Breaking News

కోవిడ్

కరోనాతో ఒకేరోజు 10 మంది మృతి

కరోనాతో 10 మంది మృతి

సారథి న్యూస్, హైదరాబాద్​: తెలంగాణలో శనివారం(24 గంటల్లో) 2,278 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 1,54,880కు చేరింది. మహమ్మారి బారినపడి తాజాగా 10 మంది మృతిచెందారు. ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 950కు చేరింది. ఒక్కరోజే 2,458 మంది కోవిడ్‌ రోగులు కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇలా ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,21,925కు చేరింది. రాష్ట్రంలో యాక్టివ్‌ కేసులు 32,005 ఉన్నాయి. దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 77.75 శాతంగా […]

Read More
కరోనా.. బిల్లుల వసూలుపై కేటీఆర్​ఫైర్​

కరోనా.. బిల్లుల వసూలుపై కేటీఆర్​ ఫైర్​

సారథి న్యూస్, హైదరాబాద్: కోవిడ్ రోగాల నుంచి ఫిర్యాదులు ఎదుర్కొంటూ అధిక మొత్తంలో మెడికల్ బిల్లులు వసూలు చేస్తున్న ప్రైవేట్​ఆస్పత్రులపై కఠినచర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్​కు మంత్రి కె.తారక రామారావు కోరారు. ప్రైవేట్​ఆస్పత్రి వల్ల తాను ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులను వివరిస్తూ మహేశ్వరం మండలం దుబ్బచెర్ల గ్రామానికి చెందిన అనురెడ్డి రాదేశ్​అనే యువకుడు గురువారం ట్విట్టర్ ద్వారా మంత్రికి ఫిర్యాదు చేశాడు. ‘కోవిడ్ – 19 కారణంగా నా తండ్రి, తల్లి, సోదరుడిని కోల్పోయాను. […]

Read More

కాంట్రాక్ట్​ కార్మికులను ఆదుకోండి

సారథిన్యూస్​, గోదావరిఖని: సింగరేణి కాంట్రాక్ట్​ కార్మికులను ఆదుకోవాలని సీఐటీయూ నాయకులు డిమాండ్​ చేశారు. కాంట్రాక్ట్​ కార్మికులకు కోవిడ్ క్వారంటైన్ వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ఈ మేరకు సింగరేణి ఎండీకి లేఖ పంపినట్టు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు తిరుపతి, మధు తెలిపారు. సింగరేణిలో కాంట్రాక్ట్​, పర్మినెంట్​ కార్మికులందరినీ కరోనా మహమ్మారి వెంటాడుతున్నదని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పర్మినెంట్​ ఉద్యోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను కాంట్రాక్ట్​ ఉద్యోగులకు కూడా కల్పించాలని డిమాండ్​ చేశారు.

Read More

సర్వేను కంప్లీట్​ చేయండి

సారథి న్యూస్​, వనపర్తి: మహిళా స్వయం సహాయక సంఘాలు సభ్యుల జీవనోపాదుల సర్వేను రెండు రోజుల్లో కంప్లీట్​ చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అధికారులను ఆదేశించారు. గురువారం పలు పథకాలపై సమీక్షించారు. కోవిడ్ రుణాలకు సంబంధించి 5,445 సంఘాలకు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటివరకు 533 సంఘాలకు రూ.3.14 కోట్లు మాత్రమే ఇచ్చామని తెలిపారు. బ్యాంకుల అనుసంధానంతో అమలుచేసే పథకాలను కలెక్టర్ సమీక్షిస్తూ ఈ నెలాఖరు నాటికి రూ.16.8కోట్ల రుణం ఇవ్వాల్సి […]

Read More