సారథి, నర్సాపూర్: మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన సీఎం కేసీఆర్ కే దక్కిందని, ఆయన మాటలు ఎవరూ నమ్మరని మెదక్‌జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ బీజేపీ నాయకులు సింగయపల్లి గోపి, గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లేష్ గౌడ్ పేర్కొన్నారు. గురువారం బీజేవైఎం నర్సాపూర్ అసెంబ్లీ కన్వీనర్ వాల్దాస్ మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీచేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ […]
సారథి న్యూస్, నర్సాపూర్: జన్మనిచ్చిన పాపానికి ఓ తల్లిపాలిట కన్నకొడుకే కాలయముడిగా మారాడు. కన్నతల్లి అని కూడా చూడకుండా గొడ్డలితో అతిదారుణంగా హతమార్చాడు. ఈ హృదయ విదారకర సంఘటన బుధవారం మెదక్‌జిల్లా హత్నూర పోలీస్ స్టేషన్ పరిధిలోని షేర్ ఖాన్ పల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. షేర్ ఖాన్ పల్లి గ్రామానికి చెందిన కోటగళ్ల నర్సమ్మ(65)కు నలుగురు కొడుకులు ఉన్నారు. చిన్నకొడుకు నర్సింలు అలియాస్ నర్సింగరావు కొంతకాలంగా హైదరాబాద్‌లో ఉంటూ అప్పుడప్పుడు […]
సారథి న్యూస్, నర్సాపూర్: మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ని చిల్డ్రన్ పార్కు లో కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయడంపై ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. కబ్జాచేసేందుకు కుట్రపన్నుతున్నారని ఆక్షేపించారు. శుక్రవారం నర్సాపూర్ ఎంపీడీవో ఆఫీసులో ఎంపీపీ జ్యోతిసురేష్ నాయక్ అధ్యక్షతన జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. టీపీసీసీ అధికార ప్రతినిధి రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ.. నర్సాపూర్ చెరువులో పెద్దఎత్తున ఇసుకను తవ్వుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. పేదలు ఇంటి బాత్రూమ్ను కట్టుకోవడానికి ట్రాక్టర్ […]
సారథి న్యూస్ నర్సాపూర్: మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాజీపేటలో వృద్ధులకు మాస్కులను పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో వృద్ధులకు మాస్కులు పంపిణీ చేస్తున్నట్టు సర్పంచ్ లింగంగౌడ్ తెలిపారు. అనంతరం సర్పంచ్ గ్రామంలో తడి, పొడి చెత్తబుట్టలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది రేణుక, సర్పంచ్ లింగంగౌడ్, ఉపసర్పంచ్ మాధవి తదితరులు పాల్గొన్నారు.
నర్సాపూర్ పార్క్‌ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ సారథి న్యూస్, మెదక్: గెజిబోలు, వాచ్ టవర్‌లు, వాకింగ్, సైకిల్ ట్రాక్‌లు, ట్రెక్కింగ్ సౌకర్యాలు… ఇవన్నీ ఎక్కడో మెయిన్ సిటీలో ఉండే పెద్ద పెద్ద పార్కులు, రిసార్ట్స్‌లో ఉండే సౌకర్యాలు అనుకుంటున్నారు కదూ! నిజమే కానీ అది ఇదివరకటి మాట. ఇప్పుడు జిల్లాలో సైతం ఇలాంటి పార్కులు అందుబాటులోకి వస్తున్నాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ ఫారెస్ట్‌లో అన్ని హంగులతో అర్బన్ పార్క్ రెడీ అయింది..కాలానుగుణంగా ప్రజల జీవనశైలి మారుతోంది. తీరిక […]
సారథి న్యూస్, నర్సాపూర్: రక్తదానం ప్రాణదానంతో సమానమని మెదక్ డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. కౌడిపల్లి మండలం సదాశివపల్లి గ్రామానికి చెందిన 13 మంది యువకులు కౌడిపల్లి పీహెచ్‌లో గురువారం రక్తదానం చేశారు. యువకులు ముందుకొచ్చి రక్తదానం చేయడం గొప్ప విషయమన్నారు. చాలా మంది గర్భిణులు రక్తం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ వో విజయనిర్మల, పీహెచ్సీ డాక్టర్ వెంకటస్వామి, శోభన, సర్పంచ్‌లు వెంకటేశ్వర్ రెడ్డి, శోభ నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.