న్యూఢిల్లీ: సమయం వచ్చినప్పుడల్లా టెస్ట్ క్రికెట్‌పై తన అభిమతాన్ని చాటే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన మనసులోని మాటను మరోసారి బయటపెట్టాడు. టెస్టులకు ఉండే విలువ ఏ ఫార్మాట్‌కు ఉండదని స్పష్టం చేశాడు. ‘మెరిసే తెల్లని దుస్తులతో ఎర్రబంతితో క్రికెట్ ఆడడం నా అదృష్టం. ముఖ్యంగా ఈ ఫార్మాట్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించడం మరింత గర్వపడే అంశం. దీని దరిదాపుల్లోకి ఏదీ రాదు. టెస్ట్ క్రికెటే నిజమైన ఆట. అందుకే ఈ ఫార్మాట్‌కు మరింత ప్రాచుర్యం […]
న్యూఢిల్లీ: లాక్డౌన్ తర్వాత టీమిండియా క్రికెటర్లు ఒక్కొక్కరుగా ప్రాక్టీస్‌లోకి దిగుతున్నారు. తాజాగా మిడిలార్డర్ బాట్స్మన్ చతేశ్వర్ పుజారా.. ఔట్ డోర్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. తన సొంత ఊరిలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసుకున్నాడు. ‘మళ్లీ బ్యాట్ పట్టా. సుదీర్ఘంగా విరామం వచ్చినా.. స్టాన్స్ తీసుకుంటుంటే నిన్నటి రోజులాగానే అనిపిస్తోంది’ అని పుజారా వ్యాఖ్యానించాడు.
న్యూఢిల్లీ: ఇప్పుడున్న భారత్ జట్టు ఇలా తయారు కావడానికి బీజాలు నాటింది మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీయేనని ఇంగ్లండ్ మాజీ సారథి నాసర్ హుస్సేన్ అన్నాడు. దాదా హయాంలోనే భారత క్రికెట్లో విప్లవం మొదలైందన్నాడు. కాలక్రమంలో ఆ విప్లవమే.. భారత్‌ను క్రికెటింగ్ పవర్ హౌస్‌గా మార్చేసిందన్నాడు. ‘భారత జట్టులో భావోద్వేగాలను, ఉద్రేకాలను తీసుకొచ్చిన వ్యక్తి గంగూలీ. సారథిగా, ప్లేయర్గా, సహచరుడిగా క్రికెటర్లకు అండగా నిలిచాడు. తిరుగులేని భారత్ జట్టును రూపొందించడానికి ఆనాడే బీజాలు నాటాడు. అవి ఇప్పుడు […]
ముంబై: పరిమిత ఓవర్ల క్రికెట్లో కేఎల్ రాహుల్ నిలకడగా ఆడుతున్నా.. టెస్ట్ మ్యాచ్‌ల్లో మాత్రం ఐదో స్థానం అజింక్యా రహానేదేనని మాజీ ఆటడాడు సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు. కెరీర్ ఆరంభంలో రహానే కాస్త వెనబడినా.. ఇప్పుడు మాత్రం టీమిండియాను గెలిపించే సత్తా ఉందన్నాడు. ‘రహానే స్థానాన్ని భర్తీ చేయాలంటే ముందుగా రాహుల్ దేశవాళీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో టన్నులకొద్ది పరుగులు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆడుతున్న ఆట ఎంతమాత్రం ప్రామాణికం కాదు. టెస్ట్‌లో రహానే ఆలస్యంగా […]
న్యూఢిల్లీ: ఫామ్ లేకపోవడం, సరైన బ్యాటింగ్ స్థానం దొరకపోవడంతో 2007లోనే దిగ్గజ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ కెరీర్ గుడ్ బై చెప్పాలనుకున్నాడని టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ వెల్లడించాడు. అప్పటికే తీవ్ర అసంతృప్తిలో ఉన్న మాస్టర్‌కు వన్డే ప్రపంచకప్ నుంచి భారత్ లీగ్ దశ నుంచి నిష్ర్కమించడం మరింత భారంగా మారిందన్నాడు. ‘నేను బాధ్యతలు చేపట్టేనాటికి భారత జట్టులో పరిస్థితులు బాగాలేవు. వాటిని అధిగమించడానికి కాస్త సమయం పట్టింది. కానీ అప్పటికే ప్రయోగాల వల్ల ఆటగాళ్లంతా […]
న్యూఢిల్లీ: బ్యాట్స్‌మెన్‌గా ఎంతో ఎత్తుకు ఎదిగిన విరాట్ కోహ్లీ.. టీమిండియా కెప్టెన్‌గా సాధించింది ఏమీ లేదని మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ విమర్శించాడు. కెరీర్లో సారథిగా చాలా సాధించాల్సి ఉందన్నాడు. అతిముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో సత్తా చాటితేనే.. గొప్ప కెప్టెన్ల జాబితాలో చోటు దక్కుతుందన్నాడు. చూడటానికి టీమిండియా బలంగా కనిపిస్తున్నా.. అధిగమించాల్సిన బలహీనతలు కూడా ఉన్నాయన్నాడు. ‘జట్టులోని ఆటగాళ్ల బలాలు, బలహీనతలను గుర్తించి ప్రోత్సహించాలి. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలే మెగా ఈవెంట్లలో రాణించడానికి […]
న్యూఢిల్లీ: సిరీస్‌కు ముందు జరిపే కరోనా పరీక్షల్లో నెగెటివ్ వస్తే.. వాళ్లు ఉమ్మిని ఉపయోగించేందుకు అవకాశం ఇవ్వాలని టీమిండియా మాజీ పేసర్ అజిత్ అగర్కార్ కోరాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉమ్మిపై నిషేధం మంచిదే అయినా.. రాబోయే రోజుల్లో బౌలర్లు బాగా ఇబ్బందిపడాల్సి వస్తుందన్నాడు. ‘బ్యాట్స్‌మెన్‌కు బ్యాట్ ఎంత ముఖ్యమో.. బౌలర్లకు ఉమ్మి కూడా అంతే. మ్యాచ్‌కు ముందే ప్లేయర్లకు కరోనా టెస్టులు నిర్వహిస్తారు. అందులో నెగెటివ్ వస్తే వాళ్లు సురక్షితమేనని భావిస్తారు. అలాంటి వాళ్లకు ఉమ్మిని ఉపయోగించే […]
న్యూఢిల్లీ: భారత జట్టుకు కోచ్‌గా ఎంపికవడానికి తనకు ఏడు నిమిషాల సమయం పట్టిందని దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మెన్ గ్యారీ కిర్‌స్టెన్ వెల్లడించాడు. తనకు ఆసక్తి లేకపోయినా.. కనీసం దరఖాస్తు చేయకపోయినా ఆ పదవి తనకు దక్కిందన్నాడు. దీనికంతటికి కారణం అప్పటి సెలెక్షన్ కమిటీ మెంబర్, దిగ్గజ బ్యాట్స్‌మెన్ సునీల్ గవాస్కర్ అని స్పష్టం చేశాడు. ‘2007లో గ్రెగ్ చాపెల్ వారసుడి కోసం బీసీసీఐ అన్వేషిస్తోంది. ఆ సమయంలోనే నాకు టీమిండియాకు కోచింగ్ ఇచ్చే ఆసక్తి ఉందా? సన్నీ […]