సారథి న్యూస్, రామగుండం: చిరుత పులి సంచరిస్తున్న నేపథ్యంలో పరిసర గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సూచించారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఫారెస్ట్అధికారులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వారం రోజులుగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని జనగామ శివారులో చిరుత పులి సంచరిస్తోందని, శివారు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా వెళ్లొద్దని సూచించారు. సమావేశంలో నగర మేయర్ అనిల్ కుమార్, అడవిశాఖ […]
సారథి న్యూస్, రామగుండం: మహనీయుల జీవితాలను యువకులు ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. నేషనల్ యూత్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక శ్రీరామ విద్యానికేతన్ ఆవరణలో సావిత్రిబాయి పూలే 190వ జయంతి, స్వామి వివేకానంద 150వ జయంతి, జాతీయ యువజన వారోత్సవాలను ప్రారంభించారు. అనంతరం విజేతలకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. యూత్ ప్రాజెక్ట్ రాష్ట్ర అధ్యక్షుడు కె.యాదవరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, […]
సారథి న్యూస్, రామగుండం: నియోజకవర్గంలో ఉన్న రైతులు, ప్రజాప్రతినిధులు,కార్మికులు, కర్షకులు, అన్నివర్గాల ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలనిఎమ్మెల్యే కోరుకంటి చందర్ దుర్గాదేవిని వేడుకున్నారు. శుక్రవారం క్యాంపు ఆఫీసులో చండీయాగం నిర్వహించారు. లోక కళ్యాణార్థమే ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టానని ఎమ్మెల్యే అన్నారు. కరోనా నుంచి ప్రపంచమంతా కోలుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నగర మేయర్, కార్పొరేటర్లు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, రామగుండం: తెలంగాణ అడపడుచులు ఇంటింటా ఉత్సాహంగా జరుపుకునే బతుకమ్మ పండుగకు పెద్దన్నగా, మేనమామ, తండ్రిగా సీఎం కేసీఆర్ గారు చీరెలను అందిస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శుక్రవారం కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్ లో మేయర్ బంగి అనిల్ కుమార్ తో కలిసి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.317 కోట్లు ఖర్చుచేసి కోటి మంది మహిళలకు ప్రభుత్వం బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తుందన్నారు. 287కు పైగా డిజైన్ల […]
సారథి న్యూస్, రామగుండం: స్థానిక మున్సిపల్ ఆఫీస్ నుంచి 5 ఇంక్లయిన్వరకు రోడ్డు విస్తరణ పనులను కంపెనీ చేపట్టాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్అర్జీ-1 ఏరియా జీఎం కె.నారాయణను కోరారు. తిలక్ నగర్ సెంటర్ ఏరియాలో రోడ్లు వేయించాలని, అన్నివర్గాల ప్రజలకు కమ్యూనిటీ హాల్ స్థలం కేటాయించాలని కోరారు. అర్జీ-1 ఏరియాలో కరోనా నియంత్రణకు తీసుకున్న చర్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట రామగుండం మేయర్ బంగి అనిల్ కుమార్, పర్సనల్ మేనేజర్ రమేష్, డీజీఎం […]
సారథి న్యూస్, రామగుండం: వ్యవసాయ రంగానికి సాగునీరు అందించే మహాసంకల్పంతో మఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన అపర భగీరథ ప్రయత్నం సఫలం కావడంతో గోదావరికి జలకళ సంతరించుకుందని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గోదావరి నదీతీరాన్ని పర్యాటక హబ్‌గా మార్చనున్నట్లు ప్రకటించారు. ఆదివారం గోదావరి నది వద్ద అడ్వంచర్ అండ్ అక్వా, టూరిజం డెవలప్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బోట్ డ్రైవింగ్, లైఫ్ గార్డ్, రెస్క్యూ ఆపరేషన్ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. సమైక్యపాలనలో […]
సారథి న్యూస్, రామగుండం: మొహర్రం త్యాగాలకు ప్రతీక అని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఆదివారం అంతర్గాం మండలంలోని లింగాపూర్ గ్రామంలో ప్రతిష్టించిన పీర్లకు మొక్కులు చెల్లించుకున్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ప్రార్థించినట్లు తెలిపారు. మాజీ కౌన్సిలర్ అంజలి తల్లి మృతిచెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదారారు. అనంతరం అలీ కుటుంబాన్ని పరామర్శించారు, ఎమ్మెల్యే వెంట జడ్పీటీసీ అమ్ముల నారాయణ, జహిద్ బాషా ఉన్నారు.
సారథి న్యూస్, రామగుండం: మానవత్వం మంటగలుస్తున్న నేటి పరిస్థితిల్లో మానవీయతను చాటుకున్నారు పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. అనార్థులకు అసరాగా, అనాథలకు అదుకోవడమే లక్ష్యంగా విజయమ్మ ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే శనివారం గోదావరిఖని పట్టణంలోని స్థానిక చౌరస్తాలో ఓ అనాథ వృద్ధురాలిని తన వాహనంలోనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాంధీనగర్ లో చెత్తకుండిలో పక్కన ఉన్న ఓ వృద్దురాలిని షెల్టర్‌కు తరలించి మానవీయతను చాటుకున్నారు. మంత్రి కె.తారక రామారావు […]