Breaking News

జూరాల

శ్రీశైలం 10 గేట్ల ఎత్తివేత

శ్రీశైలం 10 గేట్ల ఎత్తివేత

శ్రీశైలం: జూరాల రిజర్వాయర్​ నుంచి వరద ప్రవాహం పెరగడంతో శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. డ్యాం నిండుకుండలా మారడంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గురువారం 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్‌ఫ్లో 2,22,221 క్యూసెక్కులు ఉంది. ఔట్‌ఫ్లో 3,50,422 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 885 అడుగుల మేర ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ […]

Read More
శ్రీశైలం ఆరుగేట్ల ఎత్తివేత

శ్రీశైలం ఆరుగేట్ల ఎత్తివేత

సారథి న్యూస్, కర్నూలు, మానవపాడు(జోగుళాంబ గద్వాల): శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుకోవడంతో నీటిని విడుదల చేస్తున్నారు. ఒకేసారి 13లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అలాగే ఎగువ ఉన్న జూరాల ప్రాజెక్టు నుంచి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం 17గేట్లను ఎత్తివేశారు. 1,51,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. ఔట్ ఫ్లో 1,59,542 క్యూసెక్కులుగా నమోదైంది. నీటి ప్రవాహంతో బీచుపల్లి పుణ్యక్షేత్రం వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ఆహ్లాద వాతావరణాన్ని పంచుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు […]

Read More
జూరాల 4గేట్ల ఎత్తివేత

జూరాల 4గేట్ల ఎత్తివేత

సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): జోగుళాంబ గద్వాల జిల్లాలోని భారీ నీటిపారుదల ప్రాజెక్టు జూరాలకు నిలకడగా వరద కొనసాగుతోంది. ప్రస్తుతం నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాలలో ప్రస్తుతం 9.657 టీఎంసీల నీటిమట్టం ఉంది. ప్రస్తుతం జూరాలకు 63,000 క్యూసెక్కుల ఇన్​ఫ్లో కొనసాగుతోంది. ఇలా ప్రాజెక్టు నుంచి మొత్తం 60,856 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. నాలుగుగేట్ల ద్వారా 22,900 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తికి 35,974 క్యూసెక్కుల […]

Read More
నాగార్జునసాగర్​4 గేట్ల ఎత్తివేత

నాగార్జునసాగర్ ​4 గేట్ల ఎత్తివేత

నాగార్జునసాగర్: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వరద ఉధృతి కొనసాగుతుండడంతో శుక్రవారం మధ్యాహ్నం నాగార్జునసాగర్‌ 4 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి 3.45 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల కొనసాగుతోంది. నాగార్జునసాగర్​ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను 585 అడుగుల మేర ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ 312.04 టీఎంసీలకు గాను ప్రస్తుతం 271.37 టీఎంసీల నిల్వ ఉంది.

Read More
నిండిన నాగార్జున సాగరం

నిండిన నాగార్జున సాగరం

575 అడుగులకు చేరిన నీటిమట్టం నేడు సాగర్​ గేట్లు ఎత్తివేసే అవకాశం నాగార్జునసాగర్: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం నుంచి వరద ఉధృతి పెరగడంతో నాగార్జునసాగర్‌ తొణికిసలాడుతోంది. శ్రీశైలం జలాశయం 10గేట్లు ఎత్తివేసి దిగువకు 3.45 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గురువారం సాయంత్రం నాగార్జునసాగర్​ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను 575.70 అడుగుల వద్ద ఉంది. 585 అడుగులకు చేరితే గేట్లు ఎత్తే అవకాశాలు ఉన్నాయి. సాగర్‌ […]

Read More
శ్రీశైలం వద్ద కృష్ణవేణి పరవళ్లు

శ్రీశైలం వద్ద కృష్ణవేణి పరవళ్లు

సారథి న్యూస్, కర్నూలు: భారీవరద రావడంతో శ్రీశైలం రిజర్వాయర్​ జలకళను సంతరించుకుంది. అధికారులు గురువారం ఐదుగేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 885 అడుగులకు గాను 880 అడుగుల మేర నీటినిల్వ ఉంది. రిజర్వాయర్​ సామర్థ్యం 215. 807 టీఎంసీలు కాగా, 196 టీఎంసీల నీటినిల్వ ఉంది. జూరాల, సుంకేసుల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది.

Read More
శ్రీశైలం మూడుగేట్ల ఎత్తివేత

శ్రీశైలం మూడుగేట్ల ఎత్తివేత

సారథి న్యూస్, కర్నూలు: ఎగువ నుంచి భారీవరద రావడంతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. బుధవారం సాయంత్రం 195.7599 టీఎంసీల నీటి సామర్థ్యం చేరుకోవడంతో దిగువకు విడుదల చేశారు. రిజర్వాయర్​ సామర్థ్యం 215. 807 టీఎంసీలు. 885 అడుగులకు గాను 881 అడుగుల మేర నీటినిల్వ ఉంది. జూరాల రిజర్వాయర్, సుంకేసుల బ్యారేజీ నుంచి మొత్తం శ్రీశైలానికి 3.63 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చిచేరుతోంది. సాయంత్రం ఆరు గంటలకు శిల్పాచక్రపాణి రెడ్డి శ్రీశైలం ప్రాజెక్టు మూడుగేట్లను ఎత్తి […]

Read More
కోయిల్ సాగర్​లో 31 ఫీట్ల నీటిమట్టం

కోయిల్ సాగర్​లో 31 ఫీట్ల నీటిమట్టం

సారథి న్యూస్, దేవరకద్ర: మహబూబ్​నగర్ జిల్లాలోని భారీ నీటిపారుదల ప్రాజెక్టు కోయిల్ సాగర్ కు శనివారం పెద్దఎత్తున వరద నీరు వచ్చిచేరింది. ప్రాజెక్టు మొత్తం నీటినిల్వ సామర్థ్యం 32.5 ఫీట్లు. అయితే ప్రాజెక్టులో 31 ఫీట్లకు నీటి నిల్వ చేరింది. దీంతో ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. జూరాల నుంచి కోయిల్ సాగర్ కు ఒక మోటారు ద్వారా కృష్ణాజలాలను తరలిస్తున్నారు. అలాగే ఎగువ ప్రాంతాల్లో భారీవర్షాలు కురవడంతో కోయిలకొండ, అంకిళ్ల వాగుల నుంచి పెద్దఎత్తున వర్షపునీరు ప్రాజెక్టులోకి […]

Read More