Breaking News

సీఎం కేసీఆర్

దాశరథి చైతన్య స్ఫూర్తిని కొనసాగిస్తాం

దాశరథి చైతన్య స్ఫూర్తిని కొనసాగిస్తాం

సారథి న్యూస్, హైదరాబాద్: దాశరథి కృష్ణమాచార్యులు తెలంగాణ సాహితీ యోధుడని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్​రావు అన్నారు. ఆయన అందించిన ఉద్యమ చైతన్య స్ఫూర్తిని కొనసాగిస్తామని చెప్పారు. దాశరథి కృష్ణమాచార్యుల 96వ జయంతిని పురస్కరించుకుని ఆయనకు నివాళులు అర్పించారు. దాశరథి రగిలించిన చైతన్య స్ఫూర్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించేందుకు కావాల్సిన సంకల్ప బలాన్ని ఇచ్చిందని కొనియాడారు. సాహిత్యరంగానికి ఆయన అందించిన సేవలకు గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వం ఏటా అధికారికంగా ఆయన జయంతి వేడుకలను నిర్వహిస్తూ.. అవార్డులను […]

Read More
ప్రాజెక్టులు కంప్లీట్​కావాలె

ప్రాజెక్టులు కంప్లీట్ ​కావాలె

గోదావరి నుంచి 4, కృష్ణా నుంచి 3 టీఎంసీల నీటిని తరలించాలి సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరావు సారథి న్యూస్, హైదరాబాద్: నిధుల సమీకరణకు సంబంధించిన ప్రక్రియను వెంటనే పూర్తిచేసి, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మూడో టీఎంసీని తరలించే పనులతో పాటు, పాలమూరు- రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టు, సమ్మక్క బ్యారేజీ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ‘రాష్ట్రంలోని ప్రాజెక్టులు.. వాటికి నిధుల సమీకరణ’పై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రగతి భవన్ లో […]

Read More
మా పెళ్లికి రండి

మా పెళ్లికి రండి

ప్రముఖ టాలీవుడ్​ హీరో నితిన్​ సోమవారం తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్​రావును ప్రగతిభవన్​లో కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందజేసి.. తమ పెళ్లికి రమ్మని ఆహ్వానించారు. నితిన్, షాలిని వివాహం 16న జరగాల్సి ఉండగా లాక్​డౌన్​తో వాయిదాపడింది. దీంతో జూలై 26న రాత్రి 8.30 నిమిషాలకు వీరి పెళ్లికి ఇరుకుటుంబాల పెద్దలు ముహూర్తం పెట్టించారు. హైదరాబాద్​లోని ఫలక్ నుమా ప్యాలస్​లో పెళ్లి జరుగనున్నట్టు సమాచారం.

Read More
గవర్నర్​ను కలిసిన సీఎం కేసీఆర్

గవర్నర్​ను కలిసిన సీఎం కేసీఆర్

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్​రాజన్ ను సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాజ్ భవన్ లో కలిశారు. హైదరాబాద్ మహానగరంలో బోనాల పండుగ శుభసందర్భంగా కలిసి బొకే అందజేశారు. అమ్మవారిని పూజించి కరోనా వైరస్ నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడాలని వేడుకోవాలని గవర్నర్​ను కోరారు.

Read More

రైతుల కోసం వేలకోట్లు

సారథి న్యూస్​, హుస్నాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ రైతుల కోసం వేలకోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారని హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీశ్​కుమార్​ పేర్కొన్నారు. గురువారం హుస్నాబాద్, అక్కన్నపేట మండలం పందిల్ల, జనగాం గ్రామాల్లో రైతు వేదికలకు భూమి పూజ చేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి వేల కోట్లు వెచ్చిస్తున్నారన్నారు. దేశానికే వెన్నెముకయిన అన్నదాతల్లో నూతన వ్యవసాయ విధానాలు అమలు కావడానికి ఈ వేదికలు తొడ్పతయన్నారు. కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ రాజిరెడ్డి, ఎంపీపీలు మానన, లక్ష్మి, జడ్పీటీసీలు […]

Read More
స్కూళ్ల ఓపెనింగ్ పై త్వరలోనే నిర్ణయం

స్కూళ్ల ఓపెనింగ్ పై త్వరలోనే నిర్ణయం

విద్యావేత్తలు, విషయ నిపుణుల అభిప్రాయాలు తీసుకుందాం విద్య పేరుతో జరుగుతున్న దోపిడీని అరికడదాం యూజీసీ, ఏఐసీటీఈ మార్గదర్శకాలు పాటించాలి ఆగస్టు 17నుంచి ఇంజనీరింగ్ విద్యాసంవత్సరం విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్​ సారథి న్యూస్, హైదరాబాద్: విద్యావ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి, ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేసేందుకు దీర్ఘకాలిక వ్యూహం రూపొందించి అమలుచేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. స్కూళ్లను ప్రారంభించే విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. విద్యావేత్తలు, విషయ నిపుణులతో వెంటనే సమావేశం నిర్వహించి, అభిప్రాయాలు […]

Read More

ప్రజాశ్రేయస్సే లక్ష్యం

సారథి న్యూస్, నారాయణఖేడ్: సీఎం కేసీఆర్​ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమ నిరంతరం పాటుపడుతున్నారని నారాయణఖేడ్​ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్​రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా కల్హేర్​ మండలంలోని పలు గ్రామల్లో ఎమ్మెల్యే పర్యటించారు. బీబీపేట, ఫతేపూర్​ తండాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా కల్హేర్ మండలంలో పలుచోట్ల మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఆయాగ్రామాల సర్పంచులు, టీఆర్​ఎస్​ నాయకులు పాల్గొన్నారు.

Read More

పెండింగ్‌.. పెండింగ్‌

గుట్టలుగా పేరుకుపోతున్న ఫైల్స్​ తిరిగి తిరిగి వేసారిపోతున్న బాధితులు సారథి న్యూస్​, హైదరాబాద్​: పెండింగ్​.. పెండింగ్​.. పెండింగ్​.. పలు కీలకమైన అంశాలకు సంబంధించిన ఫైళ్ల గురించి రాష్ట్ర ప్రభుత్వంలోని ఏ ఉన్నతాధికారిని అడిగినా ఇప్పుడు వారి నోటి నుంచి వస్తున్న మాట ఇదే. తాత్కాలిక సచివాలయం(బీఆర్కే భవన్‌) నుంచి ముఖ్యమంత్రి కార్యాలయం (మెట్రో రైల్‌ భవన్‌, బేగంపేట) దాకా ఇదే పరిస్థితి నెలకొంది. అత్యవసరం, అనివార్యమైతే తప్ప మిగతా దస్త్రాలను ముట్టకోని పరిస్థితి నెలకొంది. దీంతో మూడు […]

Read More