సారథి న్యూస్, సూర్యాపేట: చైనా సైనికుల దొంగ దాడిలో అసువులు బాసిన సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని సోమవారం సీఎం కె.చంద్రశేఖర్‌రావు పరామర్శించారు. కల్నల్ సంతోష్ బాబు సతీమణి సంతోషి, ఆయన పిల్లలు, తల్లిదండ్రులను పలకరించారు. వారిని చూసి సీఎం ఒకింత ఉద్వేగానికి గురయ్యారు. పిల్లలు సీఎంకు నమస్కరించారు. అనంతరం సంతోష్ బాబు సతీమణికి గ్రూప్1 ఉద్యోగ నియామకపత్రంతో పాటు రూ.ఐదుకోట్ల విలువైన చెక్కు, 570 గజాల ఇంటిస్థలం డాక్యుమెంట్లను అందజేశారు. సీఎం వెంట […]
సారథి న్యూస్, సూర్యాపేట: గాల్వన్ లోయలో చైనా సైనికులు జరిపిన దాడిలో మృతిచెందిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఈనెల 22న సీఎం కేసీఆర్ సూర్యాపేటకు రానున్నారని మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. శనివారం కల్నల్ కుటుంబసభ్యులను మంత్రి పరామర్శించారు. భవిష్యత్‌లో కుటుంబ అవసరాల రీత్యా రూ.ఐదుకోట్ల నగదు, ఇంటి జాగా ఇవ్వాలని సీఎం కేసీఆర్ ప్రకటించారని తెలిపారు. అలాగే సంతోష్‌బాబు సతీమణికి గ్రూపు 1 ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారని వెల్లడించారు.
సారథి న్యూస్, సూర్యాపేట: భారత్ సరిహద్దుల్లో చైనా దొంగ దెబ్బకు అమరుడైన కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహం బుధవారం హైదరాబాద్‌లోని హకీంపేట విమానాశ్రయానికి చేరింది. వీరజవాన్ పార్థివదేహానికి తెలంగాణ గవర్నర్ తమిళిసైతో మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. సంతోష్‌బాబు భార్య, పిల్లలు కూడా అక్కడే ఉన్నారు. ప్రత్యేకంగా అంబులెన్స్‌లో సంతోష్‌బాబు పార్థివదేహాన్ని సూర్యాపేటకు తరలించారు. తొలుత హైదరాబాద్‌లోనే అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులు […]
సారథి న్యూస్, హైదరాబాద్: భారత్ -చైనా సరిహద్దు ఘర్షణలో వీరమరణం చెందిన కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు పార్థివదేహం బుధవారం హకీంపేట విమానాశ్రయానికి చేరింది. కల్నల్ సంతోష్ పార్థివదేహానికి గవర్నర్ తమిళిసైతో పాటు మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి నివాళులు అర్పించారు. గురువారం ఉదయం సూర్యాపేటలోని కేసారంలో కల్నల్ సంతోష్ అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో జరగనున్నాయి. అంతిమ యాత్ర కోసం అధికారులు ప్రత్యేక వాహనాన్ని సిద్ధంచేశారు.
సారథి న్యూస్, హైదరాబాద్: ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో అమరజవాన్ కల్నల్ సంతోష్ బాబు సతీమణి, పిల్లలు బుధవారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ వారిని రిసీవ్ చేసుకున్నారు. అమరజవాన్ కుటుంబసభ్యులతో సీపీ, ఇతర పోలీస్ అధికారులు చాలా సేపు వారితో మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు. వారిని ప్రత్యేక వాహనంలో సూర్యాపేటకు తీసుకెళ్లనున్నారు. మంగళవారం చైనా బలగాల దొంగ దెబ్బకు కల్నల్ సంతోష్‌బాబు అసువులు బాసిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో […]
సారథి న్యూస్, సూర్యాపేట: తెలంగాణ భూముల్లో బంగారు పండుతుందని విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ప్రపంచ దేశాలకు కావలసిన ఆహార ఉత్పత్తులను పండించగల సామర్థ్యం ఇక్కడి భూములకు ఉందన్నారు. ఇక మిగిలింది పంటకు గిట్టుబాటు ధర కల్పించడమేనని ఆయనన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో రుణమేళా సదస్సులో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ రూపొందించిన నియంత్రిత సాగులో రైతులను సంఘటితం చేయడమేనని అన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్. […]
సారథి న్యూస్, సూర్యాపేట : సూర్యాపేటలో కరోనా టెస్టులు చేయడం లేదంటూ బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి సంకీనేని వరుణ్ రావు వేసిన పిల్ పై విచారణ చేసి సూర్యాపేటలో టెస్ట్ లు చేయాల్సిందేనని మంగళవారం హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర చౌహన్, జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి తో కూడిన ధర్మాసనం మూడు గంటల పాటు విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వానికి ఏమైన ప్రత్యేక రాజ్యాంగం ఉన్నదా.. ?అంటూ మండిపడింది. […]
క్వారంటైన్‌కు ఇద్దరి తరలింపు సారథి న్యూస్, సూర్యాపేట : సూర్యాపేట జిల్లా, కోదాడ మండలం కూచిపూడి గ్రామంలో కరోనా కలకలం చెలరేగింది. కూచిపూడి గ్రామస్తులతో బంధుత్వం కలిగిన ఓ వ్యక్తి హైదరాబాద్‌లో ఎస్సైగా పనిచేస్తున్నాడు. ఆయన ఇటీవల అనారోగ్యానికి గురికాగా గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు హైదరాబాద్ వెళ్లి ఆయనను పరామర్శించి వచ్చారు. అయితే ఆ ఎస్సైకి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ రావడంతో ఆయనను కలిసిన వారిపై అధికారులు దృష్టి సారించారు. ఈ క్రమంలో […]