కనీసం గుజరాత్ నేతల మాటలనైనా వినండి కేంద్రానికి మంత్రి కేటీఆర్వినతి సామాజికసారథి, హైదరాబాద్: చేనేతపై జీఎస్టీ పెంపును మంత్రి కె.తారక రామారావు మరోసారి తనదైనశైలిలో స్పందించారు. ఇది వస్త్ర పరిశ్రమకు మరణశాసనమే అవుతుందని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు విజ్ఞప్తి చేస్తూ ట్వీట్ చేశారు. చేనేతపై జీఎస్టీ విషయంలో తమ విన్నపాన్ని పట్టించుకోకపోయినా కనీసం గుజరాత్ వాణి అయినా వినాలని పీయూష్ గోయల్‌ను కోరారు. కేంద్ర టెక్స్‌టైల్ శాఖ సహాయ మంత్రి దర్శనాజర్దోష్‌తో పాటు గుజరాత్ […]
సారథి న్యూస్, హైదరాబాద్: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఇద్దరు చేనేత కార్మికులకు పరిశ్రమల శాఖ కె.తారక రామారావు అవార్డులను ప్రదానం చేశారు. 18 మందిని ఎంపికచేయగా, మిగతా 16 మందికి ఆయా జిల్లాల కలెక్టర్ల చేత అందజేశారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి వర్చువల్ గా, ఆన్లైన్ లో వీక్షించి అవార్డు గ్రహితలతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చేనేత కార్మికుల కోరిక మేరకు నేతన్నకు చేయూత పథకాన్ని కొనసాగించేందుకు ప్రతిపాదనలు పంపించాలని అధికారులను ఆదేశించారు. […]
ఉపాధి కోసం కూలి పనులకు వెళ్తున్న కార్మికులు చేతులు మొద్దు బారి నేత పని చేయలేకపోతున్నామని ఆవేదన ప్రభుత్వమే గిట్టుబాటు ధరలు కల్పించాలని వేడుకోలు సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని రాజోలి గ్రామం పేరు చెబితేనే చేనేత గుర్తుకొస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో నేత పనికి గుర్తింపు తెచ్చిన వాటిలో ఈ గ్రామం కూడా ఒకటి. అలాంటి ఊరులో చేనేత వృత్తే కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వృత్తినే నమ్ముకుని కొన్నేళ్లుగా జీవనం […]
సారథి న్యూస్, మహబూబ్ నగర్: చేనేత కార్మికులను ప్రోత్సహించేందుకు, ఆ వృత్తిదారులను ఆదుకునేందుకు ప్రజాప్రతినిధులు ప్రతి సోమవారం చేనేత వస్త్రాలను ధరించాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఎక్సైజ్‌శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ సోమవారం చేనేత వస్త్రాలు ధరించారు. సాధారణంగా తెల్లటి వస్త్రధారణలో కనిపించే మంత్రి ఇలా కొత్త గెటప్‌లో కనిపించారు. తెలంగాణ రాష్ట్రంలో కులవృత్తులకు ఎంతో ప్రాధాన్యం ఇస్తూ ప్రోత్సహిస్తున్నామని మంత్రి తెలిపారు.
సారథి న్యూస్, ఎల్బీ నగర్: సీఎం కేసీఆర్ చేనేత కార్మికులకు ప్రత్యేక పథకాలు అమలుచేస్తున్నట్లు ప్రకటించడం సంతోషకరంగా ఉందని చేనేతకార్మిక సంఘం ఎల్బీ నగర్ అధ్యక్షుడు చెర్కుస్వామి నేత అన్నారు. శనివారం ఎల్బీ నగర్లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈనెల 19న ‘చేనేతకు చేయూత’పథకంతో చేనేతలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రత్యేకంగా జీవోను తీసుకురావడం సంతోషకరంగా ఉందన్నారు. దీంతో చేనేతల ఒక్కో కుటుంబానికి దాదాపు రూ.60వేల నుంచి రూ.లక్ష వరకు లబ్ధిపొందేలా రూపొందించారని […]
కరోనాతో చేనేత, జౌళి పరిశ్రమ విలవిల గోదాముల్లో రూ.400 కోట్ల విలువైన వస్త్రాలు పెట్టుబడుల్లేక చేతులెత్తేస్తున్న మాస్టర్ వీవర్స్ సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా ప్రభావంతో రాష్ట్రంలోని చేనేత, జౌళి పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఆయా రంగాల మీద ఆధారపడి పనిచేస్తున్న రెండున్నర లక్షల మంది కార్మికులు ఇప్పుడు రోడ్డునపడినట్లయింది. సాధారణంగా ఈ సీజన్‌లో పెండ్లిండ్లు, ఇతర శుభకార్యాలు ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా చేనేత, మరమగ్గాల కార్మికులకు చేతినిండా పని ఉంటుంది. కానీ కరోనా దెబ్బకు […]