ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు సామాజిక సారథి, సిద్దిపేట: విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం (ట్రస్మా) రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ, విద్యార్థులకు విద్యనందిస్తున్నాయన్నారు. సంక్రాంతి పండుగ సెలవుల పేరుతో పాఠశాలకు ప్రభుత్వం ముందుగానే సెలవులు ప్రకటించిందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా […]
ములుగులో సీతక్క నిరసన సామాజిక సారథి, ములుగు: స్థానికత కోసమే పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగులతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. తక్షణమే 317 జీవోను రద్దు చేయాలని డిమాండ్‌చేస్తూ గురువారం ఆమె ములుగు జిల్లా కేంద్రంలో రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలతో చర్చించి అందరికీ ఆమోద యోగ్యమైన బదిలీలను చేపట్టాలని, స్థానికత ఆధారంగా ఉద్యోగుల బదిలీలలో ప్రాధాన్యత కల్పించాలని ఆమె ప్రభుత్వాన్ని […]
ఉద్యోగులతో చర్చించాకే నిర్ణయించాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సామాజికసారథి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ అనాలోచిత.. అర్ధరాత్రి నిర్ణయాలతో ఉద్యోగులు, టీచర్లు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రభుత్వం వెంటనే జీవోనం.317ను నిలిపివేసి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యపై సీఎం స్పందించకుంటే వదిలిపెట్టే ప్రసక్తేలేదని హెచ్చరించారు. ఉద్యోగుల బదిలీల విషయంలో తాము ఎలాంటి రాజకీయం చేయడం లేదని, స్థానికత, సీనియారిటీ ఆధారంగానే బదిలీలు చేయమని కోరుతున్నామని చెప్పారు. […]
ప్రజల ప్రాణాలు పోతుంటే ఏం సాధించారు తిరుగుబాటును అరికట్టడానికి వేరే విధానాలు ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల న్యూఢిల్లీ: ఈశాన్య భారతంలో సైన్యానికి ప్రత్యేక అధికారాలను కట్టబెట్టే సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని(ఏఎఫ్‌ఎస్‌పీఏ) రద్దు చేయాలని ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల కోరారు. ఇదే అంశంపై ఆమె 16 ఏళ్ల పాటు సుదీర్ఘ నిరాహార దీక్ష చేపట్టారు. తాజాగా నాగాలాండ్‌లో సాధారణ పౌరులపై పోలీసుల కాల్పుల నేపథ్యంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనతోనైనా […]