సామాజిక సారథి, వలిగొండ: మండల కేంద్రంతో పాటు వేములకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బుధవారం రాష్ట్ర కుష్టువ్యాధి నిపుణులు డిప్యూటీ మెడికల్ అధికారి వెంకటేశ్వర చారి, అసిస్టెంట్ మెడికల్ అధికారి రాములు పాల్గొని రికార్డులు, రిపోర్టులు పరిశీలించి వైద్య బృందానికి తగు సూచనలు చేశారు. రోగులకు కుష్టు వ్యాధి నిర్దారణ అయిన వెంటనే ప్రాథమిక దశలోనే మందులు వాడితే వ్యాధి నయమవుతుందని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సుమన్ కళ్యాణ్, శ్రీనివాస్ రెడ్డి, సతీష్, వీణ, పవన్ తేజ, […]
సారథిన్యూస్, రామడుగు: కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రజలకు మానసిక ఆరోగ్యం ఎంతో అవసరమని తెలంగాణ సైకాలజిస్ట్ అసోషియేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎజ్రా మల్లేశం పేర్కొన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఆయన కరీంనగర్ జిల్లా రామడుగులో ఆన్లైన్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా ప్రపంచాన్నివణికిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి అయిలయ్య, రేష్మ, శివ కుమార్, ఆర్ సుధాకర్ రావు, […]
సారథి న్యూస్, హెల్త్‌డెస్క్: ఇటీవల పెద్దలు, మధ్యవయస్సువాళ్లు కూడా నిద్రలేమితో బాధపడుతున్నారు. నిద్రలేమితో ఎన్నో ఆరోగ్యసమస్యలు తలెత్తుతాయని వైద్యులు సూచిస్తున్నారు. స్మార్ట్ఫోన్లకు బానిసలుగా మారుతున్న యువత సరైన నిద్రలేకపోవడంతో డిప్రెషన్, తలనొప్పి వంటి అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు 8గంటలపాటు నిద్రించాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. కొన్ని సులభమైన చిట్కాలు పాటించి నిద్రలేమి సమస్యను దూరం చేసుకోవచ్చు. రాత్రి పడుకొనేముందు ఒక అరటిపండు తింటే శరీరంలో అన్ని అవయవాలకు క్రమపద్ధతిలో రక్తం సరఫరా అవుతుంది. దీనివల్ల […]
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ (84) ఆరోగ్యపరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నది. ఆయన ఆరోగ్యపరిస్థితిలో ఏ మార్పు లేదని.. ప్రణబ్‌కు చికిత్స అందిస్తున్న ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రి తెలిపింది. ఈ మేరకు ఆదివారం ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులిటెన్ విడుదల చేశాయి. ఈ నెల 10న ఆర్మీ ఆస్పత్రిలో చేరిన ప్రణబ్‌కు వైద్యులు ఆపరేషన్ చేసి మెదడులో ఏర్పడిన అడ్డంకిని తొలగించిన విషయం తెలిసిందే. దాంతోపాటు ఆయనకు కోవిడ్–19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. […]
సారథిన్యూస్, హైదరాబాద్: గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని, ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌రావు ఆకాంక్షించారు. ఈమేరకు ఆయన గురువారం ట్వీట్ చేశారు. ఎస్పీ బాలు కరోనాతో చెన్నైలోని ఎంజీఎం దవాఖానలో చికిత్సపొందుతున్నారు. ఆయన ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉన్నదని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని యావత్ దేశం ప్రార్థిస్తోంది. అభిమానులతో పాటు సినీ, రాజకీయ, పారిశ్రామిక, క్రీడా ప్రముఖులు కూడా బాలు ఆరోగ్యం మెరుగుపడాలని […]
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యపరిస్థితి విషమంగానే ఉంది. ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్టు ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి సోమవారం ప్రకటన విడుదల చేసింది. కాగా, ప్రణబ్ శరీరం చికిత్సకు కొంతమేర సహకరిస్తున్నదని వారు చెప్పారు. ప్రణబ్ ముఖర్జీ ఈ నెల 10న ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చేరారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆయనకు ఓ మేజర్ శస్త్రచికిత్స చేశారు వైద్యులు. తర్వాత ఆయనకు కరోనా కూడా సోకడంతో పరిస్థితి మరింత విషమించింది. ప్రస్తుతం ట్రీట్మెంట్ […]
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రణబ్ ముఖర్జీ (84) ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉన్నదని ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. ఆయన ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నారని గురువారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో వెల్లడించారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై ఉండి చికిత్స పొందుతున్నారు. శరీర అవయవాలన్నీ సక్రమంగానే పనిచేస్తున్నాయని.. గుండె నుంచి శరీర భాగాలకు రక్త సరఫరా సాధారణంగానే ఉందని వివరించారు. ఇటీవల ఆయనకు […]
నిమ్మకాయలను ఆహారంగా తీసుకోవడం వల్లే కాదు.. ఇంట్లో ఉంచుకున్నా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అదెలాగో చూడండి. నిమ్మ కాయలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలిసిందే. వాటిని ఆహారంలో కలుపుకున్నా.. రసం తీసుకుని తాగినా ఆరోగ్యానికి మంచిది. నిమ్మలో విటమిన్-సీ, కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఉదయాన్నే గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగితే బరువు తగ్గుతారు. వేసవిలో వేడి నుంచి ఉపశమనం పొందేందుకు నిమ్మరసం ఎనర్జీ డ్రింక్‌లా పనిచేస్తుంది. అయితే, నిమ్మకాయలను […]