సారథి న్యూస్, హైదరాబాద్: ఈ నెలాఖరులో వస్తున్న మొహర్రంపై వివిధ శాఖల అధికారులతో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్రహోంశాఖ మంత్రి మహమూద్ అలీ డీఎస్ఎస్ భవన్ లోని సమావేశ మందిరంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. కరోనా మహమ్మారి తీవ్రత నేపథ్యంలో కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ పండగ జరుపుకునేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో ఎమ్మెల్యే అహ్మద్ బాషాఖాద్రి, మైనారిటీ శాఖ సలహాదారు ఏకే ఖాన్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో మంగళవారం 1,896 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 82,647కి చేరింది. కరోనాతో తాజాగా 8 మంది మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య 645కు చేరింది. కరోనా బారి పడి ఒక్కరోజే 1,788 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనాను జయించిన వారి సంఖ్య 59,374 చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 22,628 ఉన్నాయి. రాష్ట్రంలో తాజాగా 18,035 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. దీంతో […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో సోమవారం కొత్తగా 1,256 కరోనా కేసులు నమోదయ్యాయి. పాజిటివ్కేసుల నిర్ధారణ 80వేల మార్క్‌ను దాటింది. రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య 80,751కు చేరింది. తాజాగా మహమ్మారి బారినపడి 10 మంది మృతిచెందారు. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 637 కు చేరింది. కరోనా నుంచి తాజాగా 1,587 మంది డిశ్చార్జ్ అయ్యారు. వ్యాధి బారినపడి 57,586 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22,528 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో […]
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వచ్చే మూడు రోజుల పాటు వాతావరణం ఇలాగే ఉంటుందని అంచనా వేస్తున్నారు. సోమవారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి భారీవర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం పశ్చిమ బెంగాల్ ప్రాంతాల మీదుగా విస్తరించి ఉంది. దీని ప్రభావంతో మోస్తరు నుంచి భారీ […]
సారథి న్యూస్, హైదరాబాద్: సీఎం కేసీఆర్ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు సమర్థవంతమైన, కచ్చితమైన సేవలు అందించేందుకు ఈ-ఆఫీసును ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. బీఆర్కేఆర్భవన్లో కొనసాగుతున్న సెక్రటేరియట్ లోని 8 ప్రభుత్వ శాఖల్లో సేవలను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ-ఆఫీసు ద్వారా పారదర్శకమైన, బాధ్యతాయుతంగా, వేగంగా ప్రాసెస్ చేయడానికి వీలు కలుగుతుందన్నారు. ఎక్కడి నుంచైనా పనిచేయడానికి వీలవుతుందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 15 శాఖల్లో అమలు చేస్తున్నామని […]
భయంతోనే ఎక్కువ మంది చనిపోతున్నారు తెలంగాణ రాష్ట్రమంతా ఒకే వైద్యావిధానం డాక్టర్లతో వైద్యాశాఖ మంత్రి ఈటల వీడియోకాన్ఫరెన్స్ సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా ట్రీట్మెంట్కు సంబంధించి తెలంగాణ రాష్ట్రమంతా ఒకే వైద్యవిధానాన్ని అనురిస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. సోమవారం ఆయన రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, వైద్యనిపుణులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వచ్చినవారు జబ్బుతో కంటే భయంతోనే ఎక్కువ మంది చనిపోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. పాజిటివ్ నిర్ధారణ అయిన పేషెంట్లో ధైర్యం నింపాలని పిలుపునిచ్చారు. […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి పెరుగుతోంది. ఈ క్రమంలో ఆదివారం 1,891 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 66,677కు చేరింది. తాజాగా 10 మంది కరోనా వ్యాధిబారినపడి మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు మృతుల సంఖ్య 540కు చేరింది. రాష్ట్రంలో 18,547 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఒక్కరోజులో 1088 మంది డిశ్చార్జ్అయ్యారు. జీహెచ్ఎంసీ పరిధితో అత్యధికంగా 517 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. […]
సారథి న్యూస్, హైదరాబాద్: ప్రస్తుతం కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. ప్రస్తుతం సామూహిక వ్యాప్తి దశలో ఉందని, మరో నాలుగు వారాలు చాలా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు, నిపుణులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఈ క్రమంలో సినీనటుడు అమితాబచ్చన్ నుంచి.. హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ వరకూ.. కరోనా సోకిన ప్రముఖుంతా తమ ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ, కరోనా సోకినా అధైర్యపడాల్సిన అవసరం లేదని ప్రజలకు సందేశాలిస్తున్నారు. తద్వారా బాధితుల్లో మనోధైర్యాన్ని నింపుతున్నారు. ఇలా చెప్పడం ద్వారా చుట్టుపక్కల […]