Breaking News

కాంగ్రెస్

ప్రభుత్వ భూములను కాపాడండి

ప్రభుత్వ భూములను కాపాడండి

సారథి, పెద్దశంకరంపేట: మెదక్ ​జిల్లా పెద్దశంకరంపేట పట్టణంలో అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములను కాపాడాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం తహసీల్దార్ చరణ్ సింగ్ కు శుక్రవారం ​వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. తిరుమలాపూర్ లో సర్వే నంబర్ 1, 256లో భూములు కబ్జాకు గురవుతున్నాయని తెలిపారు. వాటిని అక్రమ లేఅవుట్లుగా మార్చి విక్రయించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వారు వినతిపత్రంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు రాయని […]

Read More
వంత్​నియామకంతో కాంగ్రెస్ సంబురాలు

రేవంత్​ నియామకంతో కాంగ్రెస్ సంబురాలు

సారథి, పెద్దశంకరంపేట: పీసీసీ అధ్యక్షుడిగా ఏ.రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ​అధిష్టానం నియమించడంతో ఆదివారం మెదక్ ​జిల్లా పెద్దశంకరంపేటలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. స్థానిక గాంధీచౌరస్తా వద్ద టపాసులు కాల్చి ఉత్సవాలు చేసుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు రాజేందర్ గౌడ్, మధుసూదన్, ఎంపీటీసీ రాజు, కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షుడు జనార్ధన్, మధు, రాజేందర్ గౌడ్, జైహింద్ రెడ్డి, హరికిషన్, ఆయా గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More
పేదలకు ఆర్థికసాయం అందజేత

పేదలకు ఆర్థికసాయం అందజేత

సారథి, చొప్పదండి: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినం పురస్కరించుకుని శనివారం పేదలకు సాయం చేశారు. చొప్పదండి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ చార్జ్ మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి కాట్నపల్లి గ్రామంలో కరోనాతో మృతిచెందిన గన్ను నారాయణరెడ్డి కుటుంబానికి రూ.ఐదువేల ఆర్థిక సాయం అందజేశారు. వారి కుటుంబసభ్యులు మేడిపల్లి సత్యంకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు కట్టెకోల లక్ష్మణ్, గ్రామశాఖ అధ్యక్షుడు గన్ను సంతోష్ రెడ్డి, కోలపురి శ్రీకాంత్, […]

Read More
ప్రభుత్వ భూములు అమ్మడం సరికాదు

ప్రభుత్వ భూములు అమ్మడం సరికాదు

సారథి, అచ్చంపేట: ఆదాయం కోసం సర్కారు భూములను అమ్మడం సరికాదని కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా నాయకురాలు, అచ్చంపేట 10వ వార్డు కౌన్సిలర్ సునీతారెడ్డి మండిపడ్డారు. మంగళవారం తన నివాసంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ప్రజా అవసరాలు స్కూళ్లు, ఆస్పత్రులు, గోదాములు తదితర వాటి కోసం ప్రభుత్వ ఆస్తులను వినియోగించాలి కానీ ఇలా విక్రయించడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ఈ ఏడేళ్లలో తెలంగాణ ఆదాయమంతా ఎవరి […]

Read More
జర్నలిస్టుల గొంతు నొక్కడం అప్రజాస్వామికం

జర్నలిస్టుల గొంతు నొక్కడం అప్రజాస్వామికం

సారథి, వేములవాడ: అధికార పార్టీ నాయకుల భూకబ్జాల వ్యవహారాన్ని బయటకు తీస్తున్న జర్నలిస్ట్ రఘును అరెస్టు చేయడం అప్రజాస్వామికమని జోగాపూర్ ఎంపీటీసీ మ్యాకల గణేష్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా భావించే జర్నలిజానికి విలువ లేకపోతే సామాన్య ప్రజలకు భద్రతే లేకుండా పోతుందన్నారు. ప్రజాస్వామ్య దేశంలో రాచరిక పోకడలు మంచిది కాదని హితవుపలికారు. ప్రజలు అధికార పార్టీల పోకడలను నిశితంగా గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని […]

Read More
పేదయువతి పెళ్లికి సాయం

పేదయువతి పెళ్లికి సాయం

సారథి, చొప్పదండి: కాంగ్రెస్ చొప్పదండి నియోజకవర్గ ఇన్ చార్జ్ మేడిపల్లి సత్యం జన్మదినం సందర్భంగా మల్లన్నపల్లె గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన గొల్లె మౌనిక, సురేష్ దంపతుల కూతురు శ్రీవాణి వివాహానికి శనివారం ఆ పార్టీ నాయకులు రూ.5,116 ఆర్థిక సహాయం అందజేశారు. కుటుంబసభ్యులు మేడిపల్లి సత్యంకు కృతజ్ఞతలు తెలియజేసారు. యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు గొల్లె సంపత్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఇప్ప శ్రీనివాస్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్సీసెల్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ […]

Read More
అచ్చే దిన్ కాదు.. సచ్చే దిన్

అచ్చే దిన్ కాదు.. సచ్చే దిన్

సారథి, రామడుగు: బీజేపీ అధికారంలోకి వస్తే అచ్చే దిన్ అని చెప్పారు కానీ ఇప్పుడు ఏడేళ్ల పాలన చూస్తే సచ్చేదిన్ లాగా ఉందని కాంగ్రెస్ బీసీసెల్ చైర్మన్ పులి ఆంజనేయులు విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. తప్పుడు వాగ్దానాలతో దేశ ప్రజలను పక్కదోవపట్టించారని విమర్శించారు. ప్రతి పేదవాడి అకౌంట్లోకి రూ.15లక్షలు, ఏడాదికి రెండుకోట్ల ఉద్యోగాలు, నల్లధనం వెనక్కి తీసుకొస్తామని తప్పుడు ప్రచారంతో రెండోసారి అధికారంలోకి వచ్చారని అన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం కరోనా […]

Read More
మెడికల్ కాలేజ్ ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా?

మెడికల్ కాలేజ్ ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా?

సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లాకు మెడికల్ కాలేజీకి ఉంటే కరోనా విషయంలో ఈ పరిస్థితి ఉండేదా? అని కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షుడు పులి ఆంజనేయులు ప్రశ్నించారు. మంగళవారం రామడుగు మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ మాట కూడా ఎత్తకపోవడం జిల్లా ప్రజలను మోసం చేసినట్లు కాదా? అని ప్రశ్నించారు. మంత్రి గంగుల కమలాకర్, జిల్లా ఎమ్మెల్యేలు కనీసం జిల్లా ప్రజల ఆరోగ్య అవసరాల […]

Read More