సారథి న్యూస్, హైదరాబాద్: గవర్నర్ తమిళ్సై సౌందర్‌రాజన్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం రాజ్ భవన్ లో మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు. అనంతరం పలు విషయాలపై చర్చించారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు, కరోనా వ్యాప్తి, నివారణ చర్యలు.. తదితర అంశాలపై గవర్నర్ తో చర్చించారు. అనంతరం తమిళ్సై బాబాయ్ మృతిచెందడంతో ముఖ్యమంత్రి పరామర్శించారు. తమిళనాడులోని కన్యాకుమారి లోక్ సభ సభ్యుడు వసంత కుమార్ కరోనాతో ఇటీవల కన్నుమూసిన తెలిసిందే. వసంత కుమార్ ప్రస్తుతం తమిళనాడు […]
ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ లు, యూనిట్లు ఏర్పాటుకు ప్రోత్సాహం కూలీల సంక్షోభం పోవాలి.. యాంత్రీకరణ పెరగాలి నాబార్డ్ చైర్మన్, అధికారుల సమావేశంలో సీఎం కేసీఆర్ సారథి న్యూస్, హైదరాబాద్: దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చాలని సీఎం కె.చంద్రశేఖర్ రావు సూచించారు. వ్యవసాయాధారిత పరిశ్రమలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం, నాబార్డు లాంటి సంస్థలు ప్రత్యేక ప్రణాళికలు అమలుచేయాలని కోరారు. నాబార్డ్ చైర్మన్ చింతల గోవిందరాజులు గురువారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజల కలలను సీఎం కె.చంద్రశేఖర్‌రావు నెరవేర్చుతున్నారని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అన్నారు. బుధవారం ఆమె అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. పాలకుడి సంకల్పం గట్టిగా ఉంటే ఆ దేవుడు కూడా కరుణిస్తాడని, రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షాలు నిరూపించాయని అన్నారు. ప్రాజెక్టులు, చెరువులు జలకళను సంతరించుకుని రైతుల కళ్లల్లో సంతోషం చిగురించేలా చేశాయన్నారు. నల్లగొండకు గోదావరి, కృష్ణాజలాలను తరలించి సీఎం కేసీఆర్ రైతుల పాలిట దేవుడయ్యారని కొనియాడారు. […]
సారథి న్యూస్, హైదరాబాద్: యూనివర్సిటీ వైస్ చాన్సలర్ల(వీసీ) నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. వీసీల నియామకానికి సంబంధించి ఇప్పటికే సెర్చ్ కమిటీల నియామకం పూర్తయిందని, తుది కసరత్తు జరుగుతోందని వివరించారు. సెప్టెంబర్ 7 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, చర్చించాల్సిన అంశాలపై సీఎం కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలతో బుధవారం ప్రగతి భవన్ లో చర్చించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నియామకంలో జాప్యం జరిగిందన్నారు. ఇక ఏమాత్రం ఆలస్యం […]
సారథి న్యూస్, హైదరాబాద్: సీఎం కె.చంద్రశేఖర్ రావు శనివారం వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ లో కుటుంబ సమేతంగా వినాయకుడికి పూజచేశారు. మంత్రి కె.తారక రామారావు సతీమణి శైలిమా, కుమారులు, కుమార్తె, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ కుటుంబ సభ్యులు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్, తెలంగాణ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
శ్రీశైలం పవర్ హౌస్ మంటల్లో చిక్కుకుని మృత్యువాత తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తంచేసిన సీఎం కేసీఆర్ సీఐడీ విచారణకు ఆదేశాలు సారథి న్యూస్, అచ్చంపేట: ఎటుచూసినా చిమ్మ చీకటి.. చుట్టూ దట్టమైన పొగలు.. ఎక్కడ చిక్కిన వారంతా అక్కడే ప్రాణాలు విడిచారు. తెలంగాణ పరిధిలోని పాతాళగంగ శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించి 9మంది దుర్మరణం పాలయ్యారు. ఒకరు డీఈ, నలుగురు ఏఈ స్థాయి అధికారులు ఉన్నారు. మిగతావారు సిబ్బంది ఉన్నారు. జెన్కో మొదటి యూనిట్‌లోని […]
సారథి న్యూస్, చిన్నశంకరంపేట: ప్రజలంతా జాగ్రత్తలు పాటించి కరోనా మహమ్మారిని జయించాలని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి సూచించారు. కరోనా వచ్చినవారు భయపడాల్సిన అవసరం లేదని.. దేశంలో 70 శాతం మంది వ్యాధి నుంచి కోలుకుంటున్నారని ఆమె భరోసా కల్పించారు. బుధవారం మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలకేంద్రంలో ఆమె పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజలు కూడా కరోనా రోగులపై వివక్ష చూపించవద్దని కోరారు. కరోనా వచ్చినంతమాత్రాన వారి కుటుంబాలను […]
సారథి న్యూస్, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు జన్మదినం సందర్భంగా సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ప్రజలకు సేవలు అందించాలని సీఎం ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ కు ఎంపీ పోతుగంటి రాములు కృతజ్ఞతలు తెలిపారు.