సారథి, కొల్లాపూర్: కరోనా కష్టకాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి సామాన్య ప్రజలను పీడిస్తున్నాయని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు డి.శేఖర్ మండిపడ్డారు. బుధవారం కొల్లాపూర్ మండలంలోని కుడికిళ్లలో భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని వినూత్నరీతిలో ఆటోను లాగుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు డి.శేఖర్ మాట్లాడుతూ.. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల వల్ల సామాన్య ప్రజలపై భారం పడుతుందని, వెంటనే తగ్గించాలని […]
సారథి, పెద్దకొత్తపల్లి(కొల్లాపూర్): గ్రామాల్లో కొనసాగుతున్న పల్లె ప్రగతి అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తిచేయాలని ఎంపీడీవో కృష్ణయ్య సూచించారు. బుధవారం స్థానిక ఎంపీడీవో ఆఫీసులో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతుల కల్లాలు, వైకుంఠధామం, పల్లెప్రకృతి వనం, పలు రకాల పనుల పురోగతిపై మాట్లాడారు. వానాకాలంలో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కల్వకోల్, కుడికిళ్లలో సబ్ స్టేషన్ల ప్రారంభం సారథి, కొల్లాపూర్: రాష్ట్రంలో వ్యవసాయానికి లోవోల్టేజీ సమస్య అధిగమించేందుకు అవసరమైన విద్యుత్ సబ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్, కొల్లాపూర్ మండలం కుడికిళ్లలో విద్యుత్ సబ్ స్టేషన్ ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతాంగానికి ఉచిత విద్యుత్ అందిస్తున్న […]
సారథి, కొల్లాపూర్: కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చుక్కయిపల్లి చాకలి మడుగువాగుపై రూ.40లక్షల వ్యయంతో చేపట్టనున్న కల్వర్టు బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి గురువారం భూమిపూజ చేశారు. చాకలిమడుగుపై కల్వర్టు బ్రిడ్జి లేక ప్రజలు, రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బ్రిడ్జి నిర్మించడం ద్వారా చుక్కయిపల్లి ప్రజలు, రైతుల కష్టాలు తీరనున్నాయని, రైతులు తమ పొలాలకు వెళ్లడానికి, ధాన్యాన్ని తరలించడానికి ఇబ్బందులు ఉండవని చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గున్ రెడ్డి నరేందర్ […]
సారథి న్యూస్, కొల్లాపూర్: కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కటికనేని మధుసూదన్ రావుకు అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. బుధవారం అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమయాత్ర కొల్లాపూర్ పట్టణంలో కొనసాగించారు. పట్టణంలోని మినీ స్టేడియంలో ఆయన పార్థివదేహాన్ని ఉంచారు. ప్రజలు వివిధ మండలాలకు చెందిన వివిధ పార్టీల నేతలు, టీడీపీ వర్గీయులు, ఆయన బంధుమిత్రులు, అభిమానులు సందర్శించి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలో అంతిమయాత్ర కొనసాగింది. కొల్లాపూర్ నుంచి తన స్వగ్రామం నార్లపూర్ కు తీసుకువెళ్లి దహన సంస్కారాలు […]
సారథి న్యూస్, నాగర్కర్నూల్: కొల్లాపూర్ వద్ద ఉన్న కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగమైన ఎల్లూర్ లిఫ్ట్ ప్రాజెక్టు పంపులు మునిగిపోవడంతో పరిశీలించేందుకు వెళ్తున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ ఎ.రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ డాక్టర్మల్లురవి, ఏఐసీసీ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ సంపత్ కుమార్ ను నాగర్కర్నూల్జిల్లా తెల్కపల్లి పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ సమయంలో ఎంపీ రేవంత్రెడ్డి కాలికి గాయమైంది.
సారథి న్యూస్, నాగర్కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎల్.శర్మన్ ను కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. బొకే అందజేసి విషెస్చెప్పారు. జిల్లా అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యేను కలెక్టర్ కోరారు.
సారథి న్యూస్, నాగర్ కర్నూల్: కొల్లాపూర్ నియోజకవర్గంలోని మాచినేనిపల్లి శివారులోని ఎండోమెంట్ భూమిని అడిషినల్ కలెక్టర్ హన్మంత్ రెడ్డితో కలిసి స్థానిక ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. నియోజకవర్గంలో విరివిగా విస్తరించి ఉన్న మామిడి పంటలకు స్థానికంగానే మార్కెట్ ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు నూతనంగా మార్కెట్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కొల్లాపూర్ మామిడికి అంతర్జాతీయంగా డిమాండ్ ఉందన్నారు. నూతన మార్కెట్ తో ఇక్కడి రైతుల కష్టాలు తీరనున్నాయని, రైతుల […]