కొంతకాలంగా ఏపీ హైకోర్టు తీర్పులపై వైఎస్సార్సీపీ నేతలు, ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా హైకోర్టు తీర్పులను తప్పుపట్టారు. ఈ అంశంపై గురువారం విచారణ చేపట్టిన న్యాయస్థానం స్పీకర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతయుతమైన రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న ఓ వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నది. హైకోర్టు తీర్పులపై ఏమన్నా అభ్యంతరాలు ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్లాలని.. […]
సారథిన్యూస్, అమరావతి: వైఎస్సార్ ఆసరా పేరుతో జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకానికి జగనన్న టోకరా అనే పేరుపెట్టుకోవాలని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. మంగళవారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ‘జగన్ మోహన్‌రెడ్డి ఆసరా పేరుతో మహిళలను మోసగిస్తున్నారు. డ్వాక్రా మహిళలంతా ఆసరా సొమ్ముతోనే బతుకుతున్నట్లు జగన్ తొత్తులు మాట్లాడుతున్నారు. ఈ పథకం జగన్మోహన్రెడ్డి కొత్తగా తీసుకురాలేదు. గత ప్రభుత్వంలోనే చంద్రబాబు డ్వాక్రా మహిళలకు రూ. 5 లక్షల వరకు వడ్డీలేని రుణాలు […]
సారథిన్యూస్, విశాఖపట్టణం: సీఎం జగన్మోహన్రెడ్డి అండతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. దళితులపై వరుస దాడులు జరుగుతుంటే సీఎం జగన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఆదివారం విశాఖపట్టణం జిల్లా తెలుగుదేశంపార్టీ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖలో దళితుడి భూఆక్రమణను ఖండించారు. రాష్ట్రంలో ప్రతిరోజు దళితులపై దాడులు జరుగుతున్నాయన్నారు. జగన్ ఉదాసీన వైఖరితోనే దాడులు పెరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి […]
విజయవాడ: పది మందికి చావుకు కారకుడైన రమేశ్ ఆస్పత్రి యజమాని, పోతినేని రమేశ్‌బాబు ఏ బొక్కలో దాక్కున్నా ఏపీ పోలీసులు వదిలిపెట్టరని.. ఆయనను అరెస్ట్ చేసి తీరుతారని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో దాక్కొని కుట్రలు పన్నుతున్నారని.. దమ్ముంటే ఆంధ్రప్రదేశ్‌కు రావాలని సవాల్ విసిరారు. చంద్రబాబు, పచ్చమీడియా కుట్రలను తిప్పికొడతామన్నారు. పరిహారం విషయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి .. అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. మంగళవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. […]