Breaking News

చెక్కులు

ప్రజాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

ప్రజాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

సారథి, సిద్దిపేట ప్రతినిధి, హుస్నాబాద్: ప్రజాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం హుస్నాబాద్ పట్టణంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ పేద, మధ్యతరగతి కుటుంబాలకు చేయుతనిచ్చేందుకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. పెళ్లీడుకొచ్చిన పిల్లలకి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా ఆ కుటుంబానికి రూ.1లక్ష అందించడమే కాకుండా ఆ కుటుంబానికి అండగుంటున్న ప్రజానాయకుడు కేసీఆర్ అన్నారు. […]

Read More

తెలంగాణ పథకాలు.. దేశానికే ఆదర్శం

సారథి న్యూస్, రామాయంపేట: తెలంగాణ రాష్ట్రంలో పేదల ప్రభుత్వం కొనసాగుతున్నదని మెదక్​ ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. మంగళవారం మెదక్​ జిల్లా నిజాంపేట, రామాయంపేట మండలాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే కల్యణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు టీఆర్​ఎస్​ నేతలు పాల్గొన్నారు.

Read More

సంక్షేమంలో మనమే టాప్​

సారథి న్యూస్​, దేవరకద్ర: పేద ప్రజలకు సంక్షేమపథకాలను అమలుచేయడంలో తెలంగాణ రాష్ట్రం.. దేశంలోనే అగ్రగామిగా ఉన్నదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్​రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన కొత్తకోటలో గ్రీన్​ ఆగ్రో స్టోర్​ను ప్రారంభించారు. అనంతరం భూత్పూరు మండలం అన్నసాగర్​, మూసాపేట మండలకేంద్రంలో పలువరు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్​ఫండ్​ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు టీఆర్​ఎస్​ నాయకులు పాల్గొన్నారు.

Read More

కల్యాణ లక్ష్మి పేదలకు వరం

సారథి న్యూస్​, పెద్దశంకరంపేట: సీఎం కేసీఆర్​ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కల్యాణలక్ష్మి పథకం నిరుపేదలకు వరం లాంటిదని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన పెద్దశంకరంపేట మండలం బుజరంపల్లి, గోపని వెంకటాపూర్​, టెంకటి గ్రామాలకు చెందిన 15 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ పేదప్రజల పక్షానే ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో పలువురు టీఆర్​ఎస్​ కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More