Breaking News

కార్తీకమాసం

వెంకన్న సన్నిధి.. కార్తీక శోభితం

వెంకన్న సన్నిధి.. కార్తీక శోభితం

సారథి న్యూస్, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని పాలెం వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తజన సంద్రంగా మారింది. కార్తీక మాసం చివరి శనివారం కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. వెంకటేశ్వరస్వామి, అలివేలు మంగమ్మ అమ్మవారికి సుప్రభాతసేవ, అభిషేకం, ఆరాధన నైవేద్యం, ఇతర పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించినట్లు ఆలయ ప్రధానార్చకుడు రామానుజాచార్యులు తెలిపారు. పక్కనే ఉన్న శివాలయంలో పరమశివుడికి ఏకరుద్రాభిషేకాలు, దీపారాధన నిర్వహించినట్లు వెల్లడించారు. అనంతరం స్వామివారి […]

Read More
పుష్కరాలకు కార్తీక శోభ

పుష్కరాలకు కార్తీక శోభ

సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): తుంగభద్ర పుష్కరాలకు కార్తీక శోభ సంతరించుకుంది. పవిత్ర సోమవారం కావడం, పుష్కరాలు 11వ రోజు కావడంతో పలు ఘాట్లకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు ఉమ్మడి మండల పరిధిలోని పుల్లూరు పుష్కర ఘాట్ కు తాకిడి పెరిగింది. ఇక్కడ వేలసంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా పరిధిలోని ఘాట్లలో నదీస్నానాలకు అనుమతి లేకపోవడంతో అలంపూర్ పుష్కర ఘాట్ కు భక్తులు పెద్దసంఖ్యలో వస్తున్నారు. కొందరు నదిలో […]

Read More
 ఏడుపాయలలో వైభవంగా లక్ష దీపోత్సవం

ఏడుపాయలలో వైభవంగా లక్ష దీపోత్సవం

సారథి న్యూస్, ఏడుపాయల(మెదక్): భక్తుల కొంగుబంగారంగా విలసిల్లిన ఏడుపాయల వన దుర్గాభవాని మాత సన్నిధిలో కార్తీక పౌర్ణమి సందర్భంగా సోమవారం సాయంత్రం లక్షదీపోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముందుగా ఎమ్మెల్యే దుర్గ భవాని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం పల్లకీసేవలో పాల్గొన్నారు. గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి తెప్పోత్సవం నిర్వహించారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని లక్ష దీపోత్సవం కార్యక్రమంలో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొని దీపాలను వెలిగించి […]

Read More
ఆలయాల్లో కార్తీక పౌర్ణమి పూజలు

ఆలయాల్లో కార్తీక పౌర్ణమి సందడి

సారథి న్యూస్, నాగర్​కర్నూల్: జిల్లావ్యాప్తంగా సోమవారం కార్తీకమాస పౌర్ణమి సందర్భంగా భక్తులు పలు ఆలయాల్లో విశేషపూజలు జరిపించారు. వత్రాలు, నోములు ఆచరించారు. దీపారాధన, దీపదానం, ఆకాశ దిపోత్సవం, అర్చనలు, అభిషేకాలు వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నాగర్​కర్నూల్​ జిల్లా కేంద్రంలోని రామాలయంలోశ్రీ రామసహిత వెంకట సత్యనారాయణస్వామి వ్రతాలు చేశారు. జిల్లా కేంద్రంలోని సీతారామస్వామి ఆలయం కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. ప్రాత:కాలంలోనే పరమశివుడికి ప్రత్యేకంగా అభిషేకాలు, అర్చనలు, ఆలయంలో దీపారాధనను శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు ఆలయ ప్రధాన […]

Read More

తుంగ తీరం.. భక్తజన సంద్రం

– తుఫాన్​ జల్లుల్లో పుష్కరస్నానం సారథి న్యూస్​, మానవపాడు: జోగుళాంబ గద్వాల అలంపూర్ లోని జోగులాంబ అమ్మవారి సన్నిధిలో తుంగభద్ర తీరం భక్తి పారవశ్యంతో మునిగిపోయింది. శుక్రవారం పుష్కరఘాట్ కు పెద్దసంఖ్యలో తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. పవిత్ర కార్తీకమాసం కావడంతో భక్తులు తుంగభద్ర నదీమ తల్లిని కార్తీక దీపాలతో ఆరాధిస్తున్నారు. కార్తీకదీపాలు వెలిగిస్తూ అమ్మవారిని, అదేవిధంగా బాలబ్రహ్మేశ్వరుడికి ప్రత్యేకపూజలు చేశారు. ఓ వైపు తుఫాన్ ప్రభావంతో మేఘాలు కమ్మేసి వాన జల్లులు కురుస్తున్నా యాత్రికులు మాత్రం పుష్కర […]

Read More
పంచారామాలకు స్పెషల్​ బస్సులు

పంచారామాలకు స్పెషల్​ బస్సులు

సారథి న్యూస్, శ్రీకాకుళం: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో ప్రముఖ ఆలయాలైన పంచారామాలకు శ్రీకాకుళం నుంచి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సు సర్వీసులను నడిపించనున్నట్లు డీఎం వరలక్ష్మి తెలిపారు. వాటికి సంబంధించిన పోస్టర్లను సోమవారం శ్రీకాకుళంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటకు బస్సు సర్వీసులను నడిపిస్తున్నట్లు వివరించారు. ఈనెల 20 నుంచి ప్రారంభంకానున్న తుంగభద్ర పరిష్కారాల దృష్ట్యా ప్రజలకు అసౌకర్యం కలగకుండా కరోనా నిబంధనలు పాటిస్తూ బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు […]

Read More