ఆయనో ప్రజాప్రతినిధి.. తమ సమస్యలను పరిష్కరిస్తాడని, తమ కష్టాలను తీరుస్తాడని ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్నారు. కానీ పార్లమెంట్‌కు వెళ్లిన సదరు ఎంపీ అశ్లీల వీడియోలు చూస్తూ మీడియాకు అడ్డంగా దొరికారు. అదృష్టవశాత్తు ఆయన మనదేశపు ఎంపీ కాదు. థాయిలాండ్ చోన్బూరి ప్రావిన్స్ ఎంపీ రోన్నాథెప్ అనువత్. గురువారం థాయిలాండ్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రసంగంపై చర్చ జరుగుతున్నది. ఎంపీ గారికి బడ్జెట్ ప్రసంగం బోర్‌కొట్టినట్టుంది. వెంటనే ఫోన్ తీసి బూతు వీడియోలు ఓపెన్ చూశాడు. తాను పార్లమెంట్లో ఉన్నానని.. […]
సారథి న్యూస్, అమరావతి: అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయిన దుర్గాప్రసాద్‌కు పేదల నేతగా ప్రజల్లో పేరుంది. నిత్యం ప్రజలతో కలిసిమెలిసి ఉంటే దుర్గాప్రసాద్ నిరాడంబరంగా మెలిగేవారు. తన అనుచరులను నిత్యం పేరుపెట్టి పిలుస్తూ పలకరించేవారు. ఏ కష్టమొచ్చినా వెంబడే స్పందించారు. అలాంటి నేత తమ మధ్య లేకపోవడంతో కార్యకర్తలు నిర్ఘాంతపోయారు. ఇదీ రాజకీయ చరిత్ర..టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పిలుపుతో 26 ఏళ్ల వయస్సులోనే దుర్గాప్రసాద్ రాజకీయాల్లోకి వచ్చారు. అంతకు ముందు ఆయనకు నెల్లూరు మంచి లాయర్‌గా పేరు ఉండేది. […]
తిరుపతి వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ బుధవారం సాయంత్రం కన్నుమూశారు. కొంత కాలంగా కరోనాతో అనారోగ్యంతో బాధపడుతున్న దుర్గాప్రసాద్ చైన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే హఠాత్తుగా గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 28 ఏళ్లకే ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. దుర్గా ప్రసాద్ గతంలో చంద్రబాబు హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. 2019లో వైఎస్సార్ సీపీలో చేరి తిరుపతి ఎంపీగా విజయం […]
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ కోవిడ్ బారినపడ్డారు. ఇటీవల నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఆయన స్వయంగా వెల్లడించారు. వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్‌లో హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని ఆయన చెప్పారు.
సారథి న్యూస్, నర్సాపూర్: ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వ్యాధిని నివారించాలంటే ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మాజీ మంత్రి సునీతారెడ్డి పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటించాలని, రోజువారి కూలి చేసుకుని వారి పరిస్థితి దయనీయస్థితిలో మారిందన్నారు. ప్రతిఒక్కరూ ఇళ్ల నుంచి బయటకు వెళ్లకుండా ఎదుర్కోవాలని ప్రజలకు సూచించారు. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్తే మాస్కులు ధరించి దూరం పాటించాలన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా నర్సాపూర్ […]