చెన్నై: ప్రముఖగాయకుడు, గానగాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం అత్యంత విషమంగానే ఉన్నదని ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు తాజాగా హెల్త్‌బులెటిన్‌ను విడుదల చేశాయి. దీంతో ప్రస్తుతం ఎంజీఎం వద్ద తీవ్ర ఉద్విగ్న వాతావరణం నెలకొని ఉన్నది. గురువారం సాయంత్రం నుంచి ఎస్పీ బాలూ ఆరోగ్యం తీవ్రంగా విషమించిందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో తెలుగు ప్రజలు, బాలూ అభిమానులు తీవ్ర ఆందోళనగా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఎంజీఎం దవాఖాన పరిసరాలు మాత్రం కోలాహలంగా మారాయి. ఎంజీఎంకు వెళ్లే దారులన్నీ బాలూ […]
సారథిన్యూస్, హైదరాబాద్: గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని, ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌రావు ఆకాంక్షించారు. ఈమేరకు ఆయన గురువారం ట్వీట్ చేశారు. ఎస్పీ బాలు కరోనాతో చెన్నైలోని ఎంజీఎం దవాఖానలో చికిత్సపొందుతున్నారు. ఆయన ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉన్నదని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని యావత్ దేశం ప్రార్థిస్తోంది. అభిమానులతో పాటు సినీ, రాజకీయ, పారిశ్రామిక, క్రీడా ప్రముఖులు కూడా బాలు ఆరోగ్యం మెరుగుపడాలని […]
చెన్నై: కరోనాతో చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కాగా ఆయనకు ఇంకా వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నారు. ఎస్పీ బాలుకయ్యే వైద్య ఖర్చులను తమిళనాడు ప్రభుత్వమే భరిస్తుందని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్ ప్రకటించారు. బాలూ.. తొందరగా రా..బాలు ఆరోగ్యం విషమించినట్లు తెలియగానే మాస్ట్రో ఇళయరాజా కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. […]
చెన్నై: ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ మేరకు వారు శుక్రవారం ఓ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఈ నెల 5న బాలుకు కరోనా సోకడంతో చెన్నైలోని ఏజీఎం ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. బాలు పరిస్థితి విషమంగా ఉండడంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. […]