నగర శివార్లలో అసాంఘిక కార్యకలాపాలపై నిఘా వార్షిక నివేదికను ఆవిష్కరించిన రాచకొండ సీపీ మహేష్ భగవత్ సామాజికసారథి, హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది నాలుగు శాతం నేరాలు పెరిగాయి. అలాగే పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఇచ్చిన ఫిర్యాదులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడంలో కేసుల సంఖ్య పెరిగిందని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ వార్షిక నివేదికను సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేరాలు చేసిన […]
ఎస్పీ రమణ కుమార్ సామాజిక సారథి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కంది చౌరస్తా వద్ద సోమవారం ఉదయం 6గంటలకు లారీలో అక్రమంగా తరలిస్తున్న 600కిలోల ఎండు గంజాయిని స్వాధీన పర్చుకున్నామని జిల్లా ఎస్పీ రమణకుమార్ తెలిపారు. సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ రమణ కుమార్ పూర్తీ వివరాలను వెల్లడించారు. సోమవారం ఉదయం తమకు వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ, టాస్క్ ఫోర్స్ […]
సామాజిక సారథి, హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. కమిషనరేట్ పరిధిలో 1,820 కిలోల గంజాయి పట్టుకున్నట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. దీని విలువ రూ.3 కోట్లకు పైగా ఉంటుందని చెప్పారు. గంజాయి తరలిస్తున్న ఐదుగురు సభ్యుల అంతర్ రాష్ట్ర ముఠాను అరెస్టు చేశారు. గంజాయి రవాణాకు వినియోగించిన పది టైర్ల లారీ, కారును సీజ్ చేశారు. ఆంధప్రదేశ్ లోని విశాఖపట్నం సమీపంలో ఉన్న సీలేరు నుంచి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్నారని […]
సారథి, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో 23 కిలోల గంజాయిని పట్టుకున్నారు. పక్కా సమాచారంతో బిజినేపల్లి ఎస్సై వెంకటేశ్ తన సిబ్బందిపై శనివారం అజిత్బాషా ఇంటిపై దాడులు చేసి స్వాధీనం చేసుకున్నారు. గతకొద్దిరోజులుగా గంజాయికి అలవాటుపడ్డ కొందరు యువకులు విచ్చలవిడిగా తాగుతూ ఎక్కడపడితే అక్కడ పడిపోతున్నారు. ఈ క్రమంలో కొంతకాలంగా వారిపై నిఘా ఉంచి గంజాయిని విక్రయిస్తున్న వారిని పట్టుకున్నామని ఎస్సై తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
సారథిన్యూస్, ఖమ్మం: ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండల కేంద్రంలో పోలీసులు 21 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకుకొని, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. గంజాయి విలువ సుమారు రూ. లక్ష ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.