితరులు పాల్గొన్నారు.

Read More
ఆపత్కాలబంధు సీఎం సహాయనిధి

ఆపత్కాలబంధు సీఎం సహాయనిధి

సామాజిక సారథి, హాలియా: సీఎం సహాయనిధి ఆపత్కాలబంధు అని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. హాలియాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిడమానూరు మండలానికి చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపద సమయంలో వైద్య ఖర్చులకు, పేద ప్రజల ఆరోగ్యం కోసం సీఎం సహాయనిధి బాధిత కుటుంబాలకు ఆసరాగా ఆదుకుంటుందని చెప్పారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తాటి సత్యపాల్, మార్కెట్ చైర్మన్ కామెర్ల జానయ్య, సర్పంచ్ […]

Read More