భోపాల్: కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో 10 రోజుల పాటు సంపూర్ణ లాక్డౌన్ విధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయించింది. పరిశ్రమలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాలు, కూరగాయలు, రేషన్ దుకాణాలకు మినహాయింపు ఇచ్చినట్టు హోంమంత్రి నరోత్తం మిశ్రా ప్రకటించారు. ఈ నెల 24 (శుక్రవారం) నుంచి 10 రోజులపాటు లాక్డౌన్ అమల్లో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నది. గడిచిన 24 గంటల్లో 2,56,039 శాంపిల్స్ పరీక్షించగా.. వాటిల్లో 40, 421 పాజిటివ్‌గా తేలాయి. వైరస్ బారిన పడి 681 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,18,043కి చేరుకుంది. మృతుల సంఖ్య 27,497కి పెరిగింది. ఇక దేశ వ్యాప్తంగా 1265 ల్యాబ్స్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు దేశంలో కరోనా పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి ఆరా తీశారు. వివిధ రాష్ట్రాల […]
ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. శనివారం రాత్రి వరకు రాష్ట్రంలో 3,00,937 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 8,348 కొత్త కేసులు గుర్తించినట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 11,596 మంది కరోనాతో మృతిచెందారు. కాగా లక్షా 65 వేల మంది వ్యాధినుంచి కోలుకున్నారు. దేశంలో అత్యధిక కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి.
న్యూఢిల్లీ: గడిచిన రెండు నెలల్లో 200 శాతం సైబర్ ఎటాక్స్ పెరిగాయని పీఎంవో అధికారి గుల్షన్ రాయ్ పేర్కొన్నారు. అయితే చైనా –ఇండియా మధ్య నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అవి పెరిగాయనే దానికి సాక్ష్యాలు లేవని ఆయన అన్నారు. ‘పిషింగ్, రాన్సమ్‌వేర్ ఎక్కువయ్యాయి. జనవరి, ఫిబ్రవరి చివన నుంచి ఈ కేసులు ఎక్కువయ్యాయి. టెన్షన్ పరిస్థితులు దృష్ట్యా పెరగలేదు’ అని ఆయన చెప్పారు. ఆఫీసులు అన్నీ సరైన జాగ్రత్తలు తీసుకోవాలని, పర్సనల్ కంప్యూటర్స్‌లో కూడా అప్లికేషన్లు డౌన్‌లోడ్ […]